Categories: NewsTrendingTV Shows

Intinti Gruhalakshmi 26 Oct Today Episode : నందును చంపేస్తానని తులసిని బెదిరించిన లాస్య.. జాను ఫేక్ పచ్చబొట్టును బట్టబయలు చేసిన దివ్య.. దివ్యను కిడ్నాప్ చేసి చంపేస్తారా?

Intinti Gruhalakshmi 26 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 26 అక్టోబర్ 2023, గురువారం ఎపిసోడ్ 1085 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుముందు ఎలాంటి కఠినమైన నిర్ణయాలు అయినా తీసుకోవచ్చు. నాకు సంబంధం లేదని తప్పించుకోవడం కాదు. ప్రమాదం తులసికి మాత్రమే కాదు మీ అందరికీ ఉంటుంది అని అంటుంది లాస్య. దీంతో తను మాట వినడం లేదు. ఏం చేయమంటావు అని అంటాడు నందు. మీ నాన్న మాట ఎందుకు తలవంచావు. ఇంట్లో నుంచి బయటికి వెళ్తా అన్నప్పుడు మెడ పట్టి బయటికి గెంటేయాలి కానీ ఎందుకు ఆగావు. నీ మంచి కోరే చెబుతున్నాను.. అని నందును రెచ్చగొడుతుంది లాస్య. దీంతో కోపంలో నందు.. తులసి దగ్గరికి వెళ్తాడు. తులసి.. హనీకి భోజనం తినిపిస్తూ ఉంటుంది. దీంతో ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు జాను.. తన పచ్చబొట్టు చెరిగిపోవడంతో అయ్యో ఇదెప్పుడు చెరిగిపోయింది అని భయపడుతుంది. మళ్లీ కొత్తది రాసుకోవాలి అని అనుకుంటుంది. ఇదంతా దివ్య గమనిస్తూ ఉంటుంది. తను ఏం చేస్తుంది అని అనుకుంటుంది. నా చేతి మీద ఉన్న పచ్చబొట్టు ఫేక్ కానీ.. నీ మీద నాకు ఉన్న ప్రేమ మాత్రం ఫేక్ కాదు బావ. 100 శాతం ప్యూర్. నువ్వు నాకు కావాలి. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి. అందుకే ఈ తంటాలు అన్నీ. ఏం చేయను. ప్రతి సారి నా చేతికి అంది జారి పోతున్నావు. ఈసారి అలా జరగకూడదు. అందుకే పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నా అని అనుకుంటుంది జాను. ఇదంతా దివ్య వింటుంది. షాక్ అవుతుంది.

ఫేక్ టాటూతోనే చెమటలు పట్టించా. నువ్వు నా ప్రేమకు పడిపోతావు. నాకు ఆ నమ్మకం ఉంది. మన పెళ్లి అయిన మరుక్షణం.. నిజమైన టాటూ వేయించుకుంటాను ఇది పక్కా అని అనుకుంటుంది జాను. నీకు బుద్ధి చెప్పడం ఖాయం. ఇది పక్కా. నీ ఆట కట్టు అని మనసులో అనుకుంటుంది దివ్య. మరోవైపు తులసికి లాస్య ఫోన్ చేస్తుంది. కాల్ చేసి విసిగించడం తప్ప నీకు వేరే పని లేదా అంటే.. అదేమన్నా చిన్నపనా.. దానికి కూడా ఎంత టాలెంట్ ఉండాలి అంటుంది లాస్య. నువ్వు పంపించిన ఆకు రౌడీలను చూశాంలే అంటుంది తులసి. నన్ను రెచ్చగొట్టకు. నీకే నష్టం అంటుంది లాస్య. మెండితనానికి పోకుండా నీ నిర్ణయాన్ని మార్చుకో అంటుంది లాస్య. తీసుకున్న నిర్ణయానికి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం నాకు అలవాటు అంటుంది తులసి. ఇష్యూను చాలా ఈజీగా తీసుకుంటున్నావు తులసి. లాస్యను తక్కువ అంచనా వేస్తున్నావు అంటుంది లాస్య. నువ్వే తులసిని చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. నేను అప్పటి తులసినే అనుకుంటున్నావు అంటుంది తులసి. కర్ర పట్టుకున్నావు.. అట్లకాడ పట్టుకున్నావు. అది సరిపోదు కదా. విజయవాడకు వెళ్లిన నందు మీద దారిలో అటాక్ చేసి ఉంటే నువ్వు ఏం చేసేదానివి. నందుకు ఎక్కడైనా దారిలో ఏదైనా జరగొచ్చు. కెఫేలో కూడా ఏదైనా జరగొచ్చు కదా. కాదంటావా అంటూ మరో టెన్షన్ పెడుతుంది. నందు మీ ఫ్యామిలీ మెంబర్ కాదా. నందును వద్దనుకుంటున్నావా? అప్పుడు నాతో ఎందుకు విడాకులు ఇప్పించావు అంటుంది లాస్య.

Intinti Gruhalakshmi 26 Oct Today Episode : నందును చంపేస్తానని తులసిని బెదిరించిన లాస్య.. జాను ఫేక్ పచ్చబొట్టును బట్టబయలు చేసిన దివ్య.. దివ్యను కిడ్నాప్ చేసి చంపేస్తారా?

Intinti Gruhalakshmi 26 Oct Today Episode : నీ మొండితనం వల్ల నీ మొగుడిని ఇబ్బందుల్లో పెడతావా అని తులసిని బెదిరించిన లాస్య

నీ మొండితనం వల్ల నీ మొగుడు ఇబ్బందులు పడుతాడు అంటుంది లాస్య. నీ మొండి వాళ్ల వల్ల నా లాంటి వాళ్లు రాక్షసులుగా మారుతారు. తప్పు నీది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నిర్ణయం మార్చుకో. హనీని అప్పగించు. అప్పుడు నీ మాజీ మొగుడు కూడా సేఫ్. నందు జాగ్రత్త.. అంటూ ఫోన్ పెట్టేస్తుంది లాస్య. దీంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు.

కట్ చేస్తే.. విక్రమ్ భోజనం చేస్తుండగా రాజ్యలక్ష్మి ఫోన్ చేస్తుంది. అమ్మా ఎలా ఉన్నావు. ఢిల్లీ ఎలా ఉంది అని అడుగుతాడు. నా బాధ అంతా జాను గురించే అంటుంది. చిన్నపిల్ల.. దానికి ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియదు. నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకో సరేనా అంటే.. సరే అంటాడు విక్రమ్.

ఇంతలో జాను కిందికి వస్తుంది. జాను పచ్చబొట్టునే చూస్తుంది దివ్య. ఆ తర్వాత జాను వచ్చి విక్రమ్ పక్కన కూర్చోబోతుండగా విక్రమ్ లేస్తాడు. ఏమైంది బావ.. ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతుంది. దీంతో నాకు ఆకలిగా లేదు. నేను తర్వాత తింటాను అంటాడు విక్రమ్. దీంతో విక్రమ్ ను తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది జాను. ఏం కాదు.. ఎందుకు ఇబ్బంది పడుతున్నావు. ప్రశాంతంగా తిను అంటుంది దివ్య.

జాను తింటుండగా.. కావాలని తన చేయి మీద కూర వేస్తుంది దివ్య. అయ్యో.. సారీ జాను.. ఒక్క నిమిషం అని చెప్పి లోపలికి వెళ్లి ఒక క్లాత్ తెచ్చి దాన్ని తూడ్చేస్తుంది దివ్య. దీంతో దాని మీద ఉన్న విక్రమ్ పచ్చబొట్టు కూడా పోతుంది. పచ్చబొట్టు లేదని చూసి విక్రమ్ షాక్ అవుతాడు. ఫేక్ టాటూనా అని అంటుంది దివ్య.

ఒరిజినల్ టాటూనే అంటుంది జాను. ఎంత సర్దిచెప్పినా జాను చేసిన పని అందరికీ తెలిసిపోతుంది. పిచ్చిపిచ్చి ప్రయత్నాలతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావని తెలుస్తోంది. అందం ఉంది.. చదువు ఉంది.. ఎందుకు నా మొగుడి వెంట పడుతున్నావు అంటుంది దివ్య.

మరోవైపు నేను కెఫెకు వెళ్తున్నా అని అంటాడు నందు. దీంతో అదేంటి తులసిని తీసుకెళ్లవా అంటే ఈ ఇంట్లో ఎవరి నిర్ణయాలు వాళ్లవు. నేను ఎందుకు పిలవాలి అంటాడు నందు. దీంతో అదంతా పక్కన పెట్టండి. కొన్ని రోజులు మీరు కెఫెకు వెళ్లకండి అంటుంది తులసి.

మనం ఒక నిర్ణయానికి వచ్చాక ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఉండకూడదు. కలిసి నిర్ణయాలు తీసుకోవాలి అంటాడు పరందామయ్య. మరి నేను ఎన్ని రోజులు కెఫెకు వెళ్లకూడదు అని ప్రశ్నిస్తాడు నందు. ప్రమాదం మనకు దూరంగా జరిగేవరకు అంటుంది తులసి. దీంతో అదే ఎప్పుడు అంటాడు నందు.

హనీని వాళ్ల ఇంట్లో అప్పగించే వరకు మన మెడలో కత్తి ఇలాగే వేలాడుతూ కనిపిస్తుంది. ఎప్పుడు ఏ మూల నుంచి ఎవరు మీద పడతారో అని భయపడాల్సిందే అంటాడు నందు. తులసి ఎప్పటికీ హనీని వాళ్ల ఇంట్లో అప్పగించదు. అప్పుడు సమస్యకు పరిష్కారం ఎప్పుడు. ఎన్ని రోజులు అని ఇంట్లో కూర్చోవాలి అంటాడు.

దీంతో నన్ను కార్నర్ చేయడం మానేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు చెప్పినట్టే నేను వింటాను. సమస్యకు పరిష్కారం చెప్పండి. హనీని తిరిగి అప్పగించడం తప్ప అంటుంది తులసి. దీంతో హనీని తిరిగి ఇవ్వదట.. సమస్యకు పరిష్కారం కావాలట.. ఎలా కుదురుతుంది అంటాడు నందు. ఆ తర్వాత దివ్యను కొందరు రౌడీలు కిడ్నాప్ చేస్తారు. తులసి వస్తేనే దివ్యను వదిలిపెడతాం అని లేఖ రాస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Wife : అక్రమ సంబంధానికి అడ్డు తగులుతున్నాడని భర్తనే చంపిన భార్య..!

Wife  : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…

7 hours ago

AP Farmers : ఏపీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన‌ మంత్రి అచ్చెన్నాయుడు..!

AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…

8 hours ago

Pawan Kalyan : బాలినేని కి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లేనా..?

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…

9 hours ago

Roja : బాలకృష్ణ కు అది ఎక్కువ అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు.. వీడియో !

Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…

10 hours ago

KTR : 72 గంటల్లో రా.. తేల్చుకుందాం అంటూ రేవంత్ కు సవాల్ విసిరిన కేటీఆర్..!

KTR  : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…

11 hours ago

Mallikarjun Kharge : ఎమ్మెల్యేలకు మల్లికార్జున ఖర్గే వార్నింగ్..!

Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…

12 hours ago

Insta Reel : ఇన్‌స్టాగ్రామ్ రీల్ తెచ్చిన తంటా.. వరంగల్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. వీడియో

Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…

13 hours ago

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌కి ప్ర‌భాస్ సాయం.. వార్త‌ల‌పై అస‌లు క్లారిటీ ఇదే..!

Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…

14 hours ago