Intinti Gruhalakshmi 20 Nov Monday Episode Highlights : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ఇంటింటి గృహలక్ష్మి 20 నవంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 1106 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనిద్దరం ఎప్పటికీ ఫ్రెండ్స్ గానే ఉందాం అని తులసి చెప్పేసరికి నందుకు ఏం చేయాలో అర్థం కాదు. క్యాండిల్ లైట్ డిన్నర్ లో ఉన్న వాళ్లు మధ్యలోనే వెళ్లిపోతారు. మరోవైపు సరస్వతి అంత్యక్రియలు చేసేద్దాం అని అంటారు చుట్టుపక్కన వాళ్లు. తులసి రాలేదు కదా అంటే.. ఇలా బాడీని ఇంత సేపు పెట్టడం కరెక్ట్ కాదు అంటారు. ఇంతలో దివ్య కూడా వస్తుంది. విక్రమ్, దివ్య ఇద్దరూ వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తారు. అందరూ తులసి కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ.. తులసి ఇక రాదు అని తెలుసుకొని సరస్వతి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. మరోవైపు తులసి, నందు అప్పుడే కారులో దిగుతారు. ఇంటికి వస్తారు. రాములమ్మ ఎదురు వచ్చి అమ్మ తులసమ్మ మీ అమ్మ గారు దేవుడు దగ్గరికి వెళ్లిపోయారు అని చెబుతుంది. దీంతో తులసి కళ్లు తిరిగి పడిపోతుంది. వెంటనే తనను సరస్వతిని అంత్యక్రియలు చేసే చోటు దగ్గరికి నందు కారులో తీసుకెళ్తాడు.
అప్పుడే సరస్వతికి దీపక్ అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉంటాడు. తన చితికి నిప్పు పెట్టిన తర్వాత ఆఖరి చూపు కూడా చూసుకోలేకుండా అవుతుంది. చివరకు తులసి అక్కడికి వచ్చే లోపు అంత్యక్రియలు పూర్తవుతాయి. నేను వచ్చే లోపు అంత్యక్రియలను ఆపలేకపోయారా? అంటూ దీపక్ పై విరుచుకుపడుతుంది తులసి. నా అమ్మను చివరి చూపు కూడా చూసుకోకుండా చేశావు. ఈ అక్కను మోసం చేశావురా అంటుంది తులసి. వీడు నా తమ్ముడే కాదు. అమ్మతో పాటే మా ఇద్దరి మధ్య బంధం కూడా కాలిపోతోంది అంటుంది తులసి. జీవితంలో వీడి ముఖం చూడను. ఇక.. వీడు మన ఇంటి గడప తొక్కడానికి వీలు లేదు అంటుంది తులసి. అమ్మ పోయింది. నువ్వు కూడా నన్ను దూరం చేస్తే ఎలా అక్క అంటే.. అమ్మతో పాటే నాకు కూడా చితి పెట్టు అంటుంది తులసి. నాకు బతకాలని లేదు. మంచి చెడు చెప్పే అమ్మే పోయాక నాకు ఈ ఒంటరి బతుకు వద్దు.. అంటూ తులసి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది.
మరోవైపు సరస్వతి అంత్యక్రియలు పూర్తయ్యాక తులసి, తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత దీనంగా కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఇంతలో దీపక్ అక్కడికి వస్తాడు. దీపక్ మాట్లాడబోతే అస్సలు తులసి పట్టించుకోదు. నువ్వు మళ్లీ ఎందుకు వచ్చావు ఇక్కడి నుంచి వెళ్లిపో అంటుంది తులసి. దీపక్ మాత్రం నేను చెప్పేది విను అక్క అంటాడు. చావు పుట్టుకలు సహజం వాటి నుంచి ఎవ్వరూ తప్పించలేరు అని పరందామయ్య.. తులసిని ఓదార్చుతాడు. అమ్మ పోయిన బాధను దిగమింగుకోవాలి అంటాడు. ఏదైనా తిను అని అందరూ తులసిని బతిమిలాడుతారు.
ముందు వీడిని ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెప్పండి అని అంటుంది తులసి. నా కళ్ల ముందు నుంచి వెళ్లు అంటుంది. తప్పు అలా అనకూడదు అంటాడు పరందామయ్య. తను కూడా నీలాగే అమ్మ పోయిన బాధలో ఉన్నాడు. పెద్ద దానివి.. నువ్వే ఓదార్చాలి అంటాడు పరందామయ్య. దీంతో వాడు చేసింది మామూలు తప్పు కాదు మామయ్య. అమ్మ ఆఖరి చూపు కూడా చూడకుండా చేశాడు. వాడిని క్షమించే ప్రసక్తే లేదు అంటుంది తులసి.
అక్క.. జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదక్కా. ప్రశాంతంగా నేను చెప్పేది విను అంటే.. వినను.. అస్సలు వినను అంటుంది తులసి. నీ ఫోన్ కలిసి ఉంటే అమ్మ బతికేది అక్క అంటాడు దీపక్. దీంతో నందగోపాల్ గారు అంటూ గట్టిగా పిలుస్తుంది. మా అమ్మను చంపిన హంతకులు మీరే అంటుంది తులసి. యస్.. మీ వల్లే మా అమ్మ చనిపోయింది అంటుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.