Viral Video : పెళ్లికొడుకు సిగ్గుప‌డుతున్నా.. పెళ్లి కూతురు అస్స‌లు ఆగ‌ట్లేదుగా.. డ్యాన్స్ వీడియో

Authored By mallesh | The Telugu News | Published on: June 6, 2022, 2:00 pm

Viral Video : అమ్మాయిల‌కు డ్యాన్స్ అంటే ఎంత పిచ్చి ఇష్టమో మాట‌ల్లో చెప్ప‌లేం.. చాలా మంది అమ్మాయిలు ఎక్క‌డ చాన్స్ దొరికినా డ్యాన్స్ చేయ‌కుండా వ‌ద‌ల‌రు. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ఈ మ‌ధ్య‌కాలంలో మ‌రింత పెరిగింది. ఫ్యామిలీ ఫంక్ష‌న్స్, ఈవెంట్స్, కాలేజ్ ఫంక్ష‌న్స్ మ్యారేజెస్ ఇలా ఎక్క‌డ చూసినా త‌మ డ్యాన్స్ తో ఇర‌గ‌దీస్తున్నారు. ఒక‌ప్పుడు బాగా ఇబ్బంది ప‌డే అమ్మాయిలు సిగ్గుతో త‌ల‌దించుకునేవారు. కానీ ఇప్పుడు ఎలాంటి జంకు లేకుండా ఎక్క‌డైనా ఎప్పుడైనా డ్యాన్స్ చేయ‌గ‌లం అని నిరూపిస్తున్నారు.

ఈ మ‌ధ్య‌కాలంలో పెళ్లిలో పెళ్లి కూతురు, వ‌రుడు డ్యాన్స్ చేయ‌డం ట్రెండింగ్ లో ఉంది. ఏ పెళ్లిలో చూసినా డ్యాన్స్ చేయ‌డం మాత్రం కామ‌న్.. పెళ్లి ప‌నులు స్టార్ట్ అయింది మొద‌లు సంగీత్.. మెహెందీ.. ఇలా కార్య‌క్ర‌మం పేరేదైనా డ్యాన్స్ మాత్రం ఒక్క‌టే. ట్రెండింగ్, డీజీ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ పెళ్లికే సందడి తీసుకొస్తున్నారు. ఇంటిల్లిపాది, బంధువులు, ఫ్రెండ్స్ అంద‌రూ క‌లిసి స్టేజ్ పై డ్యాన్స్ చేస్తూ హంగామా చేస్తున్నారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కంటే ఒక అడుగు ముందే ఉంటోంది. మండ‌పంలో డ్యాన్స్ చేసి పెళ్లికొడుకుని ఇంప్రెస్ చేస్తోంది. వీడియోలు, ఫొటోలు తీసుకుని జ్ఞాప‌కాలుగా దాచుకుంటున్నారు.

bride dance video in viral

bride dance video in viral

ప్ర‌స్తుతం ఓ పెళ్లి కూతురు రిసెప్ష‌న్ లో చేసిన సంద‌డి మామూలుగా లేదు. పెళ్లి కొడుకుని లాగి మరీ డ్యాన్స్ చేయిస్తోంది. పాపం పెళ్లికొడుకు సిగ్గుప‌డుతూ డ్యాన్స్ చేయ‌లేక‌పోతున్నాడు. పెళ్లి కూతురు మాత్రం ప‌ట్టించుకోకుండా డ్యాన్స్ చేస్తూనే ఉంది. ట్రెండింగ్ సాంగ్ నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్త‌ప్పా డుగ్గు..డుగ్గు. డుగ్గు అని… అంటూ సింపుల్ గా స్టెప్పులు వేస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp