Intinti Gruhalakshmi 23 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 23 డిసెంబర్ 2023, శనివారం ఎపిసోడ్ 1135 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దివ్య కంగారు పడుతూ విక్రమ్ అని పిలుస్తుంది. దీంతో తనకు ఏమైందో అని అందరూ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. విక్రమ్ కూడా వస్తాడు. ఏమైంది దివ్య అని అడిగేలోపే దివ్య స్పృహ తప్పి పడిపోతుంది. తన ముఖం మీద నీళ్లు కొట్టి దివ్యను లేపుతాడు. ఇంతలో వద్దురా.. దివ్యను ఒంటరిగా బయటికి పంపించొద్దు అన్నాను. విన్నావా చూడు ఇప్పుడు అని రాజ్యలక్ష్మి అంటుంది. రోడ్డు మీద జరిగిన దాన్ని గుర్తు తెచ్చుకుంటుంది దివ్య. వెంటనే లేచి నిలబడుతుంది. అడ్డుతప్పుకో.. అడ్డు తప్పుకో అంటూ అరుస్తుంది దివ్య. ఏమైంది అంటే యాక్సిడెంట్ అయింది చంపేశారు అంటుంది. నిజం చెబుతున్నాను. ఒక అమ్మాయిని కారు గుద్దేసింది. చచ్చిపోయింది అంటుంది దివ్య. ఎక్కడ అంటే అక్కడ.. మైలు రాయి దగ్గర అంటుంది. సడెన్ గా కారుకు అడ్డు వచ్చింది. కంట్రోల్ చేయలేకపోయాను. స్పాట్ లో పోయింది అంటుంది దివ్య. నేను చంపేశాను.. అంటుంది దివ్య. అలా కాదురా.. ఎందుకైనా మంచిది ఒకసారి మనం కూడా స్పాట్ కు వెళ్లి వద్దాం అంటుంది రాజ్యలక్ష్మి. దీంతో చంపాం మొర్రో అని ఏడుస్తుంటే ఇంకా వెళ్లి చూస్తాం అంటున్నావు ఏంటి.. అది యాక్సిడెంట్ స్పాట్ అని అంటాడు బసవయ్య. అక్కడ పోలీసులు గట్రా ఉంటారు. వెళ్తే దొరికిపోతాం అంటాడు బసవయ్య.
ఏం చేద్దాం అంటావు అమ్మ అంటే.. చూడు చిన్న నా అనుమానాలు నాకు ఉన్నాయి. ఇంతకంటే నన్ను ఏం అడగకు. స్పాట్ దగ్గరికి వెళ్దాం అంటుంది దివ్య. యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందో గుర్తు పడతావా అంటే గుర్తు పడతాను.. బాడీ అక్కడే ఉంది అంటుంది దివ్య. దీంతో తనను కారులో తీసుకెళ్లి ఆ స్పాట్ దగ్గరికి వెళ్తారు కానీ.. అక్కడ యాక్సిడెంట్ అయిన ఆనవాళ్లు ఏం ఉండవు. కానీ.. ఇక్కడే యాక్సిడెంట్ జరిగింది అంటుంది దివ్య. మరి బాడీ ఎక్కడ అంటే అదే నాకు అర్థం కావడం లేదు. ఇక్కడే ఉండాలి అంటుంది దివ్య. పెద్దగా దెబ్బలు తాకలేదేమో అంటాడు బసవయ్య. ఆ బాడీ ఇక్కడే ఉండాలి అంటుంది దివ్య. అసలు నువ్వు బాగా గుర్తు తెచ్చుకో.. నువ్వు యాక్సిడెంట్ చేయలేదేమో అంటాడు విక్రమ్. దీంతో చేశాను అంటే అర్థం చేసుకోరు ఏంటి అంటుంది దివ్య. బాడీ కనబడకపోతే టెన్షన్ ఎందుకు అంటాడు బసవయ్య. నేను నిజం చెబుతున్నాను నన్ను నమ్ము విక్రమ్. ఇక్కడే యాక్సిడెంట్ చేశాను. ఇక్కడే అమ్మాయి చనిపోయింది అంటుంది దివ్య. దీంతో దివ్య ఇంటికి వెళ్దాం పదా. ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం అంటే.. దివ్య ఇంటికి రాను అంటుంది. ఆ అమ్మాయి శవం కనబడే వరకు నేను ఇంటికి రాను అంటుంది. మీరంతా వెళ్లండి.. నేను రాను అంటుంది దివ్య. దీంతో వస్తావా లేదా అంటాడు విక్రమ్. నేను హంతకురాలిని. ఆ అమ్మాయిని నేనే చంపాను అంటూ మళ్లీ కిందపడిపోతుంది దివ్య.
మరోవైపు లాస్య చెప్పిన డాక్టర్ గురించి ఆలోచిస్తుంటాడు నందు. తులసి మనసు మార్చుకున్నట్టుగా లేదు. నాన్నను లాస్య చెప్పిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం అనడం లేదు. కూల్ గా ఆఫీసుకు రెడీ అవుతోంది ఏం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్నను ఆ ఆసుపత్రికి తీసుకెళ్లాలి అని అనుకుంటాడు నందు. తులసి ఆఫీసుకు వెళ్లాక అమ్మను ఒప్పించి అయినా నాన్నను ఆసుపత్రికి తీసుకెళ్లాలి అని అనుకుంటాడు నందు. ఇంతలో లాస్య వస్తుంది. నందు.. ఏమైంది ఇంకా ఇలాగే ఉన్నావేంటి త్వరగా రెడీ అవ్వు.. అంటుంది లాస్య. నేను చెప్పాను కదా. ఆసుపత్రికి వెళ్దామన్నా కదా అంటే.. నువ్వు చెప్పిన ఆసుపత్రికి మేము తీసుకెళ్లం అంటుంది తులసి. మామయ్యకు నయం అవడం మీకు ఇష్టం లేదా అని అడుగుతుంది లాస్య. మామయ్య స్ట్రగుల్ అవుతున్నారు. ఈ కష్టాన్ని తప్పించే డాక్టర్ కోసం తెలిసిన వాళ్లను అందరినీ అడుగుతున్నాను. లక్కీగా ఒక డాక్టర్ దొరికారు. నిజంగా మొహమాటం లేకుండా మీ మనసులో ఏముందో చెప్పండి అత్తయ్య అంటుంది లాస్య.
ఈ ఇంట్లో ఎవ్వరం అయినా తులసి చెప్పినట్టే నడుచుకుంటాం అంటుంది అనసూయ. దీంతో నడుచుకోండి.. ఎవ్వరూ వద్దనడం లేదు కానీ.. ఈ ఒక్క విషయంలో మాత్రం మామయ్య ఆరోగ్యం కోసం ఆలోచించండి అంటుంది లాస్య. నాన్నను ఇంకో డాక్టర్ కు చూపిస్తే తప్పేంటి అని అడుగుతాడు నందు కూడా. మీ నాన్న బాగుపడతారు అంటే అంతకుమించి నాకేం కావాలి అంటుంది అనసూయ. తులసి కూడా ఒప్పుకుంటే అంటుంది అనసూయ. నాకు కొత్త డాక్టర్ మీద నమ్మకం ఉంది. ఆలోచిస్తూ టైమ్ వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాన్నను తీసుకెళ్తాను అంటాడు నందు. దీంతో నేనూ వస్తాను అంటుంది తులసి. దీంతో అనసూయ సంతోషిస్తుంది. ఆఫీసు మానుకొని ఎందుకు రావడం.. నందుకు సపోర్ట్ గా నేను ఉన్నాను కదా అంటే.. మామయ్య ఆరోగ్యం నాకు ముఖ్యం. డాక్టర్ తో నేను మాట్లాడుతా అంటుంది తులసి. దీంతో అలాగే తులసి.. రెండు నిమిషాల్లో నేను రెడీ అయి వస్తా అంటాడు నందు.
దివ్యను డాక్టర్ టెస్ట్ చేస్తాడు. తనకు మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి అని డైరెక్ట్ గా చెప్పేస్తాడు. దీంతో నా భయమే నిజం అయిందన్నమాట అంటుంది రాజ్యలక్ష్మి. జరిగింది జరగనట్టు.. జరగనిది జరిగినట్టు ఊహించుకుంటూ ఉంటారు. ఇది ప్రమాదకరమైన జబ్బు ఏం కాదు కానీ.. రెగ్యులర్ గా ట్రీట్ మెంట్ తీసుకోవాలి. పేషెంట్ ను జాగ్రత్తగా చూసుకోవాలి అంటాడు డాక్టర్. ఆ తర్వాత మళ్లీ లేచిన దివ్య నేను ఇంకా తప్పు చేశాను అని అంటుంది. మరోవైపు పరందామయ్యను ఆసుపత్రికి తీసుకెళ్తారు. డాక్టర్ పరందామయ్యకు ట్రీట్ మెంట్ చేసి తనను హిప్నటైజ్ చేస్తాడు. దీంతో లాస్యనే తన కోడులు అని అనుకుంటాడు పరందామయ్య. తులసి తనను ముట్టుకోబోయినా అస్సలు ముట్టుకోడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.