Viral Video : డ్యాన్స్ ఇరగదీస్తున్నపెళ్లి కూతురు.. తగ్గేదేలా.. అంటున్న ఫ్రెండ్స్ రిలేటీవ్స్
Viral Video : పెళ్లంటే ఇంకో ముచ్చట లేదు డ్యాన్స్ ఇరగదీయాల్సిదే.. ప్రస్తుతం పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తేనే ఆ పెళ్లి అందరికీ గుర్తుండిపోయేంతగా.. ట్రెండ్ సెట్టయింది. పెళ్లనగానే ఆ సందడే వేరు ఉంటుంది. కుటుంబ సభ్యులు.. బంధువులు, ఫ్రెండ్స్.. ఇలా అందరూ ఒక చోట చేరి ఆప్యాయంగా పలకరించుకుంటూ పెళ్లి పనులు జోష్ గా చేస్తుంటారు. పాటలు పాడుతూ డ్యాన్స్ లు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకప్పుడు పెళ్లి కూతురు సిగ్గుతో తల వంచుకుని ఉండేది. పెళ్లి తతంగమంతా అయిపోయే వరకు సిగ్గుపడుతూ సాంప్రదాయంగా ఉండేవారు.
కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. తీన్ మార్ డ్యాన్స్ లు విందులు వినోదాలు ఎక్కువయ్యాయి. వధూవరులు ఇద్దరూ పెళ్లి మండపంలో డ్యాన్స్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు.అంతేనా.. ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇక బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా.. డుగ్గు..డుగ్గు.. అని పాడుకుంటూ ట్రెండింగ్ లో ఉంటున్నారు. ఏ పెళ్లిలో చూసినా.. ఏ ఫంక్షన్లో చూసినా డ్యాన్స్ చేయడం కామన్ గా మారిపోయింది. పెళ్లి కూతురు అందంగా ముస్తాబై గుంపు గా మండపానికి డ్యాన్స్ చేకుంటూ విచ్చేస్తోంది. మండపంలో కూడా డ్యాన్స్ చేస్తూ పెళ్లి కొడుకును ఇంప్రెస్ చేసే పనిలో ఉన్నారు చాలా మంది.
ఈ డ్యాన్స్ వీడియోలు ఎవరో ఒకరు యూట్యూబ్ వంటి వాటిలో పోస్ట్ చేయడంతో లైకులే లైకులు… దీంతో తెగ వైరల్ అవుతున్నాయి.ఇలాంటిదే ప్రస్తుతం ఫ్యామిలీ, బంధువులతో పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. కొంత మంది పెళ్లి కూతుర్లు బంధువులు, ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో కలసి డ్యాన్స్ కుమ్మేస్తున్నారు. అక్కడున్నవారంతా కూడా ఫోక్ సాంగ్స్ కు తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. దీంతో వేలల్లో వ్యూస్ వస్తున్నాయి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మరీ…