Viral Video : పెళ్లి కూతురు మాస్ డ్యాన్స్.. చూస్తే షాక్ అవుతారు
Viral Video : పెళ్లిలో వధూవరులు డ్యాన్స్ చేయడం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. పెళ్లంటే సిగ్గు పడే ఆడపిల్లలు తీన్మార్ డ్యాన్స్ తో ఇరగదీస్తున్నారు. ఈ ట్రెండింగ్ ఎప్పుడు ఎక్కడ ఎవరు మొదలుపెట్టారో గానీ ఇప్పట్లో ఆగేలా లేదు. నిత్యం ఎక్కడో ఒక్క చోట డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది పెళ్లి కూతుర్లు మండపానికి వస్తూనే డ్యాన్స్ తో ఆకట్టుకుంటూ మండపాలకు చేరుకుంటున్నారు. మరికొంత మంది మండపాల్లో పెళ్లికొడుకు ముందే తమ డ్యాన్స్ తో ఇంప్రెస్ చేస్తున్నారు. పెళ్లి అంటేనే డ్యాన్స్ అనేలా మారింది ప్రస్తుత పరిస్థితి.
ఫ్రెండ్స్ ఫ్యామిలీ, బంధువులు ఇలా అందరూ మండపాల్లో స్టేజ్ లపై డ్యాన్స్ చేసి వైరల్ అవుతున్నారు. ఒక్కోసారి అబ్బాయిలు సిగ్గుపడుతున్నారు తప్పా.. అమ్మాయిలు అస్సలు తగ్గట్లేదు.ఎక్కడ చూసినా పెళ్లి కూతురే డాన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మాస్ స్టెప్పులతో మతిపోగొడుతున్నారు. ప్రీవెడ్డింగ్.. సంగీత్.. మంగళస్నానాల పేరుతో తెగ డ్యాన్సులు చేస్తున్నారు. ఒకప్పుడు అబ్బాయిలు పెళ్లిలో ఎక్కువగా డ్యాన్స్ చేసేవారు. కానీ ఇప్పడు సీన్ రివర్స్.. అమ్మాలు మాకేంతక్కువ అంటూ డ్యాన్స్ లు ఇరగదీస్తున్నారు. ఈ మధ్య వివాహ వేడుకల్లో డాన్స్ అనేది కామన్ అయిపోయింది.
డ్యాన్స్ చేయడానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. మాస్ డ్యాన్స్ తో అదరగొడుతున్నారు. బంధువులు.. ప్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ తతంగమంతా ఎవరో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం ఓ డ్యాన్స్ వీడియో తెగ వైరల్ అవుతోంది. పెళ్లికూతురు మాస్ స్టెప్పులతో ఆకట్టుకుంది. ఫోక్ సాంగ్స్ కు డ్యాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేసింది. ఎనర్జిటిక్ గా చిందుస్తూ తగ్గేదేలా అన్నట్లు ఇరగదీసింది. మీరు కూడా ఓ లుక్కేయండి…