Viral Video : వెడ్డింగ్ డ్యాన్స్ అదుర్స్..పెళ్లి కూతురు మాస్ డ్యాన్స్ చూస్తే మతిపోవాల్సిందే.. వీడియో

 Authored By prabhas | The Telugu News | Updated on :3 August 2022,2:00 pm

Viral Video : వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు నెట్టింట్లో ఎంత సంద‌డి చేస్తున్నాయో అంద‌రికీ తెలిసిందే.. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ఈ ట్రెండ్ ఊపందుకుంది.. త‌ల‌దించుకుని సిగ్గుప‌డుతూ మండ‌పంలో కూర్చునే పెళ్లికూతురు ఏకంగా మండ‌పంలోనే డ్యాన్స్ చేస్తూ పెళ్లి కొడుకుని ఇంప్రెస్ చేస్తోంది. అలాగే పెళ్లి కూతురు ఎంట్రీ డ్యాన్స్ కూడా తెగ వైర‌ల్ అవుతోంది. డ్రెస్ కోడ్ పాటిస్తూ పెళ్లి కూతురు వెన‌కాల కొంత‌మంది గ్రూప్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఎక్కువ‌గా కేర‌ళ‌, త‌మిళ వెడ్డింగ్ పెళ్లి కూత‌రు ఎంట్రీ డ్యాన్స్ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి.

ఇక పెళ్లి కూతురు.. పెళ్లి కొడుకు మండ‌పంలోనే డ్యాన్స్ చేస్తున్నారు. ఒక‌ప్పుడు వ‌ధూవ‌రుల‌ను ఫ్రెండ్స్ బ‌ల‌వంతంగా లాక్కొచ్చి డ్యాన్స్ చేపిస్తుండేవారు. ఇక పెళ్లి బరాత్ లో బంధువులు, మిత్రులు డ్యాన్స్ చేస్తుండే వారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కారులో ముచ్చ‌ట్లు పెట్టుకుంటూ ఉండేవారు. బరాత్ అయి పోయే వరకు కునుకు తీస్తుండే వారు. కానీ ప్ర‌స్తుతం ట్రెండ్ మారింది… వధూవరులు డ్యాన్స్ లతో ఇరగదీస్తున్నారు. బరాత్ లో దుమ్ము రేపుతున్నారు.

Bride mass dance video on youtube

Bride mass dance video on youtube

చుట్టూ బంధుమిత్రులు ఈలలు, గోలలు చేస్తూ ఎంకరేజ్ చేస్తుంటే పోటీప‌డి మ‌రీ డ్యాన్స్ చేస్తున్నారు. నచ్చిన పాటలకు స్టెప్పులు వేస్తూ సంద‌డి చేస్తున్నారు. ఏ పెళ్లి జరిగినా అందులో త‌ప్ప‌నిస‌రిగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్ల డ్యాన్స్ లు ఉంటుంది. ప్ర‌స్తుతం ఓ బంజారా పెళ్లి కూతురు జంట డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. చుట్టూ అంద‌రూ ఎంక‌రేజ్ చేస్తుండ‌గా పెళ్లికొడుకు పెళ్లి కూత‌రు పోటీప‌డుతూ డ్యాన్స్ చేస్తున్నారు. దీంతో యూట్యూబ్ లో రెండు ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి