
Bride dance video on youtube
Viral Video : పెళ్ళి అనేది ఎవరి జీవితంలో అయినా మధుర ఘట్టం. పెళ్ళి మళ్ళీ మళ్ళీ జరిగేది కాదు కాబట్టి వధూవరులు,వారి కుటుంబ సభ్యులు పెళ్ళికి భారీగా ఖర్చు చేస్తారు. పెళ్ళి కొడుకు,పెళ్ళి కూతురు డ్యాన్స్ వేస్తూ తమ సంతోషాన్ని తెలపడం ఒక ట్రెండ్ అయిపోయింది ప్రస్తుతం. వీటికంటూ ప్రత్యేక పాటలుండటం ఇక్కడ ప్రత్యేకత. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా’ అనే జానపద గీతం ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ పాట వచ్చిన తరువాత అమ్మాయిలు డ్యాన్స్ లో దుమ్ముదులుపుతు న్నారు. పెళ్ళి సంతోషాన్ని దుమ్ముదులిపే స్టెప్స్ తో తెలియచేస్తున్నారు. ప్రస్తుతం ఒక వీడియో వైరల్ గా మారింది.
అందులో అమ్మాయి తన పెళ్ళి సందర్భంగా డ్యాన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. వీడియోలో కనిపించే వారి వివరాలు,ఊరి పేరు మనకి తెలియకపోయినా,పెళ్ళికూతురు తన డ్యాన్స్ తో అందరినీ కట్టిపడేసింది. పెళ్ళికూతురుని చూసి ఊపు తెచ్చుకున్నపెళ్ళికొడుకు తాను కూడా తనలో ఉన్న డ్యాన్సర్ ని బయటపెట్టాడు.పెళ్ళి చూడటానికి వచ్చిన కుటుంబ సభ్యులు,స్నేహితులు పెళ్ళి కూతురు,పెళ్ళి కొడుకు చేసిన నృత్యాలను చూసి ఆశ్చర్యపోయారు. కొంత మంది యువకులైతే విజిల్స్ వేస్తూ,చప్పట్లు కొడుతూ నూతన వధూవరులను ఉత్సాహపరిచారు.
Bride dance video on youtube
పెళ్ళికి విచ్చేసిన అతిథులకు పెళ్ళి తో పాటు మంచి డ్యాన్స్ చూసే అవకాశం లభించినట్టయింది.‘ నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా’ పాట గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కరలేదు. ఒక సాధారణ పాటగా మొదలై అత్యంత ప్రజాదరణ పొందిన పాటల్లో ఒకటిగా నిలిచింది ఈ పాట. లక్ష్మణ్ ‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా’ పాట ని రచించగా,ఎస్‌కే బాజి సంగీతం అందించారు. ఈ జానపద పాటని అద్భుతంగా ఆలపించింది మోహన భోగరాజు. యూట్యూబ్‌లో విడుదల చేసిన ఈ పాట ఆ నోటా ఈ నోటా ప్రజలలోకి వెళ్ళింది. మూడు కోట్లకు పైగా వ్యూస్ సాధించి,లక్షల కొద్దీ షేర్లు నమోదు చేసింది.
Chicken and Mutton : తెలంగాణ కుంభమేళాగా Telangana Medaram Jatara 2026 పిలవబడే మేడారం మహా జాతరలో భక్తిభావం…
Om Shanti Shanti Shantihi Movie Review : టాలీవుడ్ Tollywood లో వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ తరుణ్…
Today Gold Price on January 30th 2026 : బంగారం ధరల పెరుగుదల పసిడి ప్రియులకు కోలుకోలేని షాక్…
Brahmamudi Today Episode Jan 30 : బుల్లితెరపై రికార్డులు సృష్టిస్తున్న 'బ్రహ్మముడి' సీరియల్ (BrahmaMudi) రోజుకో కొత్త మలుపు…
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న 'కార్తీక దీపం 2' సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. కార్తీక్, దీపల…
Samsung Galaxy S26 : శాంసంగ్ ( Samsung ) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'గెలాక్సీ ఎస్26 సిరీస్'…
Guava : జామపండు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పోషకాల గని అనడంలో సందేహం లేదు. నారింజ పండు కంటే ఎక్కువ…
Zodiac Signs : శుక్రవారం, జనవరి 30, 2026 నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వైదిక జ్యోతిష్య…
This website uses cookies.