Viral Video : పెళ్లి కూతురు డ్యాన్స్ కేక‌.. అదిరే స్టెప్పుల‌తో అంద‌రిని క‌ట్టిప‌డేసింది..

Authored By mallesh | The Telugu News | Published on: April 19, 2022, 7:00 am

Viral Video : పెళ్లి చూపుల‌కు వెళ్తే ఏమ్మా.. నీకు వంట వ‌చ్చా.. ఇంటి ప‌నులు వ‌చ్చా.. జాబ్ చేస్తావా.. అనే రోజులు పోయి ఏమ్మా.. డ్యాన్స్ వ‌చ్చా అని అడిగేంతలా ట్రెండ్ సెట్ అయింది. ఏ పెళ్లిలో చూసినా బ్యాచ్ అంతా డ్యాన్సుల‌తో ఇర‌గ‌దీస్తున్నారు. పెళ్లి ప‌నులు స్టార్ట్ అయింది మొద‌లు సంగీత్.. మండ‌పంలో.. బ‌రాత్ లో డ్యాన్సులు చేస్తూ పెళ్లంటేనే సంబ‌రాలు డ్యాన్స్ లు అనేలా మారిపోయింది. అయితే గ‌తంలో పెళ్లి కూతురు స్టైల్ వేరు అందం అభినయ‌తో ల‌త దించుకుని మండ‌పంలో కూర్చునేవారు.

ఇప్ప‌డు అలా కాదు.. ఏకంగా ట్రెండింగ్ సాంగ్ కి డ్యాన్సులు చేస్తూ సంద‌డి చేస్తున్నారు పెళ్లి కూతుళ్లు.. సోష‌ల్ మీడియా పాపులారిటీ పెరిగిన త‌ర్వాత ఈ ట్రెండింగ్ బాగా పాపుల‌ర్ అయింది. ఒక సాంగ్ ట్రెండింగ్లో ఉందంటే ఆ సీజ‌న్ లో జ‌రిగే పెళ్లిల‌లో ఆ సాంగ్ ఒక ఊపుఊపేస్తుంది. సినిమాల్లో హిట్ కాని సాంగ్స్ కూడా సోష‌ల్ మీడియా ద్వారా మంచి హిట్ కొట్టాయి. అయితే ఈ బుల్లెట్టు సాంగ్ ఫీవ‌ర్ అమ్మాయిల‌ను ఎప్ప‌టికి వ‌ద‌ల‌వేమో.. ఎక్క‌డా చూడా అదే సాంగ్ వినిపిస్తుంది. అలా మ‌రికొన్ని సాంగ్స్ ట్రెండింగ్లో కొన‌సాగాయి.

Bride dancing in Viral Video

Bride dancing in Viral Video

Viral Video : పెళ్లి కూతురు డ్యాన్స్ కేక‌.. అదిరే స్టెప్పుల‌తో

ఇప్పుడు ఎక్కడ చూసినా పెళ్లి కూతురే డాన్స్ చేసుకుంటూ మండపం లోకి వస్తుంది. ఇక తెలంగాణ లో ఒక పెళ్లి కూతురు చేసిన డాన్స్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. ఆ పెళ్లి కూతురి మాస్ డాన్స్ తో అందరిని ఆశ్చర్యపరిచింది. సంప్ర‌దాయ‌మైన చిర‌క‌ట్టులో అంత మందిలో కూడా ఎలాంటి జంకు లేకుండా డ్యాన్స్ ఇర‌గ‌దీసింది. వాడు న‌డిపే బండి… కాటుక క‌నులే మెరిసిపోయే పిల‌డా నిను చూసి.. సామీ సామీ.. త‌మిళ వ‌ర్ష‌న్ ఇలా అన్ని సాంగుల‌కు పెళ్లి కూతురు మాస్ డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంది. మీరు కూడా ఈ వీడియో చూసేయండి లేటెందుకు…..

mallesh

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp