Intinti Gruhalakshmi 20 Nov Monday Episode Highlights : నందు వల్లనే తన అమ్మ చనిపోయిందని తెలిసి తులసి ఏం చేస్తుంది? నందును కంపెనీ నుంచి తీసేస్తుందా? ఇంట్లో నుంచి వెళ్లగొడుతుందా? | The Telugu News

Intinti Gruhalakshmi 20 Nov Monday Episode Highlights : నందు వల్లనే తన అమ్మ చనిపోయిందని తెలిసి తులసి ఏం చేస్తుంది? నందును కంపెనీ నుంచి తీసేస్తుందా? ఇంట్లో నుంచి వెళ్లగొడుతుందా?

Intinti Gruhalakshmi 20 Nov Monday Episode Highlights : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ఇంటింటి గృహలక్ష్మి 20 నవంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 1106 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనిద్దరం ఎప్పటికీ ఫ్రెండ్స్ గానే ఉందాం అని తులసి చెప్పేసరికి నందుకు ఏం చేయాలో అర్థం కాదు. క్యాండిల్ లైట్ డిన్నర్ లో ఉన్న వాళ్లు మధ్యలోనే వెళ్లిపోతారు. మరోవైపు సరస్వతి […]

 Authored By gatla | The Telugu News | Updated on :19 November 2023,8:18 am

ప్రధానాంశాలు:

  •  తులసి ఇంటికి రాగానే తన తల్లి చనిపోయినట్టు చెప్పిన రాములమ్మ

  •  తన తల్లి కడసారి చూపు చూసుకోలేకపోయిన తులసి

  •  దీపక్ పై బంధం తెంచుకున్న తులసి

Intinti Gruhalakshmi 20 Nov Monday Episode Highlights : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ఇంటింటి గృహలక్ష్మి 20 నవంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 1106 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనిద్దరం ఎప్పటికీ ఫ్రెండ్స్ గానే ఉందాం అని తులసి చెప్పేసరికి నందుకు ఏం చేయాలో అర్థం కాదు. క్యాండిల్ లైట్ డిన్నర్ లో ఉన్న వాళ్లు మధ్యలోనే వెళ్లిపోతారు. మరోవైపు సరస్వతి అంత్యక్రియలు చేసేద్దాం అని అంటారు చుట్టుపక్కన వాళ్లు. తులసి రాలేదు కదా అంటే.. ఇలా బాడీని ఇంత సేపు పెట్టడం కరెక్ట్ కాదు అంటారు. ఇంతలో దివ్య కూడా వస్తుంది. విక్రమ్, దివ్య ఇద్దరూ వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తారు. అందరూ తులసి కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ.. తులసి ఇక రాదు అని తెలుసుకొని సరస్వతి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. మరోవైపు తులసి, నందు అప్పుడే కారులో దిగుతారు. ఇంటికి వస్తారు. రాములమ్మ ఎదురు వచ్చి అమ్మ తులసమ్మ మీ అమ్మ గారు దేవుడు దగ్గరికి వెళ్లిపోయారు అని చెబుతుంది. దీంతో తులసి కళ్లు తిరిగి పడిపోతుంది. వెంటనే తనను సరస్వతిని అంత్యక్రియలు చేసే చోటు దగ్గరికి నందు కారులో తీసుకెళ్తాడు.

అప్పుడే సరస్వతికి దీపక్ అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉంటాడు. తన చితికి నిప్పు పెట్టిన తర్వాత ఆఖరి చూపు కూడా చూసుకోలేకుండా అవుతుంది. చివరకు తులసి అక్కడికి వచ్చే లోపు అంత్యక్రియలు పూర్తవుతాయి. నేను వచ్చే లోపు అంత్యక్రియలను ఆపలేకపోయారా? అంటూ దీపక్ పై విరుచుకుపడుతుంది తులసి. నా అమ్మను చివరి చూపు కూడా చూసుకోకుండా చేశావు. ఈ అక్కను మోసం చేశావురా అంటుంది తులసి. వీడు నా తమ్ముడే కాదు. అమ్మతో పాటే మా ఇద్దరి మధ్య బంధం కూడా కాలిపోతోంది అంటుంది తులసి. జీవితంలో వీడి ముఖం చూడను. ఇక.. వీడు మన ఇంటి గడప తొక్కడానికి వీలు లేదు అంటుంది తులసి. అమ్మ పోయింది. నువ్వు కూడా నన్ను దూరం చేస్తే ఎలా అక్క అంటే.. అమ్మతో పాటే నాకు కూడా చితి పెట్టు అంటుంది తులసి. నాకు బతకాలని లేదు. మంచి చెడు చెప్పే అమ్మే పోయాక నాకు ఈ ఒంటరి బతుకు వద్దు.. అంటూ తులసి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది.

Intinti Gruhalakshmi 20 Nov Monday Episode Highlights : మళ్లీ తులసిని కలిసిన దీపక్

మరోవైపు సరస్వతి అంత్యక్రియలు పూర్తయ్యాక తులసి, తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత దీనంగా కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఇంతలో దీపక్ అక్కడికి వస్తాడు. దీపక్ మాట్లాడబోతే అస్సలు తులసి పట్టించుకోదు.  నువ్వు మళ్లీ ఎందుకు వచ్చావు ఇక్కడి నుంచి వెళ్లిపో అంటుంది తులసి. దీపక్ మాత్రం నేను చెప్పేది విను అక్క అంటాడు. చావు పుట్టుకలు సహజం వాటి నుంచి ఎవ్వరూ తప్పించలేరు అని పరందామయ్య.. తులసిని ఓదార్చుతాడు. అమ్మ పోయిన బాధను దిగమింగుకోవాలి అంటాడు. ఏదైనా తిను అని అందరూ తులసిని బతిమిలాడుతారు.

ముందు వీడిని ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెప్పండి అని అంటుంది తులసి. నా కళ్ల ముందు నుంచి వెళ్లు అంటుంది. తప్పు అలా అనకూడదు అంటాడు పరందామయ్య. తను కూడా నీలాగే అమ్మ పోయిన బాధలో ఉన్నాడు. పెద్ద దానివి.. నువ్వే ఓదార్చాలి అంటాడు పరందామయ్య. దీంతో వాడు చేసింది మామూలు తప్పు కాదు మామయ్య. అమ్మ ఆఖరి చూపు కూడా చూడకుండా చేశాడు. వాడిని క్షమించే ప్రసక్తే లేదు అంటుంది తులసి.

అక్క.. జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదక్కా. ప్రశాంతంగా నేను చెప్పేది విను అంటే.. వినను.. అస్సలు వినను అంటుంది తులసి. నీ ఫోన్ కలిసి ఉంటే అమ్మ బతికేది అక్క అంటాడు దీపక్. దీంతో నందగోపాల్ గారు అంటూ గట్టిగా పిలుస్తుంది. మా అమ్మను చంపిన హంతకులు మీరే అంటుంది తులసి. యస్.. మీ వల్లే మా అమ్మ చనిపోయింది అంటుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...