Viral Video : ఎంత ప‌నిచేశావురా బుడ్డోడా.. లిఫ్ట్‌లో మూత్రం పోసి పిల్లాడు.. చివ‌రికి ఏం జ‌రిగిందంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : ఎంత ప‌నిచేశావురా బుడ్డోడా.. లిఫ్ట్‌లో మూత్రం పోసి పిల్లాడు.. చివ‌రికి ఏం జ‌రిగిందంటే..?

Viral Video : సోషల్ మీడియాలో తరచూ రకరకాల వీడియోలు వైరల్ అవుతుండటం మనం చూడొచ్చు. కాగా, ప్రజెంట్ వైరలవుతున్న ఈ వీడియో మాత్రం జనాలకు అవేర్ నెస్ కలిగించే వీడియోనని చెప్పొచ్చు. ఈ వీడియో చూసి ప్రజలు తమ పిల్లల పెంపకం పైన దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇంతకీ సదరు వీడియోలో పిల్లాడు ఏం చేశాడంటే..గుల్దుర్ బకాలిమ్ అనే ట్విట్టర్ యూజర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన వీడియోలో పిల్లాడు లిఫ్ట్ లోనే మూత్రం పోస్తున్నాడు. […]

 Authored By mallesh | The Telugu News | Updated on :23 January 2022,4:00 am

Viral Video : సోషల్ మీడియాలో తరచూ రకరకాల వీడియోలు వైరల్ అవుతుండటం మనం చూడొచ్చు. కాగా, ప్రజెంట్ వైరలవుతున్న ఈ వీడియో మాత్రం జనాలకు అవేర్ నెస్ కలిగించే వీడియోనని చెప్పొచ్చు. ఈ వీడియో చూసి ప్రజలు తమ పిల్లల పెంపకం పైన దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇంతకీ సదరు వీడియోలో పిల్లాడు ఏం చేశాడంటే..గుల్దుర్ బకాలిమ్ అనే ట్విట్టర్ యూజర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన వీడియోలో పిల్లాడు లిఫ్ట్ లోనే మూత్రం పోస్తున్నాడు.

ఈ వీడియో షేర్ చేసే క్రమంలో గుల్దుర్ బకాలిమ్ పెట్టిన క్యాప్షన్ కూడా ఆసక్తికరంగానే కాదు ఆలోచనలు రేకెత్తించేలా ఉంది. ‘పిల్లలకు విలువలు నేర్పకపోతే వారు ఇటువంటి భయంకరమైన పనులు చేయొచ్చు. కాబట్టి జాగ్రత్త వహించండి’ అనేక్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేశారు.వైరల్ వీడియోలో పిల్లాడు లిఫ్ట్‌లోనే మూత్రం పోస్తుండటం మనం గమనించొచ్చు.

Boy video viral in internet

Boy video viral in internet

Viral Video : విలువలు నేర్పకపోతే జరిగేది ఇదే..

అలా లిఫ్ట్ మూవింగ్‌లో ఉండగానే బటన్స్ పైన మూత్రం పోశాడు బాలుడు. దాంతో లిఫ్ట్‌లో పొగలు వచ్చి భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పిల్లాడు మూత్ర పోసిన తర్వాత లిఫ్ట్ బటన్‌ను నొక్కడ గమనార్హం. ఇకపోతే ఆ పిల్లాడు చేసిన పని తర్వాతనే లిఫ్ట్‌లో మొత్తం చీకట్లు కమ్ముకున్నాయి. ఈ వీడియో చూసి నెటిజన్లు కొందరు..పిల్లలకు విలువలు నేర్పాల్సింది.. గురువులతో పాటు తల్లిదండ్రులేనని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

https://twitter.com/guldurbakalim/status/1484631282332094464

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది