Guppedantha Manasu 16 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 16 డిసెంబర్ 2023, శనివారం ఎపిసోడ్ 948 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎలాగైనా శైలేంద్రను చంపేస్తా అని గన్ పట్టుకొని శైలేంద్ర వెంట పడతాడు మహీంద్రా. ఇంతలో అనుపమ వచ్చి మహీంద్రాను ఆపుతుంది. వదులు అనుపమ అంటాడు మహీంద్రా. శైలేంద్ర.. అంటూ దేవయాని తన దగ్గరికి వస్తుంది. మహీంద్రా ఆగు అంటే అస్సలు ఆగను. ఈ నీచుడు ప్రాణాలతో ఉంటే ఈ ఇంటిని వల్లకాడు చేస్తాడు. వాడిని వదలకూడదు అనుపమ అంటాడు మహీంద్రా. ఇంతలో వసుధార కూడా వస్తుంది. తనను ఏం చేయొద్దు మామయ్య అంటుంది. దీంతో నన్ను ఆపొద్దు. ఇలాంటి వాడిని ప్రాణాలతో వదిలిపెట్టొద్దు. వీడు చస్తేనే మనమంతా సంతోషంగా ఉంటాం అంటాడు మహీంద్రా. తనను చంపితే నువ్వు దోషివి అవుతావు అంటుంది అనుపమ. నేను దోషిని అయినా కూడా పర్వాలేదు. వాడిని చంపి తీరాల్సిందే అంటాడు మహీంద్రా. వద్దు అని అనుపమ, వసుధార ఇద్దరూ తనను లాక్కెల్తారు. దీంతో శైలేంద్ర ఊపిరి పీల్చుకుంటాడు. అక్కడే కుప్పకూలిపోతాడు శైలేంద్ర. వాటర్ అని అడుగుతాడు శైలేంద్ర. మరోవైపు కారులో రవీంద్ర అప్పుడే వస్తుంటాడు. రవీంద్రను చూసి తన గన్ ను దాచేస్తాడు. వసుధార తీసుకొని దాస్తుంది.
డాడీ వచ్చినట్టున్నారు అనుకొని శైలేంద్ర కూడా బయటికి వస్తాడు. మహీంద్రాను చూసి షాక్ అవుతాడు రవీంద్ర. ఏమైంది మహీంద్రా. అలా ఉన్నావు ఏంటి. రిషి గురించి ఏమైనా తెలిసిందా? నువ్వేం భయపడకు. రిషికి ఏం కాదు. అసలు మన ఫ్యామిలీకే ఎందుకు ఇలా జరుగుతోందో నాకు అర్థం కావడం లేదు. రిషికి ఏం కాదు. రిషి కనిపించకుండా పోవడానికి కారణం ఎవరో నాకు తెలిస్తే నేనే వాడిని మట్టిలో కలిపేస్తాను. రిషి ఎక్కడున్నా క్షేమంగా ఉంటాడు. నువ్వు మాత్రం రిషి మీద బెంగ పెట్టుకోకు మహీంద్రా అంటాడు రవీంద్ర. ఇంతలో శైలేంద్ర వచ్చి నేను అదే చెప్తున్నాను డాడ్. బాబాయికి అదే విషయం చెబుతున్నా బాబాయి నా మాట లెక్కచేయకుండా చాలా బాధపడుతున్నాడు. తనలో తాను కుంగిపోతున్నాడు అంటాడు శైలేంద్ర. దీంతో అవును శైలేంద్ర. కొడుకు కనిపించకపోతే ఏ తండ్రికి అయినా మనసు ఆగదు అంటాడు రవీంద్ర. అవును డాడ్ అంటాడు శైలేంద్ర. దేవయాని కూడా అదే మాట చెబుతుంది. శైలేంద్ర.. రిషి గురించి రాత్రనక పగలనక బాధపడుతున్నాడు అంటుంది. బాబాయి నేను ఉన్నాను మీకు అంటాడు శైలేంద్ర. సార్ మేము వెళ్లొస్తాం అంటే అదేంటి అప్పుడేనా భోం చేసి వెళ్దురు కానీ అంటే లేదు అన్నయ్య మేము వెళ్లాలి అని చెప్పి మహీంద్రా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఇంట్లోకి వచ్చిన రవీంద్రా.. ఇంట్లో ఉన్న వస్తువులు చిందర వందరగా పడి ఉండటం చూసి షాక్ అవుతాడు. ఇవేంటి వస్తువులన్నీ ఇలా పడి ఉన్నాయి అని ధరణిని అడుగుతాడు. ఇంతలో శైలేంద్ర, దేవయాని వస్తారు. ఏం జరిగింది అని అడుగుతాడు. మహీంద్రా కూడా నాకు చెప్పకుండా వచ్చాడు. ఒళ్లంతా చెమటలు పట్టాయి. అనుపమ, వసుధార కూడా ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. అసలు ఏం జరిగింది. చెప్పండి మిమ్మల్నే అడిగేది అని అడుగుతాడు రవీంద్రా. దీంతో మహీంద్రా క్యాజువల్ గానే మాట్లాడటానికి వచ్చాడు అని దేవయాని చెప్పినా వినడు. నువ్వు చెప్పమ్మా అని ధరణిని అడుగుతాడు రవీంద్రా.
రిషి కనిపించని విషయంలో చిన్న మామయ్య గారు ఈయన మీద అనుమానపడుతున్నారు అని చెబుతుంది ధరణి. రిషిని ఈయనే ఎక్కడో దాచిపెట్టారని చిన మామయ్య గారు ఈయన్ను నిలదీశారు అని జరిగిందంతా చెబుతుంది ధరణి. ఏమండి అసలు మహీంద్రా అలా చేయడం ఏంటి. నా కొడుకు ఏమైనా తప్పు చేశాడా. జగతి విషయంలో వాడినే అనుమానించారు. ఇప్పుడు రిషి విషయంలోనూ వాడినే అనుమానిస్తున్నారు. అందరూ నా కొడుకు మీద పడుతున్నారు ఏంటి అని అంటుంది దేవయాని.
నా కొడుకును పొట్టన పెట్టుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా అంటుంది. మరి నేను అప్పుడే అడిగినప్పుడు ఎందుకు నాకు నిజం చెప్పలేదు అని ప్రశ్నిస్తాడు. నా వెనుక చాలా జరుగుతోంది అన్నమాట. గన్ తో షూట్ చేయడానికి వచ్చాడంటే దీనికంటే ముందు మీ మధ్య చాలా చర్చలు జరిగి ఉంటాయి. ఏదైనా చిన్న అనుమానంతో అయితే రాడు. తను బలంగా నమ్మితేనే వస్తాడు అంటాడు రవీంద్రా.
జగతి, రిషి విషయంలో వాళ్లు నిన్నే ఎందుకు అనుమానిస్తున్నారు. నీ మీద వాళ్లకు ఏం పగ లేదు కదా అంటాడు రవీంద్రా. మనసులో ఏ దురుద్దేశం పెట్టుకున్నారో అని అంటుంది దేవయాని. ఇంతలో శైలేంద్ర యాక్షన్ స్టార్ట్ చేస్తాడు. పెయిన్ ఎక్కువగా వస్తుంది మామ్ అంటాడు శైలేంద్ర. ధరణి తన రూమ్ లోకి రాగానే థాంక్స్ ధరణి అంటాడు. అంతా నువ్వే చేశావు. ఇప్పుడు నేను ఇలా ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం నువ్వే అంటాడు శైలేంద్ర. నువ్వు నన్ను రెండు సార్లు కాపాడావు. ఇప్పుడు బాబాయి నుంచి కూడా కాపాడావు అంటాడు శైలేంద్ర.
అసలు రిషి గురించి నువ్వేం అనుకుంటున్నావు ధరణి చెప్పు అని అడుగుతాడు శైలేంద్ర. నువ్వు ఏం అనుకుంటే అదే. ఓకేనా అంటాడు.. ఇంతకీ రిషి ఎక్కడున్నాడు అని అనుకుంటున్నావు. నీకు తెలుసా? నీకు తెలిస్తే నాకు చెప్పు. ఓకేనా. నాకు తెలుసు ధరణి. నువ్వు నాకు చెబుతావని. సరే.. వెళ్లు. తలంతా పట్టేసినట్టుగా ఉంది. వేడి వేడి కాఫీ తీసుకురా వెళ్లు అని అంటాడు శైలేంద్ర. వసుధార నిన్ను ఏం చేస్తానో చూడు అని తనలో తాను అనుకుంటాడు శైలేంద్ర. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.