Karthika Deepam 2 March 20 Episode : పారిజాతానికి దాసు మైండ్ బ్లోయింగ్ షాక్.. ఆపరేషన్ థియేటర్లో దీపను చూసిన జ్యోత్స్న!

 Authored By jagadesh | The Telugu News | Updated on :20 March 2026,8:30 am

Karthika Deepam 2 March 20 Episode : స్టార్ మా Star Maa ఛానెల్‌లో ప్రసారమవుతున్న ‘కార్తీక దీపం 2’ Karthika Deepam 2 సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రోజుకో కొత్త మలుపుతో, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తోంది. ముఖ్యంగా సుమిత్ర ఆపరేషన్ చుట్టూ అల్లిన కథనం, కార్తీక్ వేస్తున్న మాస్టర్ ప్లాన్స్, పారిజాతం కుట్రలు సీరియల్ పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. నేటి (మార్చి 20) ఎపిసోడ్ లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీపను సురక్షితంగా ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లడానికి కార్తీక్ వేసిన స్కెచ్ వర్కౌట్ అవుతుంది. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

Karthika Deepam 2 March 20 Episode : పారిజాతానికి దాసు మైండ్ బ్లోయింగ్ షాక్.. ఆపరేషన్ థియేటర్లో దీపను చూసిన జ్యోత్స్న!

Karthika Deepam 2 March 20 Episode : పారిజాతానికి దాసు మైండ్ బ్లోయింగ్ షాక్.. ఆపరేషన్ థియేటర్లో దీపను చూసిన జ్యోత్స్న!

Karthika Deepam 2 March 20 Episode కార్తీక్ మాస్టర్ ప్లాన్.. పారిజాతానికి దాసు వల

హాస్పిటల్ లో ఆపరేషన్ థియేటర్ బయట పారిజాతం గారు కాపలా కాస్తుంటుంది. మరోవైపు శివన్నారాయణ గారు కూడా అక్కడే ఉంటారు. వీరందరి కళ్లుగప్పి, ఎవరికీ అనుమానం రాకుండా దీపను ఆపరేషన్‌ థియేటర్ కి ఎలా తీసుకెళ్లాలి అని డాక్టర్ హారిక తీవ్రమైన టెన్షన్ పడుతూ కార్తీక్ ను అడుగుతుంది. డాక్టర్ కంగారు చూసిన కార్తీక్ ఆమెకు ధైర్యం చెబుతాడు. “మీరేం కంగారుపడొద్దు డాక్టర్.. నేను మొత్తం ప్లాన్ చేశాను. మా పారు ఆపరేషన్ థియేటర్ బయట ఉండకూడదు, అంతే కదా?” అని కార్తీక్ అభయం ఇస్తాడు. సరిగ్గా అదే సమయానికి పారిజాతానికి దాస్ నుంచి ఫోన్ వస్తుంది. “నువ్వు ఎప్పటినుంచో వెతుకుతున్నావు కదా.. నువ్వు పోగొట్టుకున్న నీ అసలు మనవరాలు దొరికిందమ్మా” అని దాస్ చెప్పడంతో పారిజాతానికి మైండ్ బ్లాంక్ అవుతుంది. “నేను ఆసుపత్రి బయటే ఉన్నాను.. నువ్వు బయటకు వస్తే ఈ రహస్యం చెప్పాలని అనుకున్నాను. కానీ నువ్వు లోపల బిజీగా ఉన్నావు కదా” అని దాస్ ఉసిగొల్పుతాడు. దాస్ మాటలు విన్న పారిజాతంలో స్వార్థం నిద్రలేస్తుంది. ‘నా సొంత మనవరాలి కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. జ్యోత్స్న చెప్పిన మాటల్ని పక్కనపెట్టి వెంటనే బయటకు వెళ్లాలి. నా సొంత మనవరాలు దొరికిన తర్వాత నేను జ్యోత్స్న మాటలు ఎందుకు వినాలి?’ అని మనసులో అనుకుని గబగబా బయటకు బయలుదేరుతుంది పారిజాతం.

Karthika Deepam 2 March 20 Episode శౌర్య బొమ్మతో ఎమోషనల్ అయిన దీప

పారిజాతం అక్కడి నుంచి వెళ్లిపోవడంతో డాక్టర్ హారిక ఊపిరి పీల్చుకుని, ఆపరేషన్ కోసం దీపను లోపలికి తీసుకెళ్తుంది. ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్తున్న సమయంలో దీప తన కూతురు శౌర్య ఇచ్చిన బొమ్మను చూసుకుని ఎంతో ఎమోషనల్ అవుతుంది. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా.. “నేను వెళ్లబోతున్నాను.. నాకు వీడ్కోలు చెప్పండి” అని దీప భారంగా అంటుంది. దీప మాటలకు కార్తీక్ చలించిపోతాడు. “ఇది వీడ్కోలు కాదు దీప.. మీ అత్త ఇంటికి ఒక ఆహ్వానం” అని ధైర్యం చెప్పి లోపలికి పంపిస్తాడు కార్తీక్. మరోవైపు తన సొంత మనవరాలిని చూడబోతున్నాననే ఆనందంలో, కంగారులో పారిజాతం పరిగెత్తుకుంటూ వెళ్లి పొరపాటున శివన్నారాయణను ఢీకొడుతుంది. “ఏంటి పారు.. ఎందుకంత ఆనందం? ఎక్కడికి పరిగెడుతున్నావు?” అని శివన్నారాయణ అడగ్గా.. నోరు జారిన పారు “నా మనవరాలు దొరికింది” అని గట్టిగా చెప్పేస్తుంది. ఆ మాటలతో పెద్దాయన షాక్ అవుతాడు. వెంటనే తేరుకున్న పారిజాతం మాట మారుస్తుంది. “అది కాదండి.. జ్యోత్స్న ఆపరేషన్ చేసుకునేందుకు భయపడుతోంది కదా, మీ అమ్మ రుణం తీర్చుకునే అవకాశం దొరికిందని చెప్పాను. అదే నా మనవరాలికి అవకాశం దొరికింది కదా అని సంతోషంతో అలా అన్నాను” అని కవర్ చేస్తుంది. ఆమె మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన కుదరడం లేదని శివన్నారాయణ అనుమానిస్తాడు. “సరే, ఆపరేషన్ బాగా జరగాలని దేవుడికి దండం పెట్టుకుని వస్తాను” అని చెప్పి పారు అక్కడి నుంచి జారుకుంటుంది.

పారిజాతానికి మత్తుమందు ఇచ్చిన దాసు

హాస్పిటల్ బయట దాస్‌ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చిన పారిజాతం.. “నా మనవరాలిని దూరం చేసుకుని చాలా కాలం అయింది. జ్యోత్స్న ఎప్పుడైతే నా మనవరాలు కాదని తెలిసిందో, అప్పటి నుంచి చేసిన పాపానికి నేను పశ్చాత్తాపపడుతూనే ఉన్నాను. నా మనవరాలిని తీసుకురాకుండా నువ్వు ఒక్కడివే ఎందుకు వచ్చావు?” అని దాసును నిలదీస్తుంది. అప్పుడు దాసు తన నాటకాన్ని రక్తి కట్టిస్తాడు. “తనే నా కూతురని నాకు తెలిసింది. ఎందుకు నన్ను దూరం చేసుకున్నావని నన్ను నిలదీసింది. అప్పుడు చిన్నప్పుడు జరిగిన కథంతా దానికి చెప్పాను.. మీలాంటి దుర్మార్గుల దగ్గరికి, మోసకారుల దగ్గరికి నేను రాను అని ఖరాకండిగా చెప్పేసి వెళ్లిపోయింది” అని దాసు అబద్ధం చెబుతాడు. ఈ మాటలకు పారిజాతం తల్లడిల్లిపోతుంది. “ఇదంతా మా అమ్మ నా మంచి కోసం చేసిన పాపం అని చెప్పలేదా? నా మనవరాలి దగ్గరికి నన్ను తీసుకెళ్లు, నేను దాని కాళ్లు పట్టుకుని బతిమలాడుకుంటాను” అని పారు వేడుకుంటుంది. ప్లాన్ ప్రకారం దాసు అప్పటికే మత్తు మందు కలిపిన నీళ్ల బాటిల్ ను పారు చేతికి ఇస్తాడు. కంగారులో ఉన్న పారు ఆ నీళ్లు తాగేసి, కాసేపటికే స్పృహ తప్పి కింద పడిపోతుంది. “నువ్వు లేచేలోపు లోపల జరగాల్సింది అంతా జరిగిపోతుందిలే అమ్మా” అని దాసు మనసులో అనుకుంటాడు.

ఆపరేషన్ థియేటర్లో దీపను చూసిన జ్యోత్స్న

లోపల ఆపరేషన్ థియేటర్ లో డాక్టర్ ఇచ్చిన మత్తు ఇంజెక్షన్‌ పనిచేస్తుండటంతో జ్యోత్స్నకు నెమ్మదిగా నిద్ర ముంచుకొస్తుంది. మత్తులోకి వెళ్లే ముందు కూడా జ్యోత్స్న కుట్రల గురించే ఆలోచిస్తుంది. “ఈ డాక్టర్ ఏ ఇంజెక్షన్ ఇచ్చిందో ఏంటో, నాకు భయంకరంగా నిద్ర వచ్చేస్తుంది. అసలు బావకి శౌర్య దొరికిందా లేదా? ఈ దీప బయట ఏం చేస్తోంది? కాపలాగా నేను పెట్టిన గ్రానీ జాగ్రత్తగా ఉందో లేదో? నేను ఉండగా మీరు అనుకున్నది ఏదీ జరగనివ్వను” అని మనసులో అనుకుంటూనే కళ్లు మూస్తుంది జ్యోత్స్న. సరిగ్గా అదే సమయానికి దీపను ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకొస్తుంది డాక్టర్ హారిక. సగం మత్తులో ఉన్న జ్యోత్స్న.. తన పక్క బెడ్ పైకి దీపను తీసుకురావడం మసకమసకగా చూస్తుంది. దీపను చూసిన వెంటనే జ్యోత్స్న పూర్తిగా మత్తులోకి జారుకుంటుంది. “జ్యోత్స్న దీపను చూసేసింది, ఏమైనా ప్రాబ్లమా?” అని నర్సులు అడిగితే.. “పర్లేదు, జ్యోత్స్న నిన్ను చూసినా ఏం కాదు, మత్తులో ఉంది కాబట్టి గుర్తుపట్టలేదు” అని డాక్టర్ హారిక చెబుతుంది. ఆ తర్వాత డాక్టర్లు సుమిత్రకు, దీపకు విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేస్తారు. దీప దగ్గరి నుండి తీసుకున్న బోన్ మ్యారోను సుమిత్రకు ఎక్కిస్తారు.

కార్తీక్ మైండ్ బ్లాంక్ అయ్యే కౌంటర్లు.. కన్ఫ్యూజన్ లో పారు

ఆపరేషన్ థియేటర్ బయట గుడిలో దశరథ హోమం విజయవంతంగా పూర్తి చేస్తాడు. “మానవ ప్రయత్నం మేము చేశాం.. ఇక అంతా ఆ దేవుడి దయ” అని మొక్కుకుని హాస్పిటల్‌కు బయల్దేరతాడు. మరోవైపు ఆపరేషన్ పూర్తయి దీప బెడ్‌పై అపస్మారక స్థితిలో పడుకుని ఉండటం చూసి, ఆమె కడుపుపై చేయి వేసి కార్తీక్ చాలా ఎమోషనల్ అవుతాడు. తన కన్నీళ్లను అతికష్టం మీద కంట్రోల్ చేసుకుని బయటకు వస్తాడు. మరో గదిలో మత్తు వదలడంతో ఉలిక్కిపడి లేస్తుంది జ్యోత్స్న. ఆపరేషన్ థియేటర్‌లోకి దీప వచ్చిన విషయాన్ని గుర్తుచేసుకుని కంగారు పడుతుంది. ఇంతలో డాక్టర్ అక్కడికి రాగానే.. “నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చాను? మా మమ్మీ ఎక్కడ ఉంది? దీప ఎక్కడ? నేను దీపను ఆపరేషన్ థియేటర్‌లో చూసినట్లే అనిపించింది” అని జ్యోత్స్న అడుగుతుంది. ఆ మాటలతో డాక్టర్ హారిక ఒక్కక్షణం షాక్ అవుతుంది. కానీ వెంటనే తేరుకుని “ఏం మాట్లాడుతున్నావ్? దీపకి కూడా ఈరోజే ఒక చిన్న ఆపరేషన్ జరిగింది.. కానీ ఆ డాక్టర్ వేరే, ఆ ఆపరేషన్ థియేటర్ వేరే” అని హారిక అబద్ధం చెబుతుంది. జ్యోత్స్న లేచి వెళ్లబోతుండగా.. “మీకు ఇప్పుడే కదా ఆపరేషన్ జరిగింది. మీ నుంచి బోన్‌మ్యారో తీయడం జరిగింది, మీరు రెస్ట్ తీసుకోవాలి” అని డాక్టర్ ఆపుతుంది.

ఇటు పారిజాతానికి నెమ్మదిగా మత్తు వదులుతుంది. కళ్లు తెరిచి చూసే సరికి ఆమె ముందు శివన్నారాయణ, కార్తీక్, దాస్ ఉంటారు. “నువ్వు కళ్లు తిరిగి పడిపోతే ఈ బెడ్ మీద తీసుకొచ్చి వేశాము” అని చెబుతాడు శివన్నారాయణ. “దాసు నాకు ఫోన్ చేశాడు. నా మనవరాలు దొరికిందని చెప్పాడు. నేను పరిగెత్తుకుని వెళ్లాను. దాసు నాకు తాగడానికి నీళ్లు ఇచ్చాడు” అని పారు జరిగిందంతా చెబుతుంది. అప్పుడు దాసు రివర్స్ అవుతాడు. “నేను నీకు ఫోన్ చేయడం ఏంటి? నీకు వాటర్ ఇవ్వడం ఏంటి? నేను ఇక్కడే ఉన్నాను కదా” అని ట్విస్ట్ ఇస్తాడు. దాంతో పారుకు మైండ్ బ్లాంక్ అవుతుంది. “నీకు ఏమైనా మతి భ్రమించిందా పారు?” అని పెద్దాయన అంటాడు.

సుమిత్రకు ఆపరేషన్ అయిపోయిందా అని పారు అడగ్గా.. ఎప్పుడో సక్సెస్ ఫుల్ గా అయిపోయిందని చెబుతాడు కార్తీక్. కంగారుగా పారు దీప దగ్గరకు వెళుతుంది. దీప నెమ్మదిగా కళ్లు తెరుస్తుంది. “నువ్వు ఇక్కడే ఉన్నావా?” అని పారు అడిగితే.. “నీ కళ్లు కాకులు ఎత్తుకెళ్లాయా పారు? దీప ఇక్కడే ఉంది కదా. లేకపోతే నీకు లేజర్ షోలో ఎవరైనా చూపిస్తున్నారా? దీపకు ఆపరేషన్ అయింది కదా. ఇది కలో నిజమో తేల్చుకో” అని కార్తీక్ కౌంటర్లు వేస్తాడు. నన్ను గిల్లమని పారు అడిగితే, కార్తీక్ గట్టిగా గిల్లుతాడు. “చేసిన పాపాలు, దారుణాలు ఎక్కడ బయటపడతాయోనని కొందరు గజగజ వణికిపోతున్నారు. అలాంటి వాళ్లకు నేను చెప్పేది ఒకటే.. వీలైనంత త్వరగా పెట్టే బేడా సర్దేయండి.. లేదంటే నేనే దగ్గరుండి లగేజీ ఎక్కిస్తాను” అని కార్తీక్ పరోక్షంగా వార్నింగ్ ఇస్తాడు. ఆ దెబ్బతో భయపడిన పారు అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతుంది. ఈ ఆసక్తికరమైన సన్నివేశాలతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.

తరువాయి భాగంలో దీప తన ప్రాణాలను పణంగా పెట్టి సుమిత్రను కాపాడిన విషయం ఎవరికైనా తెలుస్తుందా? జ్యోత్స్న అనుమానం ఎంతవరకు వెళ్తుంది? పారిజాతం తన మనవరాలి కోసం చేసే తదుపరి కుట్రలు ఏంటి? ఇవన్నీ తెలియాలంటే రాబోయే ఎపిసోడ్స్ చూడాల్సిందే!

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి