Home » Exclusive » Bird Dancing In A Happy Mood Viral Video
Exclusive

Viral Video : హ్యాపీ మూడ్‌లో పక్షి డ్యాన్స్.. అదిరిపోయే స్టెప్పులు వేసింది..

Authored By
mallesh
The Telugu News | Published on: March 26, 2022, 7:00 am
Advertisement

Viral Video : సోషల్ మీడియాలో వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. వీడియో బాగుంటే అప్ లోడ్ చేసిన క్షణాల్లోనే బాగా షేర్ అవుతుంది. ఇదిలా ఉండగా.. పక్షులు అంటే చాలా మందికి ఇష్టం.. ఇక పల్లెటూర్లలో ఉదయం, సాయంత్రం టైంలో చెట్లపై నుంచి అవి అనేక శబ్దాలు చేస్తుంటాయి. పిచ్చుకలు మాత్రం ఇళ్లలోకి చేరి కిచ్..కిచ్.. అంటూ అరస్తుంటాయి. ఇలాంటి సమయంలో మనం వాటిని గమనిస్తే అవి చాలా విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఉంటాయి.

Advertisement

వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అక్కడి నుంచి ఎగిరిపోతూ ఉంటాయి. మరి వాటికి ఆనందమొస్తే ఏం చేస్తాయి. ఎలా రియాక్ట్ అవుతాయి.ప్రస్తుతం ఓ పక్షికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి ఏం సంతోషం వచ్చిందో తెలియదు కానీ.. రోడ్డుపైనే అదిరిపోయే స్టెప్పులు వేసింది. దీనిని చూసిన నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను ఎవరు తీశారో తెలియదు గానీ..

Bird dancing in a happy mood Viral Video

Advertisement

Viral Video : శ్రీవల్లి పాటకు డ్యాన్స్

దాని వెనకు ఓ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ యాడ్ చేశారు. ఆ పాట ఏంటో తెలుసా.. టాలీవుడ్‌లో ఇటీవలే రికార్డు సృష్టించి పాన్ ఇండియాగా నిలిచిన మూవీ పుష్ప. ఇందులో ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇందులోని శ్రీవల్లి సాంగ్‌ను ఆ పక్షి డ్యాన్స్‌కు యాడ్ చేశారు. ఆ పక్షి స్టెప్పులకు, ఆ పాటకు సూపర్‌గా సింక్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి