Viral Video : బ‌రాత్ లో నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్త‌పా అంటున్న పెళ్లి కూతురు.. ఫిదా అయిన వ‌రుడు..

 Authored By mallesh | The Telugu News | Updated on :10 June 2022,2:00 pm

Viral Video: పెళ్లి కూతురు డ్యాన్స్ అన‌గానే అందరికీ గుర్తుకు వ‌చ్చే సాంగ్ నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్త‌పా.. ఎంతో మంది పెళ్లి కూతుర్లు పెళ్లికొడుకుపై ఇలా త‌మ ఇష్టాన్ని తెలియ‌జేస్తుంటారు. ఎంగేజ్ మెంట్.. పెళ్లి, రిసెప్ష‌న్.. బ‌రాత్ ఇలా ఎక్క‌డైనా ఈ సాంగ్ పై పెళ్లికూత‌రు డ్యాన్స్ చేయాల్సిందే.. ఇలా నెట్టింట్లో కొన్ని వేల‌ల్లో వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. అమ్మాయిల‌కు డ్యాన్స్ చేయాల‌నిపించినా ఇదే సాంగ్.. డ్యాన్స్ రాక‌పోతే సింపుల్ గా స్పెప్పులు వేయాల‌న్నా ఇదే సాంగ్ ని ఎంచుకుంటారు చాలా మంది. ఇక పెళ్లంటేనే వ‌ధూవ‌రుల డ్యాన్స్ , ఫ్రెండ్స్, బంధువులు సంద‌డీతో ఫుల్ జోష్లో ఉంటుంది.

ఇక తెలంగాణ‌లో పెళ్లిరోజు నైట బ‌రాత్ కార్య‌క్ర‌మం స్పెష‌ల్ గా ఉంటుంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కారులో కూర్చుని ఉండ‌గా డీజే సెట‌ప్ తో ఫ్రెండ్స్, బంధువులు డ్యాన్స్ చేస్తూ సంద‌డి చేస్తుంటారు. ఇక ఇక్క‌డే కొత్త‌జంట‌తో స్టెప్ప‌లు కూడా వేయిస్తుంటారు. ట్రెండింగ్ డీజే సాంగ్స్ తో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటారు. పెళ్లి కూతురు క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో పెళ్లికొడుకుని ఇంప్రెస్ చేసే ప‌నిలో ఉంటుంది.

 Bride Dance in Bullet Bandi song video viral

Bride Dance in Bullet Bandi song video viral

ప్ర‌స్తుతం బ‌రాత్ లో వ‌ధూవ‌రులు డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. పెళ్లి కూతురు క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్త‌పా.. అంటుంటే అందుకు సిద్ద‌మే అన్న‌ట్లు పెళ్లి కొడుకు డ్యాన్స్ చేస్తున్నాడు. చుట్టూ బంధువులు, ఫ్రెండ్స్ ఎంక‌రేజ్ చేస్తూ వీడియోలు, ఫొటోలు తీస్తున్నారు. ఇక పెళ్లి కూతురు ఫుల్ ఎన‌ర్జీతో అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఆక‌ట్టుకుంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి