andhra police performs cpr to man video viral
Viral Video : పోలీసుల గురించి సామాన్య ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసులంటేనే కొందరైతే చిరాకు పడతారు. వాళ్లను లెక్క కూడా చేయరు. కానీ.. పోలీసులు లేకపోతే మనం లేము. మనం హాయిగా రాత్రి ఇంట్లో నిద్రపోతున్నామంటే, రోడ్డు మీద స్వేచ్ఛగా తిరగగలుగుతున్నామంటే దానికి కారణం పోలీసన్నలే. వాళ్లే లేకపోతే దొంగలు, దుండగులు రెచ్చిపోతారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు ప్రవర్తిస్తారు. దోపిడీలు, హత్యలు పెరిగిపోతాయి. అందుకే పోలీసులు ఉన్నారన్న నమ్మకంతో మనం బతుకుతున్నాం.
కానీ.. కొందరు పోలీసులను అస్సలు పట్టించుకోరు. పోలీసులు అవినీతి పరులని అంటారు. పోలీసుల్లో మంచి వాళ్లు ఉన్నారు.. చెడ్డ వాళ్లు ఉన్నారు. ఉన్న ఒకరిద్దరు చెడ్డ వాళ్లను చూసి.. మిగితా పోలీస్ శాఖ అంతా చెడ్డది అని అనుకోవడం తప్పు. పోలీసుల్లో నిజాయితీ పరులే ఎక్కువగా ఉన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే తాము ఉన్నామని, అలా ప్రజలకు తమ ప్రాణాలు తెగించి మరీ సేవ చేసేవాళ్లు కూడా బోలెడు మంది ఉన్నారు. అలాంటి వీడియోనే ఇది. ప్రస్తుతం ఏపీలో అమరావతి రైతులు మహా పాదయాత్రను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
andhra police performs cpr to man video viral
ప్రస్తుతం వీళ్ల పాదయాత్ర ఉత్తరాంధ్రకు చేరుకుంది. అక్కడ పాదయాత్రలో నడుస్తున్న ఓ రైతుకు సడెన్ గా హార్ట్ ఎటాక్ రావడంతో రోడ్డు మీదే కుప్పకూలిపోయాడు. రైతు పరిస్థితిని గమనించిన ఓ పోలీస్ వెంటనే అతడికి సీపీఆర్ చేయడం ప్రారంభించాడు. సకాలంలో స్పందించి సీపీఆర్ చేయడంతో ఆ రైతు ప్రాణాలు కాపాడగలిగాడు. ఏమాత్రం ఆలస్యం అయినా ఆ రైతు ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. వెంటనే స్పందించి ఆ రైతు ప్రాణాలు కాపాడిన పోలీసులు పాదయాత్రలో పాల్గొనే రైతులు, స్థానికులు మెచ్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
This website uses cookies.