Viral Video : వివాహాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా జరుగుతుంటాయి. అక్కడి కల్చర్, సంప్రదాయాల ఆధారంగా వివాహాలు జరగడం అన్నది ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం. ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఇరు కుటుంబాలు తమ ఆచారాలకు అనుకూలంగానే తమ పిల్లలకు వివాహాలు జరిపిస్తూ వస్తున్నారు. అయితే, ఆ రాష్ట్రంలో ఇప్పుడు సంప్రదాయాలు అన్ని మారిపోయాయి. సగం సంప్రదాయ పద్ధతి, మిగతా సగం వెస్టర్న్ కల్చర్ ఆధారంగా జరుగుతున్నట్టు అక్కడి పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి. పెళ్లిలో ఎప్పుడైనా మగవారిదే డామినేషన్ ఉంటుంది. కానీ కేరళ రాష్ట్రంలో మాత్రం ఈ మధ్యకాలంలో అమ్మాయి తరఫు వారిదే డామినేషన్ కనిపిసస్తోంది.
మిగతా రాష్ట్రాల్లో అబ్బాయి తరఫు వాళ్లు ఎక్కువగా మర్యాదలు పొందుతుంటారు. కేరళలో జరిగే వివాహాల్లో ప్రస్తుతం పెళ్లి కూతురు మండపంలోకి వచ్చే సందర్భంలో కుటుంబీకులు తీసుకొచ్చే సంప్రదాయం ఉన్నా.. డోలి, బుట్టలో కూర్చుని తీసుకొచ్చే సంప్రదాయం మారింది. అమ్మాయి మరో నలుగురు అమ్మాయిలు లేదా చిన్నపిల్లలతో కలిసి మాస్ డ్యాన్సులు వేసుకుంటూ మండలంలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ దృశ్యాలు ఇటీవల కాలంలో చాలా చోటుచేసుకుంటున్నాయి. అమ్మాయి పెళ్లి హాలులో నుంచి స్టెప్పులు వేసుకుంటూ మండలంలోకి వస్తుంటుంది. అబ్బాయి మాత్రం మండపంలో కూర్చుని అమ్మాయిని చూస్తూ ఉంటాడు.
దీనికి సంబంధించిన విజువల్స్ యూట్యూబ్‌లో ఎక్కువగా పాపులర్ అవుతున్నాయి. తాజాగా ఓ పెళ్లిలో కూడా ఇలానే జరిగింది. పెళ్లి కూతురు మరో నలుగురు అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేస్తూ మండపానికి చేరుకుంటుంది. అబ్బాయి మాత్రం ముందే వచ్చి అమ్మాయి రాకకోసం ఎదురుచూస్తుంటాడు. అమ్మాయి వెనుక గొడుగు లాగా ఉండే ఒక వస్త్రాన్నికుటుంబ సభ్యులు పట్టుకుని వస్తుండే దృశ్యాలను మనం వీక్షించవచ్చును.మొత్తంగా అక్కడి పెళ్లిళ్లలో అబ్బాయిలు సైలెంట్ గా కూర్చుంటే అమ్మాయిలు మాత్రం నానా రచ్చ చేసుకుంటూ మండపానికి చేరుకోవడం వింతగా ఉంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.