Viral Video : ఓ రేంజ్ స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీసిందిగా.. పెళ్లి కూతురి మాస్ డాన్స్‌ వీడియో..!

Authored By mallesh | The Telugu News | Published on: September 15, 2022, 2:00 pm

Viral Video : పెళ్లి అనేది ప్రతి ఒక్కరీ జీవితంలో కీలకమైన ఘట్టం. ఒకప్పుడు అమ్మాయిలు మేజర్లు కాకముందే పెళ్లి చేసి అత్తారింటికి పంపించేవారు. ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగయ్యాయి.బాల్య వివాహాలు తగ్గిపోయాయి. అమ్మాయిలు చదువుకుంటున్నారు. వారికి సమాజంలో మంచి, చెడు గురించి కొంచెమైనా అవగాహన ఏర్పరచుకుంటున్నారు. దీంతో పెళ్లి సమయంలో ఏది సరైనది.. ఏది కాదని వారు స్వయంగా నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్నారు. దీంతో పెళ్లి తర్వాత వారికి ఇబ్బందులు కాస్త తప్పుతున్నాయి. ఒకప్పటి పాత రోజులు మారాయి.

పెళ్ళి అనగానే అమ్మాయిని ఏడుస్తూ అత్తారింటికి పంపే రోజులు పోయాయి. అమ్మాయి కూడా ఏడుస్తూ తాళి కట్టించుకుని భయం భయంగా అత్తారింటికి వెళ్లే పరిస్థితులు కొంత మెరుగయ్యాయి. ఒకప్పుడు పెళ్లిలో పెళ్లి కొడుకులు ఎక్కువగా డ్యాన్స్ చేసేవారు. అమ్మాయి మాత్రం కారులో నుంచి కిందకు దిగేది కాదు. కానీ ట్రెండ్ మారింది. ఈ మధ్య కాలంలో వివాహం అయ్యాక పెళ్లి కూతుళ్లే డాన్సులు వేస్తున్నారు.ఇదివరకు రోజుల్లో పెళ్లి కూతురు సిగ్గు పడుతూ మండపంలోకి వచ్చేది. కానీ ఇప్పుడు ఎక్కడ చూసిన పెళ్లి కూతురే డాన్స్ చేసుకుంటూ మండపంలోకి వస్తున్నారు.

bride super dance VIDEO on youtube

bride super dance VIDEO on youtube

Viral Video : అబ్బాయిలను మించిపోతున్నఅమ్మాయిలు

తాజాగా రాష్ట్రంలో జరిగిన ఒక పెళ్లిలో పెళ్లికూతురు చేసిన డాన్స్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్‌గా అవుతోంది. కొత్త కొత్త స్టెప్పులతో పెళ్లి కూతురి మాస్ డాన్స్‌ అందరినీ ఆకట్టుకుంది. బంజారా వర్గానికి చెందిన ఒక పెళ్లిలో పెళ్లికూతురు చూపునకు చూడముచ్చటగా ఉంది. వీరి ఆచారం ప్రకారం పెళ్లికి ముందే బారాత్ తంతు ఉంటుంది. దీంతో కుటుంబంలోని వారు, బంధువులు కలిసి డ్యాన్స్ చేస్తుంటారు. ఇందులో పెళ్లికూతురు కూడా పాలు పంచుకుంది. మరికొన్ని గంటల్లో తన పెళ్లి అని తెలిసినా బంజారా సాంగ్‌కు అనుగుణంగా కాలు కదిపింది. అమ్మాయి డ్యాన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు.ఈ వీడియోకు ప్రస్తుతం యూట్యూబ్‌లో మంచి స్పందన వస్తోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp