Viral Video : పాదయాత్రలో హార్ట్ ఎటాక్ వచ్చి పడిపోయిన రైతును ఈ పోలీస్ ఎలా కాపాడాడో చూస్తే సెల్యూట్ చేస్తారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : పాదయాత్రలో హార్ట్ ఎటాక్ వచ్చి పడిపోయిన రైతును ఈ పోలీస్ ఎలా కాపాడాడో చూస్తే సెల్యూట్ చేస్తారు

 Authored By jagadesh | The Telugu News | Updated on :18 October 2022,2:00 pm

Viral Video : పోలీసుల గురించి సామాన్య ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసులంటేనే కొందరైతే చిరాకు పడతారు. వాళ్లను లెక్క కూడా చేయరు. కానీ.. పోలీసులు లేకపోతే  మనం లేము. మనం హాయిగా రాత్రి ఇంట్లో నిద్రపోతున్నామంటే, రోడ్డు మీద స్వేచ్ఛగా తిరగగలుగుతున్నామంటే దానికి కారణం పోలీసన్నలే. వాళ్లే లేకపోతే దొంగలు, దుండగులు రెచ్చిపోతారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు ప్రవర్తిస్తారు. దోపిడీలు, హత్యలు పెరిగిపోతాయి. అందుకే పోలీసులు ఉన్నారన్న నమ్మకంతో మనం బతుకుతున్నాం.

కానీ.. కొందరు పోలీసులను అస్సలు పట్టించుకోరు. పోలీసులు అవినీతి పరులని అంటారు. పోలీసుల్లో మంచి వాళ్లు ఉన్నారు.. చెడ్డ వాళ్లు ఉన్నారు. ఉన్న ఒకరిద్దరు చెడ్డ వాళ్లను చూసి.. మిగితా పోలీస్ శాఖ అంతా చెడ్డది అని అనుకోవడం తప్పు. పోలీసుల్లో నిజాయితీ పరులే ఎక్కువగా ఉన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే తాము ఉన్నామని, అలా ప్రజలకు తమ ప్రాణాలు తెగించి మరీ సేవ చేసేవాళ్లు కూడా బోలెడు మంది ఉన్నారు. అలాంటి వీడియోనే ఇది. ప్రస్తుతం ఏపీలో అమరావతి రైతులు మహా పాదయాత్రను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

andhra police performs cpr to man video viral

andhra police performs cpr to man video viral

Viral Video : చావుబతుకుల మధ్య ఉన్న రైతుకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీస్

ప్రస్తుతం వీళ్ల పాదయాత్ర ఉత్తరాంధ్రకు చేరుకుంది. అక్కడ పాదయాత్రలో నడుస్తున్న ఓ రైతుకు సడెన్ గా హార్ట్ ఎటాక్ రావడంతో రోడ్డు మీదే కుప్పకూలిపోయాడు. రైతు పరిస్థితిని గమనించిన ఓ పోలీస్ వెంటనే అతడికి సీపీఆర్ చేయడం ప్రారంభించాడు. సకాలంలో స్పందించి సీపీఆర్ చేయడంతో ఆ రైతు ప్రాణాలు కాపాడగలిగాడు. ఏమాత్రం ఆలస్యం అయినా ఆ రైతు ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. వెంటనే స్పందించి ఆ రైతు ప్రాణాలు కాపాడిన పోలీసులు పాదయాత్రలో పాల్గొనే రైతులు, స్థానికులు మెచ్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://twitter.com/KP_Aashish/status/1582252893251710976

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది