Intinti Gruhalakshmi 30 October Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 30 అక్టోబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 1088 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు ఒక్కడివే వచ్చావు ఏంటి.. దివ్య ఏది అని అడుగుతుంది జాను, తన తండ్రి. దీంతో లేదు నాన్న ప్రమాదంలోనే ఉంది. ఇంకా కిడ్నాపర్ల దగ్గరే ఉంది అంటాడు విక్రమ్. అదేంటి తులసి ఆంటి హనీని అప్పగించలేదా అంటే.. లేదు అంటాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటాడు విక్రమ్. ప్రస్తుతం దివ్య ప్రమాదంలో ఉంది. తనను రక్షిస్తానని ఆంటి చెప్పింది కానీ.. నేను చేతగానివాడిలా ఉండిపోయాను అంటాడు విక్రమ్. బాధ్యత మొత్తం తులసి మీద వదిలేస్తే ఎలా అంటాడు వాళ్ల నాన్న. దివ్య ఏ పరిస్థితుల్లో ఉందో ఏమో.. నేను చేతగానివాడిలా అయిపోయాను అంటాడు విక్రమ్. బావ ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి. కష్టాన్ని ఫేస్ చేయాలి అంటే.. నావల్ల కావడం లేదు జాను. అంతా అయోమయంగా ఉంది అంటాడు విక్రమ్. సమయానికి అమ్మ కూడా ఇంట్లో లేదు. ఉంటే ఇది జరిగేది కాదు అంటాడు విక్రమ్. దీంతో అత్తయ్యకు ఫోన్ చేసి చెబితే ఏదైనా సలహా ఇస్తుందేమో అంటుంది జాను. దీంతో అదీ నిజమే అంటాడు విక్రమ్. కానీ.. వాళ్ల నాన్న వద్దంటాడు. ఏం చేయాలన్నా నువ్వే చేయాలి. నువ్వే నిర్ణయం తీసుకోవాలి. ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చోవడం కాదు. తులసి దగ్గర ఉండకుండా వచ్చేసి ఒక తప్పు చేశావు అంటాడు.
ఆమె ఏం సలహా ఇస్తుంది అంటాడు. ఇప్పటి వరకు అమ్మకు సలహా ఇచ్చిన లాస్యనే ఈ కిడ్నాప్ నకు సూత్రధారి అంటాడు విక్రమ్. దీంతో వాళ్ల నాన్న షాక్ అవుతాడు. ఎవ్వరినీ నమ్ముకోకు. నీ శక్తిని నమ్ముకో అంటాడు. ప్రతి నిమిషం విలువైనది అంటాడు. ఒక్కో నిమిషం గడిచేకొద్దీ దివ్య ప్రమాదానికి దగ్గరవుతుంది. తెలివి ఉపయోగించు. వెళ్లి దివ్యను రక్షించు అంటాడు. దీంతో నువ్వు చెప్పినట్టే చేస్తాను నాన్న. నా దివ్యను నేనే రక్షించుకుంటాను. దివ్యతోనే తిరిగి వస్తాను అంటాడు విక్రమ్. మరోవైపు తులసి ఇప్పటి వరకు రాలేదు. అసలు ఏం జరిగిందో తెలియడం లేదు అని అనసూయ బాధపడుతూ ఉంటుంది. ఆమె ఫోన్ కూడా చేయదు.. అంటాడు నందు. తులసి మనకోసం ఎన్నో చేసింది అంటుంది అనసూయ. దీంతో నేను కాదనడం లేదు అంటాడు నందు. మనకోసం ప్రాణం ఇస్తుంది రా అంటే అదీ కాదనడం లేదు అంటాడు నందు. ఇంతలో తులసి ఇంటికి వస్తుంది. ఏం జరిగింది. దివ్య ఎక్కడుందో తెలిసిందా. దివ్యను నువ్వు కలిశావా. తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపావా అంటే ఏం మాట్లాడదు తులసి. దివ్యను తీసుకొస్తా అని ఆవేశంగా వెళ్లావు కదా.. ఏమైంది అని అడుగుతుంది అనసూయ. ఆ లెటర్ మ్యాజిక్ పెన్ తో రాశారు.. అందుకే ఎలాంటి రుజువు లేకుండా అయింది. ఆ ఇంటికి వెళ్లేసరికి లెటర్ లో అక్షరాలు అన్నీ మాయమైపోయాయి. తెల్లకాగితం మాత్రమే మిగిలింది అంటుంది తులసి.
దీంతో ఇప్పటికైనా అర్థం చేసుకో. వాళ్లు ఎంత తెలివిగా అటాక్ చేస్తున్నారో? వాళ్లను తట్టుకొని నిలబడటం చాలా కష్టం అంటాడు నందు. హనీని అప్పగించకపోతే.. దివ్యను చంపేస్తాం అంటున్నారు అత్తయ్య అంటుంది తులసి. అంత క్లారిటీగా చెప్పాక కూడా తీరికగా కూర్చున్నావు ఏంటి అంటాడు నందు. ఇప్పటికీ హనీని అప్పజెప్పే ఉద్దేశం లేదా అంటే లేదు అంటుంది తులసి. ఒక ప్రాణాన్ని రక్షించడం కోసం ఇంకో ప్రాణాన్ని తాకట్టు పెట్టడం తప్పు అంటుంది తులసి.
ఒక ప్రాణం కోసం నువ్వు ఇంకో ప్రాణాన్ని బలిపెడుతున్నావు అంటాడు నందు. ఇప్పుడు చేయాల్సింది దివ్యను ఎలా రక్షించుకోవాలో ఆలోచించడం అంటాడు పరందామయ్య. ఆయన ఎంత టెన్షన్ పడుతున్నారో అంతకంటే ఎక్కువ టెన్షన్ నాకుంది అంటుంది తులసి. నాతో అరిచి గొడవ పడినంత మాత్రాన సమస్యకు పరిష్కారం కాదు కదా అంటుంది తులసి. హనీని ఇచ్చేద్దాం అంటే కుదరదు అంటుంది తులసి.
ఏదైనా సమస్య వస్తే పరిష్కరించుకోవాలి.. సమస్యకు పరిష్కారం శత్రువుకు లొంగిపోవడం కాదు అంటుంది తులసి. దీంతో ఎదిరించే దమ్ములేకపోతే ఏం చేస్తావు అంటే.. దివ్య తండ్రిగా నాకు సాయంగా మీరు వస్తారని అనుకుంటున్నాను కానీ.. మీరు మాత్రం నన్ను నిందించడమే పనిగా పెట్టుకున్నారు. ప్రతి దానికి నాకు అడ్డు పడుతున్నారు అంటుంది తులసి.
ఒక చేతిని కాపాడుకోవడానికి ఎవ్వరూ ఇంకో చేతిని నరుక్కోరు. నాకు దివ్య, హనీ ఇద్దరూ సమానమే. ఏ ఒక్కరిని కోల్పోవడానికి నేను ఒప్పుకోను అంటుంది తులసి. ఒకవేళ మీరు చెప్పినట్టే హనీని అప్పగిస్తాను. అప్పుడు దివ్యను వదిలిపెట్టకపోతే అని అడుగుతుంది తులసి. దీంతో ఎంత సేపు మీరు హనీని వదిలించుకోవాలనే చూస్తున్నారు అంటుంది తులసి.
ఇప్పటికీ నన్ను నిందించడమే పనిగా పెట్టుకున్నారు తప్పితే ఇద్దరం వెళ్లి దివ్యను వెతుకుదాం అని మాత్రం అనడం లేదు. మీరు మారుతారు అని అనుకోవడం నా పిచ్చితనం. మామయ్య నేను తిరిగి ఇంటికి రావడం అంటూ జరిగితే దివ్యతోనే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి.
మరోవైపు విక్రమ్.. డ్రైవర్ తో కలిసి దివ్యను కిడ్నాప్ చేసిన ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ అంతా చెక్ చేస్తాడు. దివ్యను ఎక్కడ దాచిపెట్టారో ఎలా తెలుసుకోవడం. తను చావు బతుకుల మధ్య ఉంది. రక్షించుకోవడానికి సమయం చాలా తక్కువగా ఉంది అని అనుకుంటాడు. ఇంతలో విక్రమ్ అక్కడే ఉన్న చాయి కొట్టు దగ్గరికి వెళ్తాడు. అక్కడ చాయి తాగుతూ ఉంటాడు. డ్రైవర్ కు చాయి ఇవ్వబోతూ ఆ చాయి అతడు షాక్ అవుతాడు.
దీంతో మా డ్రైవర్ ను ఎప్పుడైనా చూశావా అంటే లేదు సార్ అంటాడు. జాగ్రత్తగా చూసి చెప్పు అంటాడు. డబ్బులు ఇచ్చి నిజం చెప్పు భయపడకు. చూసింది చూసినట్టు చెప్పు. నేను పోలీస్ కాదు అనడంతో ఆ రౌడీలు ఎవరో కానీ.. డ్రైవర్ ను బాగా కొట్టి మీ భార్యను తీసుకెళ్లారు అని చెబుతాడు.
వాళ్లు వచ్చిన కారు నెంబర్ ను మాత్రం నోట్ చేసుకున్నా అంటాడు చాయి వ్యక్తి. దీంతో ఆ కారు నెంబర్ ఇస్తాడు. ఈ మాత్రం క్లూ చాలు. నాకు చాలా సాయం చేశావు. థాంక్యూ అంటాడు. వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి అన్ని వివరాలు చెబుతాడు.
మరోవైపు తులసి స్కూటీ మీద దివ్య కోసం వెతుకుతూ ఉంటుంది. దివ్యను ఎలా వెతకాలి.. ఎక్కడని వెతకాలి. ఒక్కో నిమిషం గడుస్తున్న కొద్దీ టెన్షన్ పెరుగుతోంది అని అనుకుంటుంది తులసి. దివ్య ఇక ఎంతో సేపు స్పృహలో ఉండదు. ఏం చేయాలి అని అనుకుంటుంది. ఇంతలో తనకు గుడి కనిపిస్తుంది. దీంతో దేవుడికి మొక్కుకుంటుంది. నేను ఓడిపోవడం అంటూ జరిగితే మూడు ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అది గుర్తుపెట్టుకో స్వామి. దివ్యకు జరగకూడనిది ఏదైనా జరిగితే దివ్యతో పాటు నేను ప్రాణాలు వదిలేస్తాను అంటుంది తులసి. నాకు అండగా నిలబడు. దివ్య ఆచూకి తెలిసేలా చేయి. మిగితా విషయాలు నేను చూసుకుంటాను. దయచూపించు సామి. నా మీద కొంచెం దయ చూపించు అని దేవుడిని వేడుకుంటుంది తులసి. ఇంతలో తనకు లాస్య చూపించిన వీడియో గుర్తుకొస్తుంది. ఆ ఇల్లును ఎక్కడో చూసినట్టు గుర్తు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.