Lady Officer : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన లేడీ ఆఫీసర్.. దండం పెడతా.. నన్ను వదిలేయండి అంటూ వేడుకోలు

Advertisement

Lady Officer : ఓ లేడీ ఆఫీసర్ లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయింది. ఏసీబీ అధికారుకు ఆమె రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో మీడియాకు కనీసం తన ముఖం కూడా చూపించలేకపోయింది. నన్ను వదిలేయండి.. దండం పెడతా అంటూ అధికారులకు వేడుకుంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా రాయికల్ లో చోటు చేసుకుంది. రాయికల్ ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయంలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్ గా ఓ యువతి పని చేస్తోంది. ఈమె కింద పని చేసే మరో వ్యక్తి టెక్నికల్ అసిస్టెంట్ ఇద్దరూ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

Advertisement

రాయకల్ మండలం రామాజిపేట గ్రామానికి చెందిన శంకరయ్య అనే రైతు తన పొలంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరు అయిన కంపోస్టర్ షెడ్ మంజూరు అయింది. దానికి సంబంధించిన బిల్లు ఇంకా రావాల్సి ఉంది. ఆ బిల్లు విషయమై వాళ్లను రైతు అడగగా.. రూ.5 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో వెంటనే ఏసీబీ అధికారులను ఆ రైతు ఆశ్రయించారు.శంకరయ్య వాళ్లకు లంచం ఇస్తుండగా ఆ లేడీ ఆఫీసర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అధికారులు పట్టుకున్నాక నన్ను వదిలేయండి..

Advertisement
lady officer cught red handed while taking bribe
lady officer cught red handed while taking bribe

Lady Officer : లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు

అంటూ ఆ లేడీ ఆఫీసర్ అధికారులను వేడుకుంది. చివరకు మీడియాకు తన ముఖం కూడా చూపించలేదు. అధికారులు ముఖం చూపించాలని చెప్పినా కూడా అస్సలు ఆమె ముఖం చూపించలేదు. తన ముఖాన్ని దాచుకుంది. నన్ను వదిలేయండి ప్లీజ్ అంటూ ఆమె అధికారులను వేడుకోవడానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement
Advertisement