
karthika deepam 2 Today Episode : స్పృహలోకి వచ్చిన దశరథ్.. స్టేషన్‌లో జోత్స్నగొంతు పట్టుకున్న దీప
karthika deepam 2 today episode : కార్తీక దీపం-2 సీరియల్‌లో ఈ రోజు (ఏప్రిల్ 18) ఏం జరిగిందో తెలుసుకుందాం. మా నాన్నకు ఏదైనా జరిగితే నిన్ను వదిలిపెట్టనని పోలీస్ స్టేషన్‌లో ఉన్న దీపకు జ్యోత్స్న వార్నింగ్ ఇవ్వడంతో అది సహించలేని దీప జోత్స్న గొంతు పట్టుకుంటుంది. నొప్పితో విలవిలలాడుతూ తనను వదిలేయమని జ్యోత్స్న అంటుంది. కార్తీక్‌తో పాటు ఎస్ఐ వచ్చి జ్యోత్స్నను వదిలిపెట్టమని దీపకు చెబుతారు. నన్ను చంపబోయి మా డాడీని షూట్ చేసిందని జ్యోత్స్న అంటుంది. మీరు చేసింది తప్పేనని జ్యోత్స్నకు క్లాస్ పీకుతాడు ఎస్ఐ. ఇలా స్టేషన్‌లో కొట్టుకుంటే మరో కేస్ బుక్ చేస్తామని జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తాడు. దాంతో కోర్టులోనే తేల్చుకుందామని అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్యోత్స్న.
karthika deepam 2 Today Episode : స్పృహలోకి వచ్చిన దశరథ్.. స్టేషన్‌లో జోత్స్నగొంతు పట్టుకున్న దీప
జ్యోత్స్న వెళ్లిపోగానే దీపకు క్లాస్ పీకుతాడు కార్తీక్. నీ కోపం వల్ల ఇంకా లోతుగా ఇరుక్కుపోతున్నావని, ఎలా కాపాడాలో తెలియడం లేదంటాడు కార్తీక్. దానికి మీరు నన్ను నమ్మడం లేదా అని కార్తీక్‌ను అడుగుతుంది దీప. నువ్వు తప్పు చేయలేదు అనడానికి మన దగ్గర ఒక్క సాక్ష్యం, ఆధారం కూడా లేదని కార్తీక్ అంటాడు. కార్తీక్ కోసం పోలీస్ స్టేషన్ బయటే ఎదురు చూస్తుంటుంది జ్యోత్స్న. కార్తీక్ బయటకు రాగానే దీప నన్ను చంపాలని చూసిందని చెబుతుంది. నువ్వు దీపను చంపాలని అనుకున్నావు, కానీ దీప నిన్ను మార్చాలని చూసింది అంటాడు కార్తీక్. గన్‌తోనా అని వెటకారంగా మాట్లాడుతుంది జ్యోత్స్న. భార్య మీద ప్రేమలో ఇలా మాట్లాడుతున్నావు కానీ దీప నిజంగానే తన తండ్రిని కాల్చిందని జ్యోత్స్న ఫైర్ అవుతుంది.
నువ్వేమో నీ భార్యను కాపాడటానికి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నావని, నీ ప్రేమలో స్వార్థం ఉందని కార్తీక్‌పై నిందలు వేస్తుంది జ్యోత్స్న.మా కారణాలకే కాదు మా కన్నీళ్లకు మీ దగ్గర విలువ ఉండదని అంటుంది. దేని గురించి నీతో మాట్లాడాలని అనుకోలేదని, ఏమన్నా ఉంటే కోర్టులో తేల్చుకుందామని అంటాడు కార్తీక్. దీప మాత్రం ఈ కేసు నుంచి తప్పించుకోలేదని, చేసిన తప్పుకు శిక్ష పడాల్సిందే. జైలు జీవితం గడపటానికి సిద్ధంగా ఉండమని నీ ప్రియమైన భార్యకు చెప్పు అని కార్తీక్‌కు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జోత్స్న.
దీప లేకుండా అన్నం తిననని శౌర్య మొండికేస్తుంది. అప్పుడే అక్కడికి కార్తీక్ వస్తాడు. అమ్మ ఏది అని కార్తీక్‌ను అడుగుతుంది శౌర్య. అమ్మ ఊరు వెళ్లిందని కార్తీక్ అబద్ధం ఆడుతాడు. ఇప్పుడే అమ్మతో మాట్లాడుతానని ఫోన్ చేయమని శౌర్య గోల చేస్తుంది. శౌర్యను బుజ్జగిస్తాడు కార్తీక్. ఈ నాన్న నీకు వద్దా అని శౌర్యను అడుగుతాడు. కావాలి అని శౌర్య బదులిస్తుంది. కావాలి అంటే నువ్వు నా మాట వినాలి. భోజనం చేయాలని అంటాడు. నాకు కథలు చెప్పాలి. ఆడిస్తూ అన్నం తినిపించాలని శౌర్య అంటుంది. శౌర్య చెప్పినట్లే చేస్తాడు కార్తీక్.
శౌర్య లోపలికి వెళ్లగానే లాయర్ కళ్యాణ్ ప్రసాద్ మన కేసు వాదించడానికి ఒప్పుకున్నాడని కాంచన, అనసూయలతో చెబుతాడు కార్తీక్. దశరథ్ మావయ్య కూడా స్పృహలోకి వచ్చాడని అంటాడు. కార్తీక్ మాటలతో కాంచన, అనసూయ ఆనందపడతారు.
మరోవైపు సుమిత్ర, శివన్నారాయణ ఇద్దరు భోజనం చేయకుండా దశరథ్ కండ్లు కోసం ఎదురుచూస్తుంటారు. సుమిత్రను భోజనం చేయమని శివన్నారాయణ అంటాడు. ఆయన కళ్లు తెరిచేవరకు నేను మంచి నీళ్లు కూడా తాగనని అంటుంది. మంగళగౌరి వ్రతం చేసినప్పుడు దీర్ఘ సుమంగళిభవ అని మీరు నన్ను దీవించేవారు. మీ దీవెనలు నిజం కావాలని, మా ఆయన కళ్లు తెరవాలని సుమిత్ర కన్నీళ్లతో అంటుంది. అంతలోనే దశరథ్ స్పృహలోకి వస్తాడు. కళ్లు తెరుస్తాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగుస్తుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.