Categories: NewsTV Shows

Brahmamudi 30 October Today Episode : స్వప్నది దొంగ కడుపు అని అందరికీ చెప్పిన రుద్రాణి. కావ్య, కనకం షాక్.. స్వప్నను ఇంట్లో నుంచి వెళ్లగొడతారా?

Advertisement
Advertisement

Brahmamudi 30 October Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 అక్టోబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 240 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చెప్పిన పని మరిచిపోయి ఇలా అడిగే సరికి పక్క వాళ్ల మీదికి తోచేస్తున్నావా అని రుద్రాణి.. కావ్యను అంటుంది. నీ మాటల్లోనే ఎంత నిజముందో బాగానే తెలుస్తోంది. చూశావా వదిన.. నీ కోడలు పెద్ద చిన్నా అని మర్యాద లేకుండా నేను చెప్పినా చెప్పలేదు అనకుండా నా మీద అరిచింది అని అంటుంది రుద్రాణి. దీంతో రాజ్ అత్త అని గట్టిగా అరుస్తాడు. ఏంట్రా అంటే నిజం మాట్లాడాలనిపించింది అంటాడు. మీరు కళావతికి చెప్పారో లేదో తెలియదు కానీ.. తనకు మాత్రం అబద్ధం చెప్పే అలవాటు లేదు అంటాడు. అంటే.. నాకు ఆ అలవాటు ఉందంటున్నావా? అని అడుగుతుంది రుద్రాణి. అలా అని నేను అనలేదు అత్త. నువ్వే అంటున్నావు. కళావతి గురించి నాకు తెలుసు. తను తప్పు చేయదు కాబట్టి ఎవ్వరికీ భయపడదు అంటాడు. అలాంటప్పుడు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా అంటాడు రాజ్. మళ్లీ నేను సపోర్ట్ చేస్తున్నానని గొడవ చేయకండి. జస్ట్ నేను చెబుతున్నాను అంతే అంటాడు రాజ్. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో రుద్రాణికి కోపం వస్తుంది. అసలు మధ్యలో నీకు వచ్చిన బాధ ఏంటి అని అంటుంది అపర్ణ. నాకు కాదు.. నీకు బాధ. కావ్యను గుడ్డిగా నమ్ముతూ పోతే ఏదో ఒక రోజు నట్టేట ముంచేస్తుంది. ముందు నీ కొడుకుకు కళ్లెం వేసి తీసుకెళ్లిపోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం అంటుంది రుద్రాణి.

Advertisement

మరోవైపు చీర కట్టుకోవడం ఓకే కానీ.. కడుపు మెయిన్ టెన్ చేయడం చిరాకుగా ఉంది అని అనుకుంటుంది స్వప్న. ఇంతలో అక్కడికి రుద్రాణి వస్తుంది. తనను విచిత్రంగా చూస్తుంది రుద్రాణి. ఏంటి అత్తయ్య నన్ను అలా చూస్తున్నారు అంటే.. ఏం లేదు అంటుంది రుద్రాణి. నువ్వేంటి ఇంకా చీర కూడా మార్చుకోకుండా ఇలాగే ఉన్నవు. ఈ రూమ్ చిన్నగా ఉందని నా గదిలో నిన్ను రెడీ చేయడానికి అందరినీ సిద్ధం చేసి పెట్టాను. అక్కడ అందరూ నీకోసం సిద్ధంగా ఉన్నారు అంటుంది రుద్రాణి. అత్తయ్య మీరు ఓకే కదా. అంతా బాగానే ఉందా? నాతో ఎప్పుడు మీరు ఇంత పాజిటివ్ గా మాట్లాడరు కదా. నాకు సంబంధించిన విషయం ఏదైనా మీకు నచ్చనట్టే ఉంటారు కదా. మరీ ఇంత సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నారు ఏంటా అని అంటుంది స్వప్న. ఆడపిల్ల సీమంతం చేసుకొనేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో మీ అమ్మమ్మ చెప్పేటప్పుడు విన్నా. అందుకే అలా మాట్లాడుతున్నా అంటుంది రుద్రాణి. తన కడుపు పట్టుకోబోతే మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. నేను వెళ్లి రెడీ అవుతా అంటుంది స్వప్న. దీంతో వెళ్లు. అక్కడ అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు అంటుంది రుద్రాణి.

Advertisement

Brahmamudi 30 October Today Episode : స్వప్న ఆసుపత్రి రిపోర్ట్స్ చూసిన రుద్రాణి

కడుపు మీద చేయి కూడా వేయనీయడం లేదంటే డాక్టర్ చెప్పినట్టు దీనిది నిజంగానే దొంగ కడుపు అయి ఉంటుంది. కానీ.. ఎలా ప్రూవ్ చేయాలి. ఏదో ఒకటి చెప్పి ప్రూవ్ చేయాలి. రుద్రాణి థింక్.. ఎక్కడో ఒక చోట స్వప్న తప్పు చేసే ఉంటుంది. ఆలోచించు. స్వప్నది నిజంగానే దొంగ కడుపు అయితే వారానికి ఒకసారి ఆసుపత్రికి వెళ్లి ఎందుకు చెక్ చేయించుకుంటోంది అంటూ అనుకుంటుంది.

స్వప్న ప్రెగ్రెంట్ రిపోర్ట్ చూస్తే శ్రీదేవి నిజం ఏంటో.. అబద్ధం ఏంటో చెప్పేస్తుంది కదా అని అనుకుంటుంది. వెంటనే స్వప్న రిపోర్ట్స్ కోసం చెక్ చేస్తుంది రుద్రాణి. బట్టల కింద స్వప్న రిపోర్ట్స్ కనిపిస్తాయి. ఆ ఫైల్ ను చెక్ చేస్తుంది. ఇంతలో బ్లౌస్ మరిచిపోయా అని అనుకొని మళ్లీ తిరిగి రూమ్ లోకి వస్తుంది స్వప్న. ఏంటి అత్తయ్య.. ఇంకా ఇక్కడే ఉన్నారు అంటే.. రాహుల్ బ్రేస్ లెట్ కావాలని అడిగాడు. దాని కోసం వెతుకుతూ ఉంటే లేట్ అయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

అత్తయ్య బిహేవియర్ లో ఏదో తేడాగా ఉందేంటి. బ్రేస్ లెట్ పైనే ఉంది కదా. దాని కోసం ఇంత టైమ్ ఎందుకు పడుతుంది. నా రిపోర్ట్స్ డ్రాలోనే ఉన్నాయి కదా. కొంపదీసి చూసిందా ఏంటి అని అనుకుంటుంది. ఫైల్ ఇక్కడే ఉంది. అయినా నా పిచ్చి గానీ అత్తయ్యకు నా రిపోర్ట్స్ చూడాలనే అనుమానం ఎందుకు వస్తుంది అనుకొని బ్లౌజ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్తుంది.

మరోవైపు స్వప్న సీమంతానికి అన్నీ రెడీ చేస్తుంటారు. అందరూ వస్తుంటారు. అక్కడ ఉన్న అప్పును చూసి అందరూ అబ్బాయి అని అనుకుంటారు. నేను అబ్బాయిలా కనిపిస్తున్నానా అంటే.. కాదు నా చెల్లెలు అప్పు అంటుంది కావ్య. ఈ కాలం పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు గానూ.. అబ్బాయిలు బారెడు జుట్టు పెంచుకొని తిరుగుతున్నారు అంటుంది.

ఇంతలో కళ్యాణ్ కూడా వచ్చి అప్పును ఏడిపిస్తాడు. నువ్వు కూడా అమ్మాయిలా తయారవ్వొచ్చు కదా అంటుంది కళ్యాణ్ అమ్మ. దీంతో ఆంటీ చెప్పినట్టు నేను చీర కట్టుకుంటా అంటుంది అప్పు. దీంతో అందరూ ఆశ్చర్యపోతారు. కనకం కూడా షాక్ అవుతుంది.

మరోవైపు డాక్టర్ కు ఫోన్ చేసి త్వరగా ఆ రిపోర్ట్స్ చూసి కడుపు ఉందో లేదో చెప్పు అంటే.. కాస్త టైమ్ ఇవ్వు అంటుంది డాక్టర్. మీ ఫోన్ కోసం ఓపికగా వెయిట్ చేస్తుంటాను అంటే సరే అంటుంది డాక్టర్. సీమంతం ఎట్టి పరిస్థితుల్లోనూ కానివ్వను అని అనుకుంటుంది రుద్రాణి. ఇంతలో రాహుల్ దగ్గరికి వెళ్లి రాజ్ మాట్లాడుతాడు. ఫంక్షన్ నీది అయితే నువ్వేంటి టైమ్ పాస్ గా కూర్చున్నావు అంటాడు రాజ్.

ఇంతలో అప్పు చీర కట్టుకొని వస్తుంది. అందరూ చూసి షాక్ అవుతారు. ఆపండ్రా ఏంటి ఆ నవ్వులు. కొత్తగా కనిపిస్తోంది కదా అప్పు అంటాడు కళ్యాణ్. ఇంతలో అనామిక వస్తుంది. అనామిక చీరను మెచ్చుకుంటాడు కళ్యాణ్. చాలా అందంగా రెడీ అయ్యావు అంటాడు కళ్యాణ్. చూశావా అప్పు ఆడపిల్లలంటే ఇలా ఉండాలి. నీకు చీరలు అస్సలు సెట్ కావు అంటాడు కళ్యాణ్. దీంతో అవును నాకు సెట్ కావు అని కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది అప్పు.

మరోవైపు స్వప్నను రెడీ చేస్తుంటారు. ఇంకా రెడీ చేయలేదా అంటూ కనకం అక్కడికి వస్తుంది. డాక్టర్ కు కాల్ చేసి అడిగాను. తను కరెక్ట్ గానే అబార్షన్ టాబ్లెట్ ఇచ్చిందట. కానీ.. కడుపు లేదు కదా అందుకే అబార్షన్ కాలేదు అని రాజ్ కు చెబుతుంది రుద్రాణి. ఇంతలో డాక్టర్ రుద్రాణికి ఫోన్ చేసి అసలు కడుపే లేదు అని చెబుతుంది. దీంతో మీరే ఇంటికి వచ్చి అందరి ముందు చెప్పండి అని అంటుంది రుద్రాణి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement
Advertisement

Recent Posts

Dates vs Almonds : ఖర్జూరం vs బాదం ఆరోగ్యానికి ఏది మంచింది.. ఏది మీకు ఎక్కువ ప్రయోజనం తెలుసా ?

Dates vs Almonds : చలికాలంలో చాలా మందిలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం సహజం. వాతావరణ మార్పుల కారణంగా జలుబు,…

32 minutes ago

Today Horoscope 12th February 2026 : నేటి రాశి ఫలాలు 12 ఫిబ్రవరి 2026 : ఈ రాశుల వారికి ఈరోజు ధన లాభం.. మీ రాశి ఫలితాలు ఇక్కడ చూడండి..!

Today Horoscope 12th February 2026 : నేటి రాశి ఫలాలు (12-02-2026): గ్రహాల సంచారం ఆధారంగా ఈరోజు (గురువారం)…

2 hours ago

Velidanda Village : వెలిదండ గ్రామం భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం..!

Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…

9 hours ago

Serilingampalli BRS Party : రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు.. పదవుల కోసం ప్రజలను మోసం చేశారు : శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ

Serilingampalli BRS Party :  శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…

10 hours ago

Ram Charan Upasana Twins : రామ్ చరణ్ ఉపాసన కవల పిల్లల కి DCM తాతయ్య అద్దిరిపోయే గిఫ్ట్ ..!

Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…

11 hours ago

Ys Jagan : జగన్ చేతికి సరికొత్త బ్రహ్మాస్త్రం .. కూటమి కి వణుకు పుట్టించే బ్రేకింగ్ న్యూస్..!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…

11 hours ago

Telangana Municipal Elections : బ్రేకింగ్‌.. మున్సిపల్ ఎన్నికల‌ ఎగ్జిట్ పోల్స్ సర్వేల ఫ‌లితాలు విడుద‌ల‌.. ఆ పార్టీదే హవా..!

Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…

12 hours ago