Viral Video : ఇదేం డ్యాన్స్ రా బాబు.. బుల్లెట్ బండికి పాట నాటు స్టెప్పులేసిన పెళ్లి కూతురు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : ఇదేం డ్యాన్స్ రా బాబు.. బుల్లెట్ బండికి పాట నాటు స్టెప్పులేసిన పెళ్లి కూతురు..!

 Authored By mallesh | The Telugu News | Updated on :24 October 2022,2:00 pm

Viral Video : పెళ్ళి అనేది ఎవరి జీవితంలో అయినా మధుర ఘట్టం. పెళ్ళి మళ్ళీ మళ్ళీ జరిగేది కాదు కాబట్టి వధూవరులు,వారి కుటుంబ సభ్యులు పెళ్ళికి భారీగా ఖర్చు చేస్తారు. పెళ్ళి కొడుకు,పెళ్ళి కూతురు డ్యాన్స్ వేస్తూ తమ సంతోషాన్ని తెలపడం ఒక ట్రెండ్ అయిపోయింది ప్రస్తుతం. వీటికంటూ ప్రత్యేక పాటలుండటం ఇక్కడ ప్రత్యేకత. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా’ అనే జానపద గీతం ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ పాట వచ్చిన తరువాత అమ్మాయిలు డ్యాన్స్ లో దుమ్ముదులుపుతు న్నారు. పెళ్ళి సంతోషాన్ని దుమ్ముదులిపే స్టెప్స్ తో తెలియచేస్తున్నారు. ప్రస్తుతం ఒక వీడియో వైరల్ గా మారింది.

అందులో అమ్మాయి తన పెళ్ళి సందర్భంగా డ్యాన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. వీడియోలో కనిపించే వారి వివరాలు,ఊరి పేరు మనకి తెలియకపోయినా,పెళ్ళికూతురు తన డ్యాన్స్ తో అందరినీ కట్టిపడేసింది. పెళ్ళికూతురుని చూసి ఊపు తెచ్చుకున్నపెళ్ళికొడుకు తాను కూడా తనలో ఉన్న డ్యాన్సర్ ని బయటపెట్టాడు.పెళ్ళి చూడటానికి వచ్చిన కుటుంబ సభ్యులు,స్నేహితులు పెళ్ళి కూతురు,పెళ్ళి కొడుకు చేసిన నృత్యాలను చూసి ఆశ్చర్యపోయారు. కొంత మంది యువకులైతే విజిల్స్ వేస్తూ,చప్పట్లు కొడుతూ నూతన వధూవరులను ఉత్సాహపరిచారు.

Bride dance video on youtube

Bride dance video on youtube

పెళ్ళికి విచ్చేసిన అతిథులకు పెళ్ళి తో పాటు మంచి డ్యాన్స్ చూసే అవకాశం లభించినట్టయింది.‘ నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా’ పాట గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కరలేదు. ఒక సాధారణ పాటగా మొదలై అత్యంత ప్రజాదరణ పొందిన పాటల్లో ఒకటిగా నిలిచింది ఈ పాట. లక్ష్మణ్‌ ‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా’ పాట ని రచించగా,ఎస్‌కే బాజి సంగీతం అందించారు. ఈ జానపద పాటని అద్భుతంగా ఆలపించింది మోహన భోగరాజు. యూట్యూబ్‌లో విడుదల చేసిన ఈ పాట ఆ నోటా ఈ నోటా ప్రజలలోకి వెళ్ళింది. మూడు కోట్లకు పైగా వ్యూస్ సాధించి,లక్షల కొద్దీ షేర్లు నమోదు చేసింది.

YouTube video

 

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది