Karthika Deepam 2 April 10th 2026 Episode : కార్తీక్ చేతిలో తాళి పెట్టిన జ్యోత్స్న.. పెళ్లి రోజు భార్య దీపకు ఊహించని షాక్!

 Authored By jagadesh | The Telugu News | Updated on :10 April 2026,8:37 am

Karthika Deepam 2 April 10th 2026 Episode : స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న ‘కార్తీక దీపం 2’ Karthika Deepam 2 సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. రోజుకో సరికొత్త మలుపుతో, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఈ సీరియల్ రేటింగ్స్‌లో దూసుకుపోతోంది. ముఖ్యంగా కార్తీక్, దీప, జ్యోత్స్నల మధ్య జరుగుతున్న ట్రయాంగిల్ డ్రామా ప్రేక్షకులను టీవీల ముందు కట్టిపడేస్తోంది. ఏప్రిల్ 10వ తేదీన ప్రసారం కానున్న 641వ ఎపిసోడ్ Karthika Deepam 2 April 10th Episode లో మైండ్ బ్లాంక్ అయ్యే ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. కార్తీక్, దీపల మొదటి పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళిద్దరినీ విడదీయాలని కంకణం కట్టుకున్న జ్యోత్స్న.. ఏకంగా కార్తీక్ చేతిలో తాళిబొట్టు పెట్టి తన మెడలో కట్టమని అడిగే క్లైమాక్స్ ఈరోజు ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. అసలు ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగింది.

Karthika Deepam 2 April 10th 2026 Episode : కార్తీక్ చేతిలో తాళి పెట్టిన జ్యోత్స్న.. పెళ్లి రోజు భార్య దీపకు ఊహించని షాక్!

Karthika Deepam 2 April 10th 2026 Episode : కార్తీక్ చేతిలో తాళి పెట్టిన జ్యోత్స్న.. పెళ్లి రోజు భార్య దీపకు ఊహించని షాక్!

Karthika Deepam 2 April 10th 2026 Episode గుడిలో కార్తీక్, దీపల సీక్రెట్.. చాటుగా విన్న జ్యోత్స్న

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో.. గుడిలో కార్తీక్, దీప మాట్లాడుకుంటూ ఉంటారు. తన కూతురికి (జ్యోత్స్నకు) ఏమైనా జరిగితే మా అమ్మ (సుమిత్ర) తట్టుకోలేదని దీప బాధపడుతూ కార్తీక్‌తో అంటుంది. దానికి కార్తీక్ స్పందిస్తూ.. “అలాంటిది జ్యోత్స్న తన సొంత కూతురే కాదని తెలిస్తే ఇంకెంత బాధపడుతుందో ఆలోచించు దీప. మీ అమ్మ గుండె ఆగిపోతుంది. మనం అత్తని ఈ స్టేజ్ నుంచి మెల్లగా బయటికి తీసుకురావాలి. అత్తకి జ్యోత్స్న మీదున్న అపారమైన ప్రేమే.. జ్యోత్స్నకి అసలైన బలం. జ్యోత్స్న తన కూతురు కాదని, నువ్వే తన సొంత కూతురివి అని తెలిసిన రోజున, ఆ నిజాన్ని అత్త తట్టుకోగలదని మనకు నమ్మకం కలిగిన రోజున.. మనం ఈ అగ్రిమెంట్లు, డ్రామాలు ఆడాల్సిన అవసరం అస్సలు ఉండదు” అని కార్తీక్ దీపకు ధైర్యం చెబుతాడు. అయితే, వీరు మాట్లాడుకుంటున్న ఈ విషయాలన్నీ జ్యోత్స్న దొంగచాటుగా నిలబడి వింటుంది. “ఓహో, నా బలం, నా బలహీనతలు ఏంటో మీకు బాగానే తెలుసు కదా.. దీనికి నా దగ్గర వేరే ప్లాన్ ఉంది” అని జ్యోత్స్న మనసులో కుట్ర పన్నుతుంది. ఈ క్రమంలో జ్యోత్స్నకి ఏదో అనుమానం వచ్చినట్లు ఉందని, ఆమె మాటల్లో, ప్రవర్తనలో చాలా తేడా కనిపిస్తోందని దీప కార్తీక్‌ను హెచ్చరిస్తుంది. జ్యోత్స్న ఇలా మారడానికి బలమైన కారణం ఉందంటూ కార్తీక్ ఏదో చెప్పబోతుండగా.. అక్కడికి జ్యోత్స్న ఎంట్రీ ఇస్తుంది.

Karthika Deepam 2 April 10th 2026 Episode జ్యోత్స్న తలనొప్పి డ్రామా.. పారిజాతానికి చెమటలు

కార్తీక్, దీపల పెళ్లి రోజు కావడంతో వారు సంతోషంగా గడపకూడదని ప్లాన్ చేసిన జ్యోత్స్న.. వెంటనే తన నాటకం మొదలుపెడుతుంది. తనకు విపరీతంగా తల తిరుగుతోందని, కారులో ఇంటికి వెళ్దాం, ఆసుపత్రికి తీసుకెళ్లమని కార్తీక్‌ను అడుగుతుంది. దీపకు కార్తీక్‌ను దూరం చేయడమే జ్యోత్స్న లక్ష్యం. అయితే అక్కడే ఉన్న పారిజాతం జ్యోత్స్న ప్లాన్ అర్థం చేసుకోకుండా.. “వాడి (కార్తీక్) డ్యూటీ అయిపోయింది, నేనే నిన్ను తీసుకెళ్తాను పదా” అని అంటుంది. దానికి జ్యోత్స్న మండిపడుతూ, “నీకు కొంచమైనా మానవత్వం ఉందా గ్రానీ? నాకేమో తల తిరుగుతోంది అంటుంటే.. సరే నేనే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను, దారిలో దేన్నో దాన్ని గుద్దుకుంటాను” అని బెదిరిస్తుంది. ఆ మాటతో పారిజాతం తీవ్రంగా కంగారు పడుతుంది. “దీనికి ఏదైనా అయితే.. వాళ్ళ అమ్మ సుమిత్ర గుండె పట్టుకుంటుంది, వాళ్ళ తాత శివన్నారాయణ నా పీక పట్టుకుంటాడు” అని భయపడిన పారిజాతం.. జ్యోత్స్నను ఆసుపత్రిలో చూపించి ఇంటి దగ్గర దించేయమని కార్తీక్‌ను బ్రతిమాలుతుంది. అప్పుడు దీప కలగజేసుకుని “నేను కూడా మీతో పాటే వస్తాను” అంటుంది. మేమేమైనా పార్క్ కు వెళ్తున్నామా రావడానికి అని జ్యోత్స్న వెటకారంగా అంటే.. “పార్క్ కు వెళ్తే మాత్రం నేను ఊరుకుంటానా? నా భర్త వెంట నేను వస్తాను” అని దీప అదిరిపోయే కౌంటర్ వేస్తుంది. కానీ పారిజాతం మాట కాదనలేక జ్యోత్స్నను మాత్రమే తీసుకెళ్లడానికి కార్తీక్ ఒప్పుకుంటాడు. ఇక నిన్ను దీపకి పూర్తిగా ఎలా దూరం చేయాలో నాకు తెలుసు అని జ్యోత్స్న మనసులో అనుకుంటూ కార్తీక్‌తో కలిసి కారులో వెళ్తుంది.

కొబ్బరి బోండం తలకేసి కొట్టు.. దీప సలహా

కార్తీక్, జ్యోత్స్న కారులో వెళ్తుండగా తలనొప్పి అని జ్యోత్స్న తెగ ఓవరాక్షన్ చేస్తూ నటిస్తుంది. ఏ ఆసుపత్రికి వెళ్దాం అని కార్తీక్ అడిగితే.. నాకు డీహైడ్రేషన్ లాగా ఉంది, కారు పక్కకు ఆపి కొబ్బరి బోండాలు ఇప్పించు అని ఆర్డర్ వేస్తుంది. కార్తీక్ విసుక్కుంటూనే కొబ్బరి బోండం ఇస్తాడు. “ఈ రోజు మా మొదటి పెళ్లి రోజు.. అమ్మానాన్నల ఆశీర్వాదం తీసుకోవాలని నా భార్య దీప అడిగితే తాతయ్య ఇంటికి వచ్చాము. ఇలాంటి రోజున నా భార్యతో గడపకుండా చేస్తున్నావు. ఇద్దరినీ విడదీయాలని గుడికి తీసుకెళ్లావు, అది వర్కౌట్ కాలేదని ఇప్పుడు రోడ్డు మీదకి తీసుకొచ్చావు” అని కార్తీక్ ఫైర్ అవుతాడు. దానికి జ్యోత్స్న.. “నన్ను పెళ్లి చేసుకుంటే మా ఇల్లు నీకు అత్తారిల్లే కదా.. నువ్వు నా డ్రైవర్‌వి. అగ్రిమెంట్ ప్రకారం నేను ఎక్కడికి తీసుకెళ్లమంటే అక్కడికి తీసుకెళ్లాలి” అని అవమానించేలా మాట్లాడుతుంది. ఇంతలో దీప ఫోన్ చేస్తుంది. “ఏ హాస్పిటల్‌కి వెళ్లారు? నాకు ఇంకా తల తిరగడం ఆగలేదని జ్యోత్స్న కొబ్బరి బోండం తాగుతోంది” అని కార్తీక్ దీపకు చెప్తాడు. దానికి దీపకు చిర్రెత్తుకొచ్చి.. “అదే కొబ్బరి బోండం పట్టుకుని దాని తలకేసి గట్టిగా కొట్టి.. దాన్ని అక్కడే వదిలేసి నువ్వు వచ్చేయ్ బావ” అని చెబుతుంది. ఈ మాటలు విన్న జ్యోత్స్న.. “నీ బావ రాడు.. నేను రానివ్వను” అని సవాల్ చేస్తుంది. ఇక కారు యూ టర్న్ తిప్పి మణికొండ వైపు వెళ్లమని జ్యోత్స్న కార్తీక్‌ను ఇబ్బంది పెడుతుంది.

ఇంట్లో శివన్నారాయణ, సుమిత్రల టెన్షన్

మరోవైపు ఇంట్లో జ్యోత్స్న ఇంకా రాలేదని శివన్నారాయణ కంగారు పడుతుంటాడు. పారిజాతానికి కాల్ చేసి అడిగితే.. జ్యోత్స్న గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అలిసిపోయిందని, తల తిరుగుతుంటే కార్తీక్‌ను తీసుకుని ఆసుపత్రికి వెళ్లిందని, దీపను ఇంటి దగ్గరే దించేశారని పారిజాతం అబద్ధం కవర్ చేస్తుంది. ఈ విషయం తెలిసిన సుమిత్ర తన కూతురికి ఏమైందోనని ఏడుస్తూ విపరీతంగా టెన్షన్ పడుతుంది. ఎండాకాలం కదా వడదెబ్బ తగిలి ఉంటుందిలే అని కవర్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ జ్యోత్స్న కావాలనే కార్తీక్‌ను తీసుకుని వెళ్లిందని, దీని వెనుక ఏదో ప్లాన్ ఉందని దశరథకు మాత్రం గట్టి అనుమానం వస్తుంది. ఇదంతా జ్యోత్స్న ఆడుతున్న నాటకం అని అతనికి అర్థమవుతుంది.

కార్తీక్ చేతిలో తాళి పెట్టిన జ్యోత్స్న.. మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్!

కార్తీక్‌ను నిర్మానుష్యమైన ప్రదేశంలోకి తీసుకువెళ్తుంది జ్యోత్స్న. “అసలు ప్రాబ్లమ్ ఉంటే కదా ఆసుపత్రిలో ఓపీ దొరికేది.. నేను కేవలం అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాను కాబట్టే నువ్వు చెప్పినట్లు వింటున్నాను. ఇక నేను నీ ఆటలు సాగనివ్వను, ఇప్పుడే నిన్ను వదిలేసి వెళ్లిపోతాను” అని కార్తీక్ సీరియస్ అవుతాడు. అయితే పారిజాతం ఫోన్ చేసి జ్యోత్స్నను వదిలేసి రమ్మని చెప్పినా.. జ్యోత్స్న మాత్రం కార్తీక్‌ను వదలదు. నేను యాక్సిడెంట్ చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఆ తర్వాత కార్తీక్‌తో జ్యోత్స్న మాట్లాడుతూ.. “మన మధ్య జరిగిన ఛాలెంజ్ గుర్తుందిగా.. దీపనే అసలైన వారసురాలు అని శివన్నారాయణ తాతయ్యకు చెప్పాలని, దీపను ఆ స్థానంలో చూడాలని నీకు భలే తొందరగా ఉంది కదా బావ” అని అంటుంది. అది తన లక్ష్యం అని కార్తీక్ తేల్చి చెబుతాడు. అప్పుడు జ్యోత్స్న కారులోంచి ఒక గిఫ్ట్ బాక్స్ తీసి.. “నీకోసం, మీ మ్యారేజ్ యానివర్సరీ కోసం నేను ఒక స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేశాను బావ. అదేంటో గెస్ చేయ్” అంటుంది. కార్తీక్ గెస్ చేయలేకపోవడంతో.. ఆ బాక్స్ ఓపెన్ చేసి కార్తీక్ చేతిలో ‘తాళిబొట్టు’ పెడుతుంది. “మీ పెళ్లి రోజుకు నేను ఇచ్చే అందమైన, అపురూపమైన కానుక ఇదే బావ.. ఈ తాళి నా మెడలో కట్టి నన్నే నీకు బహుమతిగా తీసుకో బావ” అని జ్యోత్స్న బాంబ్ పేల్చుతుంది. ఆ మాట వినగానే, చేతిలో తాళిబొట్టు చూడగానే కార్తీక్ మైండ్ బ్లాంక్ అయిపోయి తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతాడు. ఇరుక్కున్న కార్తీక్ ఇప్పుడు ఏం చేస్తాడు? దీపకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా లేక జ్యోత్స్న బెదిరింపులకు లొంగి తాళి కడతాడా? అసలు దీప ఎక్కడుంది? తదుపరి ఎపిసోడ్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏం జరుగుతుందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి