Categories: NewsTV Shows

Intinti Gruhalakshmi 14 Dec Today Episode : దివ్యను పిచ్చిదాన్ని చేసిన రాజ్యలక్ష్మి.. పరందామయ్య మిస్సింగ్.. తులసి, నందుకు దొరుకుతాడా? చివరకు ఎక్కడికి వెళ్తాడు?

Intinti Gruhalakshmi 14 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 14 డిసెంబర్ 2023, గురువారం ఎపిసోడ్ 1127 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు ఎందుకో ప్రతి విషయానికి టెన్షన్ పడుతున్నావు. ఉన్నది లేనట్టుగా భ్రమ పడుతున్నావు. నిన్న తులసి చెట్టు విషయంలోనూ అలాగే చేశావు అని దివ్యతో అంటాడు విక్రమ్. దీంతో ఎవరైనా మంచి సైక్రియాటిస్ట్ కి చూపిస్తే బెటర్ అని బసవయ్య అంటాడు. దీంతో అంటే ఏంటి నాకు పిచ్చా అంటుంది దివ్య. కాదు.. నేను అలా అనలేదు. ముందు మనం రూమ్ కు వెళ్లి మాట్లాడుకుందాం పదా అంటాడు విక్రమ్. అయినా రాదు. దీంతో తనను లోపలికి లాక్కెళ్తాడు విక్రమ్. మరోవైపు నందు.. పరందామయ్యను ఆసుపత్రికి తీసుకెళ్తాడు. మళ్లీ నువ్వెందుకు ఆసుపత్రికి తీసుకొచ్చావు. ఏమైంది అని అడుగుతాడు. దీంతో ఏం లేదు నాన్న. రెగ్యులర్ చెకప్ అంటాడు నందు. బయట పరందామయ్యను కూర్చోబెట్టి నర్సుకు చెప్పి రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు నందు. మరోవైపు చాక్లెట్ తీసుకొని నర్సుకి ఇవ్వబోతాడు పరందామయ్య. నాకు వద్దు అంటుంది. ఇంతలో తనకు ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడేందుకు వెళ్తుంది. ఇంతలో అక్కడ ఒక పాప కనిపిస్తుంది. దీంతో తనకు చాక్లెట్ ఇవ్వబోతాడు పరందామయ్య. నాకు వద్దు అంటుంది ఆ పాప. అయినా కూడా తీసుకో తీసుకో అంటే ఆ పాప ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఆ పాప ఏడవడం చూసిన సెక్యూరిటీ.. పరందామయ్యను చూసి పిల్లలను ఎత్తుకెళ్లే వ్యక్తి అని అనుకుంటారు. మీరు ఎవరు. ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే.. డాక్టర్ ను కలవడానికి అంటాడు పరందామయ్య. ఏ డాక్టర్ అంటే నాకు తెలియదు. మా అబ్బాయిని అడుగు అంటాడు. మీ అబ్బాయి ఎక్కడ అంటే నాకు తెలియదు అంటాడు. నువ్వు ఎవరో నాకు అర్థం అయింది అని చెప్పి వెంటనే పరందామయ్యను హాస్పిటల్ నుంచి బయటికి నెట్టేస్తాడు సెక్యూరిటీ.

దీంతో పరందామయ్య అక్కడి నుంచి రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తాడో తెలియదు. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను. నేను ఎక్కడికి వెళ్లాలి అని అనుకుంటాడు పరందామయ్య. మరోవైపు మీ తండ్రికి అల్జీమర్స్ ఉంది. ఆయన్ను జాగ్రత్తగా చూసుకోండి. మెడిసిన్స్ ఇస్తా అని చెబుతాడు డాక్టర్. ఇంతలో నందుకు కాల్ వస్తుంది. తులసి ఫోన్ చేస్తుంది. ఒక్క నిమిషం అని చెప్పి తులసి కాల్ లిఫ్ట్ చేస్తాడు నందు. మామయ్యను తీసుకెళ్లారా లేదా. ఒకవేళ మీకు కుదరకపోతే చెప్పండి. ఆఫీసులో నా పని పూర్తయింది. నేను వచ్చి తీసుకెళ్తా అంటుంది తులసి. నేను చెప్పేది విను. నేను ఆసుపత్రిలోనే ఉన్నా. నాన్నను తీసుకొచ్చా. నీకు కావాలంటే డాక్టర్ తో మాట్లాడిస్తా అంటాడు. దీంతో అవసరం లేదు అని ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాడు నందు. ఇంకోసారి మీ నాన్నను తీసుకురావాల్సిన అవసరం లేదు. స్టేటస్ చెబితే చాలు. మీరు ఒక్కరు వచ్చినా చాలు అంటాడు డాక్టర్. దీంతో సరే అని బయటికి వస్తాడు నందు. బయటికి వచ్చి చూస్తే నందు కనిపించడు. సిస్టర్ ను అడిగితే ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి. నేను చూడలేదు అంటుంది. దీంతో తన మీద అరుస్తాడు నందు. ఇంతలో సెక్యూరిటీ వచ్చి ఏమైంది అంటే.. మా నాన్న కనిపించడం లేదు అంటే.. అతడిని ఇప్పుడే బయటికి పంపించాను అంటాడు. దీంతో కోపంతో బయటికి వస్తాడు నందు.

Intinti Gruhalakshmi 14 Dec Today Episode : దివ్యను ఓదార్చిన విక్రమ్

మరోవైపు దివ్య తన రూమ్ లో కూర్చొని ఉంటుంది. విక్రమ్ మాట్లాడటానికి వెళ్తే వద్దు నాతో ఎవ్వరూ మాట్లాడొద్దు అంటుంది దివ్య. తనను ఓదార్చుతాడు. నువ్వు ఎందుకు నా మాట నమ్మడం లేదు. నేను ఉదయం చూసినప్పుడు తులసి మొక్క ఎండిపోయింది. లేకపోతే ఎందుకు అంత కన్ఫమ్ గా చెబుతాను. డైనింగ్ టేబుల్ దగ్గర కూడా నేను చూసిందే చెప్పాను. భ్రమ కాదు విక్రమ్ అంటుంది దివ్య. దీంతో సరే నేను ఒప్పుకుంటాను అంటాడు విక్రమ్. పిచ్చి పిల్ల దీనికి ఏడుపు ఎందుకు. అలా అరవడం ఎందుకు అంటాడు విక్రమ్. ఫాస్టింగ్ గా ఉండకు వద్దు అంటాడు విక్రమ్. దీంతో మళ్లీ ప్రాబ్లమ్ అంటావేంటి. నాకు ఏ ప్రాబ్లమ్ లేదు. నేను బాగానే ఉన్నాను అంటుంది దివ్య. లైఫ్ అన్నాక ఇలాంటివి కామన్. లైఫ్ లో ఇవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలి అంటే నాకు నిజంగా పిచ్చి ఉందంటే నన్ను వదిలేస్తావా అంటే.. ప్రాణం వదులుతావా.. దివ్యను వదులుతావా అని అడిగితే ప్రాణం అనే చెబుతా అంటాడు విక్రమ్. దీంతో అతడి ఒడిలో పడుకుంటుంది దివ్య.

మరోవైపు నందు రోడ్డు మీద పరందామయ్య కోసం వెతుకుతూ ఉంటాడు. కారులో తులసి వెళ్తుంటుంది. రోడ్డు మీద పరందామయ్య ఉంటాడు కదనీ.. తనకు కనిపించడు. ఇంతలో తులసి ఇంటికి వస్తుంది. మామయ్య వాళ్లు ఆసుపత్రి నుంచి రాలేదా అంటుంది తులసి. దీంతో నేను వాళ్ల కోసమే చూస్తున్నాను. ఒక్కసారి ఫోన్ చేయకపోయావా అంటే ఇంతకు ముందే చేశాను. ఆసుపత్రిలోనే ఉన్నారు అని చెప్పాడు అంటుంది తులసి. ఇంతలో నందు వస్తాడు. నాన్న నాన్న అంటూ పిలుస్తాడు. అదేంటి మామయ్య గారు మీతోనే ఉన్నారు కదా అంటే అసలు ఏమైంది అని అడుగుతుంది. డాక్టర్ తో మాట్లాడేటప్పుడు బయట కూర్చోబెట్టాను. కానీ.. బయటికి వచ్చేసరికి నాన్న కనిపించలేదు అంటాడు నందు.

ఇద్దరూ కలిసి వెతుకుతూ ఉండగా.. ఒకచోట యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. ఇద్దరూ దిగి అక్కడ ఉన్నవాళ్లను అడిగితే ఒక పెద్దాయనకు యాక్సిడెంట్ జరిగింది అంటారు. వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. కానీ.. చూస్తే అతడు పరందామయ్య కాదు. దీంతో ఇద్దరూ ఊపిరి పీల్చుకుంటారు. మరోవైపు పరందామయ్య రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాడు. హాస్పిటల్ నుంచి మామయ్య ఎక్కువ దూరం వెళ్లి ఉండరు. చుట్టు పక్కనే ఉంటారు అంటుంది తులసి. ఆయన్ను నేనే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సింది. మీటింగ్ ఉందని ఆగిపోయా అని అంటుంది తులసి. ఇప్పుడు ఎక్కడున్నారో ఏమో.. అంటుంది. మనం పోలీస్ కంప్లయింట్ ఇద్దాం పదా అంటాడు నందు.

మరోవైపు పరందామయ్యకు ఆకలి వేస్తుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాదు. ఓ షాపు దగ్గరికి వెళ్లి ఫుడ్ కావాలంటాడు. ఆ షాపు అతడు పోనీలే అని తిను అని అంటాడు. పక్కకెళ్లి తిను అంటే.. మా నందు వచ్చాక డబ్బులు ఇస్తాను అని చెప్పి సమోసా తీసుకొని పక్కకు వెళ్లి తింటూ ఉంటాడు పరందామయ్య. మరోవైపు పోలీస్ స్టేషన్ కు వెళ్లి పరందామయ్య మిస్ అయినట్టు ఫిర్యాదు ఇస్తారు. మరోవైపు రాజ్యలక్ష్మి మరో ప్లాన్ చేస్తుంది. కింద పడిపోయినట్టు యాక్షన్ చేస్తుంది. వెళ్లి విక్రమ్ ను తీసుకొని రాగానే అక్కడ ఉండదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

2 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

2 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

2 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

2 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

2 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

3 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

3 weeks ago