Viral video : జింకను ఆటపట్టించిన కోతి.. వీడియో వైరల్..

Authored By mallesh | The Telugu News | Published on: January 25, 2022, 5:30 pm

Viral video : సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో పనికి రానివి ఎక్కువగా ఉన్నా.. కొన్ని మాత్రం చాలా యూజ్ ఫుల్‌గా ఉంటాయి. కానీ మరికొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి. ఇందులో జంతువులకు సంబంధించిన వీడియోలైతే మరింతగా నవ్వు తెప్పిస్తుంటాయి. కొన్ని జంతువులు కావాలని అలా చేస్తాయో లేక యాదృచ్ఛికంగా చేస్తాయో తెలియదు కానీ చాలా ఫన్నీగా బిహేవ్ చేస్తాయి.

ఇలాంటి వాటిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అవి చూసిన వారు వాటిని వైరల్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది నెటిజన్స్‌ను తెగ అట్రాక్ట్ చేస్తోంది.ఒక జింక చాలా కష్టం మీద నడుస్తోంది. అలాంటి టైంలో దానిపై ఓ కోతి ఎక్కింది. బహుశా దానికి బద్ధకం అనుకుంటా.. ఆ జింకపైనే ఎక్కి ప్రయాణిస్తోంది.

a monkey teasing a deer in Viral Video

a monkey teasing a deer in Viral Video

Viral video : జింకపై కోతి

ఇంతలో బరువును తట్టుకోలేక ఆ జింక మధ్యలో ఆగి వెనక్కి తిరిగి చూసింది. అదే టైంలో ఆ కోతి దిగి పక్కకు వెళ్లిపోయింది. సరేలే అని ఆ జింక మళ్లీ నడవడం మొదలుపెట్టగా అక్కడున్న కోతి మళ్లీ ఆ జింకపైకి ఎక్కి దానితోనే ట్రావెల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేయకుండా ఉండలేకపోతున్నారు. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కెయ్యండి మరి.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp