Viral Video : ఊర మాస్ డాన్స్ వేసుకుంటూ మండలంలోకి ఎంట్రీ పెళ్లి కూతురు.. వీడియో.. ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : ఊర మాస్ డాన్స్ వేసుకుంటూ మండలంలోకి ఎంట్రీ పెళ్లి కూతురు.. వీడియో.. !

 Authored By prabhas | The Telugu News | Updated on :25 August 2022,6:00 pm

Viral Video : వివాహాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా జరుగుతుంటాయి. అక్కడి కల్చర్, సంప్రదాయాల ఆధారంగా వివాహాలు జరగడం అన్నది ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం. ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఇరు కుటుంబాలు తమ ఆచారాలకు అనుకూలంగానే తమ పిల్లలకు వివాహాలు జరిపిస్తూ వస్తున్నారు. అయితే, ఆ రాష్ట్రంలో ఇప్పుడు సంప్రదాయాలు అన్ని మారిపోయాయి. సగం సంప్రదాయ పద్ధతి, మిగతా సగం వెస్టర్న్ కల్చర్ ఆధారంగా జరుగుతున్నట్టు అక్కడి పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి. పెళ్లిలో ఎప్పుడైనా మగవారిదే డామినేషన్ ఉంటుంది. కానీ కేరళ రాష్ట్రంలో మాత్రం ఈ మధ్యకాలంలో అమ్మాయి తరఫు వారిదే డామినేషన్ కనిపిసస్తోంది.

మిగతా రాష్ట్రాల్లో అబ్బాయి తరఫు వాళ్లు ఎక్కువగా మర్యాదలు పొందుతుంటారు. కేరళలో జరిగే వివాహాల్లో ప్రస్తుతం పెళ్లి కూతురు మండపంలోకి వచ్చే సందర్భంలో కుటుంబీకులు తీసుకొచ్చే సంప్రదాయం ఉన్నా.. డోలి, బుట్టలో కూర్చుని తీసుకొచ్చే సంప్రదాయం మారింది. అమ్మాయి మరో నలుగురు అమ్మాయిలు లేదా చిన్నపిల్లలతో కలిసి మాస్ డ్యాన్సులు వేసుకుంటూ మండలంలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ దృశ్యాలు ఇటీవల కాలంలో చాలా చోటుచేసుకుంటున్నాయి. అమ్మాయి పెళ్లి హాలులో నుంచి స్టెప్పులు వేసుకుంటూ మండలంలోకి వస్తుంటుంది. అబ్బాయి మాత్రం మండపంలో కూర్చుని అమ్మాయిని చూస్తూ ఉంటాడు.

Bride Dance Performance video viral on youtube

Bride Dance Performance video viral on youtube

దీనికి సంబంధించిన విజువల్స్ యూట్యూబ్‌లో ఎక్కువగా పాపులర్ అవుతున్నాయి. తాజాగా ఓ పెళ్లిలో కూడా ఇలానే జరిగింది. పెళ్లి కూతురు మరో నలుగురు అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేస్తూ మండపానికి చేరుకుంటుంది. అబ్బాయి మాత్రం ముందే వచ్చి అమ్మాయి రాకకోసం ఎదురుచూస్తుంటాడు. అమ్మాయి వెనుక గొడుగు లాగా ఉండే ఒక వస్త్రాన్నికుటుంబ సభ్యులు పట్టుకుని వస్తుండే దృశ్యాలను మనం వీక్షించవచ్చును.మొత్తంగా అక్కడి పెళ్లిళ్లలో అబ్బాయిలు సైలెంట్ గా కూర్చుంటే అమ్మాయిలు మాత్రం నానా రచ్చ చేసుకుంటూ మండపానికి చేరుకోవడం వింతగా ఉంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది