Categories: NewsTV Shows

Intinti Gruhalakshmi 7 Dec Today Episode : పోయిన దివ్య కడుపు.. రాజ్యలక్ష్మి ప్లాన్ వర్కవుట్.. ఈ విషయం విక్రమ్ కు తెలుస్తుందా? ఇంతలో పెద్ద ట్విస్ట్ ఏంటంటే?

Advertisement
Advertisement

Intinti Gruhalakshmi 7 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 7 డిసెంబర్ 2023, గురువారం ఎపిసోడ్ 1121 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను వెళ్లి కూరగాయలు తీసుకొస్తాను.. మీరు వెళ్లి కూర్చోండి అని పరందామయ్యతో చెప్పి మార్కెట్ కు వెళ్తుంది తులసి. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి ఏంటి బాబాయ్ ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఎవరు మీరు అని అడిగితే.. ఏంటి బాబాయి వెటకారాలా.. నీతో పాటు కలిసి పని చేసిన రమణా రావునే మరిచిపోయావా.. పదా అంటూ ఆయన్ను తీసుకొని వెళ్తాడు రమణారావు. మరోవైపు తులసి మార్కెట్ లో కూరగాయలు తీసుకుంటుంది. ఇంతలో రమణారావు.. పరందామయ్యను తీసుకొని నడుచుకుంటూ వెళ్తాడు. కాసేపు మాట్లాడాక రమణారావు నేను వెళ్తున్నాను పరందామయ్య… అని చెప్పి రోడ్డు మీద వదిలేసి వెళ్తాడు. ఇంతలో కూరగాయలు తీసుకొని వస్తుంది తులసి. చూస్తే తనకు పరందామయ్య కనిపించడు. ఎక్కడికి వెళ్లారు అని అనుకొని తన ఫోన్ కు ఫోన్ చేస్తే అనసూయ ఎత్తుతుంది. ఫోన్ ఆయన మరిచిపోయి వచ్చారు అని చెబుతుంది. దీంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు. పరందామయ్య కోసం వెతుకుతూ ఉంటుంది. చివరకు ఒక చోట కూర్చొని ఉంటాడు పరందామయ్య. అతడిని చూసి వెంటనే ఇంటికి తీసుకెళ్తుంది తులసి.

Advertisement

మరోవైపు నందు హాల్ లో పడుకొని ఉంటాడు. రాములమ్మ ఇల్లు ఊడ్చుతూ ఉంటుంది. నందును చూసి పిలుస్తుంది. కానీ లేవడు. దీంతో అనసూయను పిలుస్తుంది. అందరూ వచ్చి నందును లేపుతారు. నీకేం గతి పట్టిందిరా.. ఇక్కడ పడుకోవడం ఏంటి అని అంటుంది అనసూయ. నా సంగతి సరే.. నువ్వు జాగ్రత్తగా ఉండు అంటాడు నందు. నాకేమైందిరా అంటుంది అనసూయ. నువ్వు నిక్షేపంలా ఉన్నా అని అనుకుంటున్నావు కానీ.. నువ్వు చేసిన తప్పుకు నిన్ను తులసి దూరం పెట్టకుండా చూసుకో అంటాడు నందు. దీంతో ఆమె తప్పు చేయడం ఏంట్రా అంటే.. ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు తప్పులు చేసేవాళ్లే అంటాడు నందు. ఇక ఆపండి.. నేను మిమ్మల్ని క్షమించినా.. ఆ దేవుడు క్షమించడు అంటుంది తులసి. మరిచిపోదాం అని అనుకుంటున్న సంఘటనను పదే పదే గుర్తు తెస్తున్నారు అంటుంది తులసి. మీరు చేసింది చిన్న తప్పు కాదు.. దాని తాలుకు ఫలితాన్ని నేను జీవితాంతం అనుభవించాల్సి ఉంటుంది అంటుంది తులసి. అందరి ముందు డ్రామాలు ఆడుతున్నారు అంటుంది తులసి. దీంతో డ్రామాలు ఆడుతున్నానా అంటే.. కాకపోతే ఏంటి.. తాగి మెట్లకింద పడుకున్నారు ఏంటి అంటే.. నన్ను బ్లేమ్ చేస్తారా అని ప్రశ్నిస్తుంది తులసి.

Advertisement

Intinti Gruhalakshmi 7 Dec Today Episode : మిమ్మల్ని క్షమిస్తే మా అమ్మ తిరిగి వస్తుందా అని ప్రశ్నించిన తులసి

నాకు నా మనసులో ఉన్న బాధ చెప్పుకునే హక్కు కూడా లేదా అంటాడు నందు. మిమ్మల్ని క్షమిస్తాను.. మా అమ్మను తిరిగి తీసుకొస్తారా అని ప్రశ్నిస్తుంది తులసి. చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం లేకనే కదా.. ఈ నరకాన్ని అనుభవిస్తున్నాను అంటాడు నందు. దీంతో అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోతుంది తులసి.

మరోవైపు విక్రమ్.. ఫోన్ లో వింటూ ఏదో రాస్తూ ఉంటాడు. ఇంతలో దివ్య వస్తుంది. సడెన్ గా నీలో ఈ చేంజ్ ఏంటి. భక్తి మీదికి దృష్టి మళ్లడం ఏంటి.. దీక్షగా లలితశాస్త్రం వినడం ఏంటి. ఆశ్చర్యంగా ఉంది విక్రమ్. నమ్మకలేకపోతున్నాను అంటుంది దివ్య. దీంతో మరీ అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అమ్మవారి నామాలలో ఒక చక్కటి పేరు కోసం వింటున్నాను అంటాడు విక్రమ్. దీంతో మనకు పుట్టబోయేది అమ్మవారు కాదు.. దొరవారు. మనం సెలెక్ట్ చేయాల్సింది అబ్బాయి పేరు అంటుంది దివ్య.

ఇంతలో కొబ్బరి బోండాం తీసుకొని వస్తుంది రాజ్యలక్ష్మి. దివ్య, విక్రమ్ ఇద్దరూ సంతోషంగా ఉండటం చూసి లోపల కుళ్లుకుంటుంది కానీ.. బయటికి మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అంటుంది రాజ్యలక్ష్మి. తీసుకో అమ్మ అని తన చేతుల్లో ఉన్న కొబ్బరి బోండాన్ని ఇస్తుంది దివ్య. ఇది నాకోసమా.. విక్రమ్ కోసమా అంటే ఈ ఇంటికి వారసుడిని ఇవ్వబోతోంది నువ్వు. అత్త గారిగా నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూడాల్సిన బాధ్యత నాది. తీసుకో అంటుంది రాజ్యలక్ష్మి. దీంతో కొబ్బరి బోండాన్ని తీసుకొని తాగుతుంది దివ్య.

ఎన్ని మరిచిపోయినా.. నువ్వు చేసిన గొడవలు అస్సలు మరిచిపోలేకపోతున్నాను అని అంటుంది. ప్రియకు కడుపు తీయించాడని నా కళ్ల ముందే నా కొడుకు చెంప నువ్వు పగులగొట్టావు. నువ్వు తాగుతూ ఉండు నేను చెబుతాను అంటుంది. ఆ రోజే మనసులో గట్టిగా అనుకున్నాను. ఆ చెంప దెబ్బకు ప్రతీకారం తీర్చుకోవాలని. ఎంతైనా తల్లిని కదా. ఆ మాత్రం కడుపు మంట ఉంటుంది. నీ కొడుకు చేసింది మహా పాపం అంటుంది దివ్య. దీంతో నా కొడుకు చేసింది మహా పాపం అయితే నేను చేసింది ఏంటి అని అడుగుతుంది రాజ్యలక్ష్మి. నువ్వు తాగుతూ ఉండు నేను చెబుతాను. ఆ కొబ్బరి బోండాంలో నీ కడుపు పోవడానికి ట్యాబ్లెట్లు వేసి తీసుకొచ్చాను. దెబ్బకు దెబ్బ. ఎలా ఉంది ప్లాన్ అంటుంది రాజ్యలక్ష్మి. దీంతో దివ్యకు ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే దివ్య కళ్లు తిరుగుతాయి. విక్రమ్ కి ఫోన్ చేయబోతుంది కానీ.. తన కళ్లు తిరుగుతూ ఉంటాయి. నువ్వు విక్రమ్ కు కాల్ చేసినా వాడిని పిలిచినా వాడు నమ్మడు. నీ కాపురమే చెడిపోతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది రాజ్యలక్ష్మి.

వెంటనే ప్రియను పిలుస్తుంది. అర్జెంట్ గా నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లు అంటుంది దివ్య. కారు రెడీ చేయి అంటే కార్లు లేవు అంటే.. ఎలాగైనా తీసుకెళ్లు అంటుంది. దీంతో ఆటోలో తీసుకెళ్లు అంటుంది దివ్య. అసలు ఏం జరిగింది అంటే.. అంతా అత్తయ్య చేసింది అని చెబుతుంది దివ్య. వెంటనే ఆసుపత్రిలో చేర్పిస్తుంది. డాక్టర్లు చెక్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

ECGC Recruitment 2024 : ECGC రిక్రూట్‌మెంట్ 2024 : ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల‌కు దరఖాస్తుల ఆహ్వానం

ECGC Recruitment 2024  : ECGC లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేడర్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ కోసం ఆసక్తి గల…

31 mins ago

Ginger Juice : ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం రసం తాగితే… శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా…!

Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…

2 hours ago

Current Affairs : మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? గుర్తుంచుకోవలసిన 15 టాప్‌ కరెంట్ అఫైర్స్ పాయింట్లు

Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…

11 hours ago

New Ration Card : కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకు ఈ పత్రాలు తప్పనిసరి

New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…

12 hours ago

Boom Boom Beer : హ‌మ్మ‌య్య‌.. బూమ్ బూమ్ బీర్ల‌కి పులిస్టాప్ ప‌డ్డ‌ట్టేనా… ఇక క‌నిపించ‌వా..!

Boom Boom Beer : ఏపీలో మ‌ద్యం ప్రియులు గ‌త కొన్నాళ్లుగా స‌రికొత్త విధానాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…

13 hours ago

Ap Womens : మ‌హిళ‌ల‌కి గుడ్ న్యూస్.. వారి ఖాతాల‌లోకి ఏకంగా రూ.1500

Ap Womens  : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమ‌లులోకి వ‌చ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వ‌డివ‌డిగా అడుగులు…

13 hours ago

New Liquor Policy : ఏపీలోని కొత్త లిక్క‌ర్ పాల‌సీ విధి విధానాలు ఇవే..!

New Liquor Policy : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక స‌మూలమైన మార్పులు తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. కొత్త‌గా మ‌ద్యం…

14 hours ago

Chandrababu : జ‌గ‌న్ తెచ్చింది దిక్కుమాలిన జీవో.. దానిని జ‌గ‌న్ ముఖాన క‌ట్టి రాష్ట్ర‌మంతా తిప్పుతానన్న చంద్ర‌బాబు..!

Chandrababu : గ‌త కొన్ని రోజులుగా ఏపీలో మెడిక‌ల్ సీట్ల వ్య‌వ‌హారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. త‌న హ‌యాంలో…

17 hours ago

This website uses cookies.