Brahmamudi Today Episode Jan 29 : బ్రహ్మముడి జనవరి 29 ఎపిసోడ్: నిజం కక్కిన నర్స్.. మంత్రి ఇంటికి దొంగతనంగా రాజ్, కావ్య! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Brahmamudi Today Episode Jan 29 : బ్రహ్మముడి జనవరి 29 ఎపిసోడ్: నిజం కక్కిన నర్స్.. మంత్రి ఇంటికి దొంగతనంగా రాజ్, కావ్య!

 Authored By jagadesh | The Telugu News | Updated on :29 January 2026,9:00 am

Brahmamudi Today Episode Jan 29 : బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ ‘బ్రహ్మముడి’ (Brahma Mudi). కావ్య (Kavya) తన బిడ్డ కోసం పడుతున్న ఆరాటం, రాజ్ (Raj) కుటుంబం మధ్య జరుగుతున్న డ్రామాతో కథ ఆసక్తికరంగా సాగుతోంది. నేటి (జనవరి 29) ఎపిసోడ్‌లో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి.

Brahmamudi Today Episode Jan 29 బ్రహ్మముడి జనవరి 29 ఎపిసోడ్ నిజం కక్కిన నర్స్ మంత్రి ఇంటికి దొంగతనంగా రాజ్ కావ్య

Brahmamudi Today Episode Jan 29 : బ్రహ్మముడి జనవరి 29 ఎపిసోడ్: నిజం కక్కిన నర్స్.. మంత్రి ఇంటికి దొంగతనంగా రాజ్, కావ్య!

Brahmamudi Today Episode Jan 29 : నిజం కక్కిన హెడ్ నర్స్

బిడ్డ మార్పిడి గుట్టు విప్పడానికి కావ్య, డాక్టర్ అనురాధ (Dr. Anuradha) తో కలిసి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చక్రవర్తి అడ్రస్ కోసం ఎంక్వైరీ చేస్తుండగా, హెడ్ నర్స్ నీలవేణి (Head Nurse Neelaveni) ప్రవర్తనపై అనుమానం వస్తుంది. మరో నర్సుతో మాట్లాడుతూ.. తన మెడలో ఉన్న చైన్ విలువ పది లక్షలని, పెద్దవాళ్లకు సహాయం చేస్తే డబ్బుకు కొదవ ఉండదని నీలవేణి గొప్పలు చెప్పుకుంటుంది. ఇది విన్న కావ్య, ఆమెను నిలదీస్తుంది.

మొదట నీలవేణి ఎదురుతిరిగినా, కావ్య తనదైన శైలిలో బుద్ధి చెప్పడంతో (Kavya slaps nurse) నిజం కక్కుతుంది. మంత్రి ధర్మేంద్ర (Minister Dharmendra) బిడ్డను మార్చడానికి తనకు రూ. 10 లక్షలు ఇచ్చారని ఒప్పుకుంటుంది. ఈ విషయం తెలిసి కావ్య ఆవేశంతో ఊగిపోతుంది. సాక్ష్యం చెప్పడానికి తనతో పాటు మంత్రి దగ్గరకు రావాలని కావ్య డిమాండ్ చేస్తుంది. కానీ, మంత్రికి ఎదురువెళ్తే తన కుటుంబాన్ని చంపేస్తారని, ఇప్పటికే డాక్టర్ చక్రవర్తిని మాయం చేశారని నీలవేణి కావ్య కాళ్ళావేళ్ళా పడుతుంది. దీంతో కావ్య ఆమెను వదిలేస్తుంది.

కావ్యపై రేఖ చాడీలు – అపర్ణ ఆందోళన

మరోవైపు దుగ్గిరాల ఇంట్లో కావ్య గురించి టెన్షన్ మొదలవుతుంది. కావ్య ఎక్కడికి వెళ్లిందో తెలియక అందరూ కంగారు పడుతుండగా, రేఖ (Rekha) వచ్చి పుల్లలు పెడుతుంది. కావ్య రోడ్ల మీద పిచ్చిదానిలా తిరుగుతోందని, కనిపించిన చంటి పిల్లలను లాక్కుంటుందని అబద్ధాలు చెబుతుంది. ఇది విన్న అపర్ణ (Aparna) భయపడుతుంది. రాజ్ వెంటనే కావ్యకు ఫోన్ చేసినా, ఆమె కట్ చేస్తుంది.

మంత్రికి కావ్య వార్నింగ్ – రాజ్ షాక్

డాక్టర్ అనురాధ సాయంతో హాస్పిటల్ రికార్డులను పరిశీలించిన కావ్యకు మరో షాకింగ్ నిజం తెలుస్తుంది. రిపోర్ట్స్ లో మంత్రి పాపకు పుట్టుమచ్చ ఉన్నట్లు రాసి ఉంటుంది. దీంతో ఆధారాలతో సహా మంత్రి ఇంటికి వెళ్లిన కావ్య, అతన్ని నిలదీస్తుంది. “నా బిడ్డను దూరం చేసింది నువ్వే.. నువ్వు దుర్మార్గుడివి” అని మండిపడుతుంది. పాప అనారోగ్యం రిపోర్ట్స్ చూపించడంతో, మంత్రి నిజం ఒప్పుకోక తప్పదు. ఇంటికి వచ్చిన కావ్య, ఈ విషయమంతా రాజ్ కు చెబుతుంది. మొదట రాజ్ నమ్మలేకపోతాడు.

దొంగతనంగా మంత్రి ఇంట్లోకి..

“మన బిడ్డను చూస్తే మీకే తెలుస్తుంది” అని కావ్య చెప్పడంతో, రాజ్ ఆమెతో వెళ్ళడానికి సిద్ధమవుతాడు. అర్ధరాత్రి వేళ, ఎవరికీ తెలియకుండా రాజ్, కావ్య దొంగతనంగా మంత్రి ధర్మేంద్ర ఇంటికి వెళ్తారు. అక్కడ తమ పాపను చూసి కావ్య మురిసిపోతుంది. పాపను గుండెలకు హత్తుకుంటుంది. తమ బిడ్డను శత్రువు ఇంట్లో చూడాల్సి రావడం రాజ్ ను కలచివేస్తుంది.

రాబోయే ఎపిసోడ్‌లో మంత్రి నుంచి బిడ్డను దక్కించుకోవడానికి రాజ్, కావ్య ఎలాంటి ప్లాన్ వేస్తారు? ఈ విషయం బయటపడితే మంత్రి ఏం చేస్తాడు? అనేది ఉత్కంఠగా మారింది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది