Viral Video : బుల్లెట్ బండి సాంగ్‌కు అదిరిపోయే స్తెప్పులేసిన పెళ్లి కూతురు.. క్రేజ్ తగ్గలే.. వీడియో

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 21 August 2022, 2:00 pm

Viral Video : కొత్తగా పెళ్లైన జంటలకు బుల్లెట్ బండి సాంగ్ ఒక బ్రాండ్‌గా మారిపోయింది. యువజంటలకే కాకుండా చిన్నపిల్లలు,పెద్దవారికి సైతం ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ ఏ ఫంక్షన్, ఈవెంట్ జరిగినా సింగర్ మోహన భోగరాజు పాడిన బుల్లెట్ బండి సాంగ్ తప్పకుండా వినిపిస్తుంది. దీనికి అంతా క్రేజ్ తీసుకొచ్చింది సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం.. సింగర్ వాయిస్, సంగీతం ఆ పాటకు ప్రాణం పోస్తే సోషల్ మీడియా దానికి పాపులారిటీ తీసుకొచ్చింది.

ఈ పాట వచ్చిన నాలుగు నుంచి ఐదు నెలల తర్వాత అనుకోకుండా వైరల్ అయ్యింది. అప్పటివరకు యూట్యూబ్‌లో దీనికి పెద్దగా వ్యూస్ కూడా లేవు. సాదా సీదా వ్యూస్‌తో నడుస్తున్నా ఈ సాంగ్.. ఎప్పుడైతే సోషల్ మీడియాలో అందరూ ఈ సాంగ్‌ను రీమేక్ చేయడం ప్రారంభించారో నాటి నుంచి బుల్లెట్ బండి సాంగ్ జనాల్లోకి వెళ్లింది. నెలకిందట ఈ సాంగ్‌కు ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు. సినిమా యాక్టర్స్, చిన్న పిల్లలు, సోషల్ మీడియా స్టార్స్ వీరంతా ఈ సాంగ్‌కు స్టెప్పులు వేసినవారే. దీంతో సింగ్, సాంగ్ మేకర్స్‌కు చాలా మంచి పేరు వచ్చింది.

Bride stunning Dance video on youtube

Bride stunning Dance video on youtube

ఆర్ఆర్ఆర్ మూవీ అనంతరం ఈ సాంగ్ గొప్పతనాన్ని జూనియర్ ఎన్టీఆర్ కూడా మెచ్చుకున్నారు. అలాంటిది బుల్లెట్ బండి సాంగ్ మళ్లీ వైరల్ అవుతోంది. కొత్తగా పెళ్లైన జంటలు ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేస్తుండటంతో దీనికి ఇంకా క్రేజ్ తగ్గలేదని అర్థమవుతోంది. పెళ్లి కూతర్లు ఎక్కడ చూసినా ఈ పాటకు ప్రత్యేకంగా స్టెప్పులు వేస్తున్నారు. దీంతో ఈ సాంగ్‌కు పడిపోయిన డిమాండ్ మళ్లీ ఒక్కసారిగా వచ్చినట్టు అయ్యింది. సాధారణ ఫంక్షన్లలో కంటే పెళ్లిబారాత్‌లోనే బుల్లెట్ బండి సాంగ్ ఒక బ్రాండ్‌గా మారిపోయింది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి