Mukku Avinash : బాలయ్యని దారుణంగా అవమానించిన ముక్కు అవినాష్.. ఇది చూసాడా దబిడిదిబిడే..!
ప్రధానాంశాలు:
Mukku Avinash : బాలయ్యని దారుణంగా అవమానించిన ముక్కు అవినాష్.. ఇది చూసాడా దబిడిదిబిడే..!
Mukku Avinash : జబర్ధస్త్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న అవినాష్ బిగ్ బాస్ షో తర్వాత తన క్రేజ్ మరింత పెంచుకున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం స్టార్ మా ఛానల్‌లో షో ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ బాధ్యతను మాత్రం ముక్కు అవినాష్ చూసుకుంటున్నాడు. శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ నుంచి ‘నీతోనే డ్యాన్స్ 2.0’ వరకూ హడావిడి అంతా అవినాష్‌దే. ఇక ఫెస్టివల్ ఈవెంట్స్‌లో కూడా అవినాష్ సందడి మాములుగా లేదు. ఒకప్పుడు ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్స్‌లో బిజీగా ఉన్న అవినాష్.. ఆ ఛానల్‌ను వదిలేసి మా టీవీలో సందడి చేస్తున్నాడు.
Mukku Avinash అలా అన్నాడేంటి ?
ఈ క్రమంలో ‘నీతోనే డాన్స్ 2.0’ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో నందమూరి బాలయ్యని ఇమినేట్ చేస్తూ.. చౌకబారు కామెడీ చేశాడు అవినాష్. బాలయ్య మాదిరిగా వీరసింహారెడ్డి గెటప్‌లో వచ్చిన అవినాష్.. నోటికొచ్చింది పేలుతూ బాలయ్య ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే విధంగా ప్రవర్తించాడు. మొదటిగా షోలో జడ్జీగా ఉన్న రాధతో.. ‘‘ఏం రాధా ఎలా ఉన్నావ్.. నీకేంటి ఎప్పటికీ బాగానే ఉంటావ్‌లే.. ఎవడింగిగిడిడిగిడగీ.. అంటూ నోటికొచ్చింది పేలుతూ బాలయ్యని ఇమిటేట్ చేశాడు అవినాష్. మలయాళంలో రాధని కమ్ బ్యాక్ ఇప్పుడిస్తున్నావ్ అని అంటున్నారు. సదా గురించి అయితే డబుల్ మీనింగ్‌లో మాట్లాడాడు అవినాష్. బాలయ్యని ఇమిటేట్ చేస్తూ.. ‘సదా నాకు బాగా తెలుసు ఇద్దరం కలిసి.. వర్కౌట్స్ చేశాం’ అని అన్నాడు.

Mukku Avinash : బాలయ్యని దారుణంగా అవమానించిన ముక్కు అవినాష్.. ఇది చూసాడా దబిడిదిబిడే..!
ఇక సదాకి తెలుగు అర్ధం కాక ఏదో జోక్ వేశాడులే అని నవ్వుతూ ఉండిపోయింది. ఆ తరువాత స్టేజ్ మీదికి వచ్చిన సదా.. ‘నందమూరి నాయకా’ అంటూ అవినాష్‌తో బాలయ్య స్టెప్‌లు వేసింది. ఆ టైంలో అవినాష్.. వేసిన కుప్పిగొంతులు అయితే పరమ చిరాకు తెప్పిస్తాయి. సదాని ఎత్తుకోవడంతో.. ‘బాలయ్య బాబు గారూ మీరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారండీ’ అని పంచ్ వేసింది భాను శ్రీ. ‘నేను ఏం చేసినా బాలయ్య బాబు చేసినట్టే’ అని కవర్ చేసుకుని అంతా బాలయ్య బాబుపై నెట్టేశాడు అవినాష్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.