Brahmamudi 01 Nov Today Episode : తనకు కడుపు లేదని విషయం తెలియడంతో కావ్య మీదికి నెట్టేసిన స్వప్న.. ఇద్దరినీ బయటికి గెంటేసిన రుద్రాణి | The Telugu News

Brahmamudi 01 Nov Today Episode : తనకు కడుపు లేదని విషయం తెలియడంతో కావ్య మీదికి నెట్టేసిన స్వప్న.. ఇద్దరినీ బయటికి గెంటేసిన రుద్రాణి

Brahmamudi 01 Nov Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 01 నవంబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 242 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ ప్రియకు ఫోన్ చేసి వెంటనే నువ్వు ఇంటికి వచ్చి నిజం చెప్పాలి అంటుంది రుద్రాణి. నన్ను మీ ఫ్యామిలీ విషయాల్లోకి లాగకండి అని వేడుకుంటుంది డాక్టర్ ప్రియ. కానీ.. రుద్రాణి మాత్రం అస్సలు వినదు. నువ్వు ఇచ్చిన రిపోర్ట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. […]

 Authored By gatla | The Telugu News | Updated on :1 November 2023,8:00 am

ప్రధానాంశాలు:

  •  సీమంతానికి వచ్చిన ప్రియను చూసి స్వప్న షాక్

  •  స్వప్నకు కడుపు లేదనే విషయం తెలిసి దుగ్గిరాల ఫ్యామిలీ షాక్

  •  తన తప్పును కావ్య మీదికి నెట్టేసిన స్వప్న

Brahmamudi 01 Nov Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 01 నవంబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 242 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ ప్రియకు ఫోన్ చేసి వెంటనే నువ్వు ఇంటికి వచ్చి నిజం చెప్పాలి అంటుంది రుద్రాణి. నన్ను మీ ఫ్యామిలీ విషయాల్లోకి లాగకండి అని వేడుకుంటుంది డాక్టర్ ప్రియ. కానీ.. రుద్రాణి మాత్రం అస్సలు వినదు. నువ్వు ఇచ్చిన రిపోర్ట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. నువ్వు వెంటనే ఇంటికి వచ్చి అసలు నిజం చెప్పకపోతే కథ వేరే ఉంటుంది అని బెదిరిస్తుంది రుద్రాణి. దీంతో ఇక చేసేది లేక ప్రియ.. దుగ్గిరాల ఫ్యామిలీ ఇంటికి బయలుదేరుతుంది. మరోవైపు స్వప్న సీమంతం పూర్తవుతుంది. అనామిక నేను వెళ్లి వస్తాను అని చెబుతుంది. నా కూతురు సీమంతం ఘనంగా జరుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను అంటుంది కనకం. ఇదేం చూశావు. ఇంకాసేపట్లో నేను ఇచ్చే గిఫ్ట్ చూస్తే కళ్లు తిరిగి పడిపోతావు అంటుంది రుద్రాణి. అదేం గిఫ్ట్ అంటే.. సస్పెన్స్ అంటారు రుద్రాణి, రాహుల్. ఇంతలో అక్కడికి తన ఫ్రెండ్ ప్రియ వస్తుంది. స్పవ్న నీ సీమంతానికి ఎవరు వచ్చారో చూడు అని అంటుంది రుద్రాణఇ. ప్రియను చూసి షాక్ అవుతుంది స్వప్న.

అలా చూస్తున్నావేంటి స్వప్న. ఈ డాక్టర్ నీ ఫ్రెండే కదా. ఇన్నాళ్లు నీ కడుపును కాపాడుకుంటూ వచ్చిన ఫ్రెండ్. డాక్టర్ ఎలాగూ వచ్చారు కదా. మా స్వప్నను చెక్ చేసి పుట్టబోయే బిడ్డ పొజిషన్స్ చెప్పండి అంటుంది రుద్రాణి. దీంతో ఇప్పుడు ఆమె గెస్ట్ గా వస్తే చెక్ చేయమంటావేంటి అంటారు అందరూ. సరే రండి అని ప్రియను స్వప్న దగ్గరికి తీసుకెళ్తుంది రుద్రాణి. డాక్టర్ ఇక మీ ఒట్టు తీసి గట్టు మీద పెట్టండి అంటుంది రుద్రాణి. ఏంటి రుద్రాణి.. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని అడుగుతుంది ఇందిరా దేవి. చెప్తాను.. అంటుంది రుద్రాణి. మహారాణినా దర్జాగా కూర్చొన్నది చాలు.. ఇక లేవలే అంటుంది రుద్రాణి. దీంతో లేచి నిలుచుంటుంది స్వప్న. నువ్వు నిజం చెబుతావా లేక నేనే నిజం బయటపెట్టనా అంటుంది రుద్రాణి. తన దగ్గరికి వెళ్లి కడుపులో పెట్టుకున్న క్లాత్ ను తీసేస్తుంది రుద్రాణి. దీంతో అందరూ షాక్ అవుతారు. చూడండి ఎంత పెద్ద మోసం చేసిందో అని అందరికీ చూపిస్తుంది రుద్రాణి. ఛీ.. నీ వృత్తికైనా గౌరవం ఇవ్వాలి కాబట్టి మేము ఏం చేయకముందే బయటికి వెళ్లు అంటూ ప్రియను బయటికి పంపించేస్తారు. ఏంటే ఇది అని అడుగుతుంది కనకం. చెప్పవే అంటే ఏం మాట్లాడదు. ఎందుకు ఇంత నాటకం ఆడావు. ఎందుకు ఇంత మోసం చేశావు అని ప్రశ్నిస్తుంది కనకం.

Brahmamudi 01 Nov Today Episode : కనకం, కృష్ణమూర్తిపై విరుచుకుపడ్డ స్వప్న

ఛీ.. ఇంత మోసమా? ఇంత పెద్ద అబద్ధమా.. అంటుంది కనకం. దీంతో కనకం.. అబద్ధం నీ రక్తంలోనే ఉంది. మోసం మొత్తం నీ పెంపకంలోనే ఉంది అంటుంది రుద్రాణి. రావే ఇటు అంటూ కిందికి లాక్కొస్తాడు స్వప్నను. ఎందుకు ఇలా చేశావు. నన్ను, మా అమ్మనే కాదు.. దేవత లాంటి అమ్మమ్మ, తాతయ్యను కూడా మోసం చేశావు అంటాడు రాహుల్.

ఎలా మోసం చేయగలిగావు అని అడుగుతావేంటి.. వీళ్లు మనకు కొత్తా.. అన్నీ ఒకే బుద్ధులు కదా అంటుంది అపర్ణ. ఎక్కడ పుట్టింది.. ఎక్కడ పెరిగింది.. ఇంతకన్నా మోసగత్తెలు ఎవరైనా ఉంటారా? అంటుంది అపర్ణ. నీ కూతురు నీకన్నా తెలివి అయింది. నీకన్నా ఎక్కువ మాయ చేయగలదు. ఇంకా వదిలేస్తే దుగ్గిరాల వంశ ప్రతిష్ఠలు తీసుకెళ్లి నడిబజారులో వదిలేయగలదు అంటుంది అపర్ణ.

ఇది ఆధారం లేని ఆరోపణ కాదు. మీరే కళ్లారా చూశారు. ఇంత ఘాతుకానికి ఒడిగట్టింది అంటే.. రేపు ఏ అనాథ శవాన్ని తీసుకొచ్చి వారసుడిని చేసేది. నా ముందే వాంతులు చేసుకుంది. ఈ ఇంటి సభ్యులు నన్ను చూసి ఇంత ఘనంగా సీమంతం చేశారు. ఇలాంటి తల్లి కాని తల్లి నాకెప్పుడూ కోడలు కాలేదు అంటుంది రుద్రాణి. నాకు భార్య కాలేదు అంటాడు రాహుల్. నన్ను, మా అమ్మను ఇంత భ్రమలో పెట్టి నా పక్కనే ఉంటూ ఇంత మాయ చేసిందంటే ఇలాంటి అమ్మాయితో నేను ఎప్పటికీ కాపురం చేయలేను. నాకు ఈ భార్య వద్దే వద్దు అంటాడు రాహుల్. మమ్మీ బయటికి పంపించేద్దాం అంటాడు రాహుల్. ఇంకా ఇన్నోసెంట్ గా నిలబడ్డావేంటే.. బయటికి నడువు అంటుంది రుద్రాణి.

స్వప్నను బయటికి నెట్టేయబోతుండగా నేను ఇప్పటికి బయటికి వెళ్తే ఇక జీవితంలో లోపలికి రానివ్వరు. ఎలాగోలా ఇంట్లోనే ఉండేలా చేయాలి.. ఏం చేయాలి అని ఆలోచిస్తుంది స్వప్న. వదలండి అని గట్టిగా అరుస్తుంది. కావ్య అని తన దగ్గరికి వెళ్లి.. ఇంత జరుగుతుందో నోరు విప్పకుండా చూస్తూ ఊరుకుంటావేంటే అంటుంది స్వప్న. నా భర్త, నా అత్త గెంటేస్తుంటే ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నావేంటి అంటుంది.

నీ మాట నమ్మి నేను ఇంతదాకా తెచ్చుకుంటే నీకు ఏం సంబంధం లేనట్టు వినోదం చూస్తున్నావేంటే.. మాట్లాడు. నిజం ఏంటో చెప్పు కావ్య. నా కాపురం కూలిపోయేటట్టు ఉంది. ఇప్పటికైనా నిజం చెప్పవే అంటుంది స్వప్న. నిజం బయటపెట్టు. నీకు దండం పెడతా అంటుంది స్వప్న. ఏంటి ఈ కొత్త నాటకం. మళ్లీ కళావతిని లాగుతున్నావేంటి.. నీ తప్పుకు, కళావతికి సంబంధం ఏంటి అని అడుగుతాడు రాజ్. దీంతో ఉంది అంటుంది స్వప్న.

నేను కడుపుతో ఉన్నట్టు అబద్ధం చెప్పమని సలహా ఇచ్చిందే ఈ కావ్య అంటుంది స్వప్న. దీంతో అందరూ షాక్ అవుతారు. నీకు ఈ సలహా కావ్య ఇచ్చిందంటే నేను నమ్మను అంటాడు రాజ్. కనకం కూడా అదే అంటుంది. దీంతో కనకం అంటూ గట్టిగా అరుస్తుంది స్వప్న. దీనంతటికి కారణం నీ ముద్దుల కూతురే అని అంటుంది స్వప్న. దీంతో కృష్ణమూర్తికి కోపం వస్తుంది. ఎంత దిగజారిపోయావు. నువ్వు ఖచ్చితంగా తప్పు చేసే ఉంటావు. అనవసరంగా అమాయకురాలి మీద నింద వేశావంటే బాగుండదు అంటాడు కృష్ణమూర్తి.

కావ్య నాకు సలహా ఇవ్వడం వల్లే నేను ఈ అబద్ధం చెప్పా అంటుంది స్వప్న. నన్ను దోషిని చేస్తావేంటి. నేను నీకు ఏం అన్యాయాన్ని చేశాను అంటుంది కళావతి. రాహుల్ నన్ను మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి నేను చచ్చిపోవాలని అనుకున్నాను. అప్పుడే కావ్య కడుపుతో ఉన్నానని అబద్ధం చెప్పితే పెళ్లి చేసుకుంటాడని చెప్పింది. అందుకే అబద్ధం చెప్పాను అంటుంది స్వప్న.

దీంతో రుద్రాణి షాక్ అవుతుంది. ఈ పిచ్చిది తప్పు తన మీదికి వచ్చేసరికి నామీద వేస్తోంది. నాకు కడుపు లేదని నీకు తెలియదా? అమ్మ మీద ఒట్టేసి చెప్పు అంటుంది స్వప్న. దీంతో ఒట్టేయలేకపోతుంది కావ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...