Viral Video : మండ‌పంలో డ్యాన్స్ అద‌రగొట్టిన పెళ్లి కూతురు.. సిగ్గుతో పెళ్లికొడుకు..

Authored By mallesh | The Telugu News | Updated on : 24 June 2022, 2:00 pm

Viral video: ఈ రోజుల్లో అమ్మాయిలు ఏ విష‌యంలోనైనా త‌గ్గేదేలా.. అంటున్నారు. వాళ్ల‌కు న‌చ్చితే ఎదైనా చేసేస్తారు. ఇది సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో మ‌రింత పెరిగింది. వాళ్ల టాలెంట్ ని సోష‌ల్ మీడియా ద్వారా నిరూపించుకుంటూ ఫేమ‌స్ అవుతున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ అంద‌రూ ఫాలో అవుతున్నారు. ఇక పెళ్లిలో అయితే అమ్మాయిల సంద‌డే వేరు.. పెళ్లికొడుకు సిగ్గుప‌డుతున్నా వాళ్లు మాత్రం అస్స‌లు త‌గ్గ‌ట్లేదు. ఒక‌ప్పుడు సిగ్గుప‌డి త‌లదించుకునే అమ్మాయిలు ఇప్పుడు ఏకంగా మండ‌పాల్లోనే డ్యాన్స్ చేస్తూ పెళ్లికొడుకుని ఇంప్రెస్ చేస్తున్నారు.

అంద‌రి ముందు ఎలాంటి జంకు లేకుండా సంద‌డి చేస్తున్నారు. ఇంట్లో ఏ చిన్న ఫంక్ష‌న్ జ‌రిగినా డీజే సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు నెట్టింట్లో హ‌ల్ చల్ చేస్తున్నాయి. వీటిని ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. త‌మ పెళ్లిలో కూడా డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంటున్నారు. ఇక ప్ర‌తి పెళ్లిలో వినిపించే సాంగ్ నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్త‌పా.. ఈ సాంగ్ పై పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తూ పెళ్లి కొడుకుని ఇంప్రెస్ చేస్తోంది. క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో పెళ్లికొడుకుని చూస్తూ త‌మ‌లోని ఫీలింగ్స్ ని సాంగ్ రూపంలో తెలియ‌జేస్తున్నారు.

Bullet bandi song Bride Dance Video viral

Bullet bandi song Bride Dance Video viral

ఇలాంటి వీడియోలు నెట్టింట్లో ల‌క్ష‌ల్లో సంద‌డి చేస్తున్నాయి. కాగా పెళ్లి కూతురు మండపంలో డ్యాన్స్ చేస్తూ పెళ్లికొడుకుని ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్ గా మారింది. మండ‌పంలో బంధువులు ఎంక‌రేజ్ చేయ‌గా పెళ్లికూతురు తెలుగు పాపుల‌ర్ సాంగ్ బుల్లెట్టు బండెక్కి.. పాట‌కి డ్యాన్స్ చేస్తూ పెళ్లికొడుకుని ఇంప్రెస్ చేస్తోంది. పెళ్లికొడుకు కాస్తా సిగ్గుతో చూస్తూ ఉండిపోయాడు. దీంతో నెటిజ‌న్స్ సూప‌ర్ డ్యాన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

  1. "Pradeep Rawat : టాలీవుడ్ స్టార్ విలన్ ప్రదీప్ రావత్.. కోట్ల ఆస్తి వెనుక అసలు కథ..!"

  2. "Karthika Deepam 2 Today Episode August 05 : సూరజ్‌ను దత్తత తీసుకుంటానన్న శ్రీధర్.. జ్యోత్స్నకు భారీ షాక్!"

  3. "Gold Rate Today : గుడ్‌న్యూస్‌.. నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి.. ఆగస్టు 5 తాజా గోల్డ్ రేట్లు ఇవే!"

  4. "Sprouted Green Gram : కోడిగుడ్లు, పాలకంటే ఎక్కువ ప్రొటీన్.. ఈ సూపర్ ఫుడ్ తెలుసా?.. రోజూ గుప్పెడు చాలు!"

  5. "Fennel Water : డయాబెటిస్ ఉన్నవారికి ఈ నీరు వరమా?.. రోజూ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!"

  6. "Tirumala : తిరుమలలో రూమ్ దొరకలేదా? అయితే నిరాశ చెందొద్దు.. టీటీడీ ఉచితంగా అందిస్తున్న ఈ సదుపాయాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!"

  7. "Korean Kanakaraju Movie : ‘కొరియన్ కనకరాజు’పై పెరుగుతున్న అంచనాలు.. వరుణ్ తేజ్ కంబ్యాక్‌కు ఇదే టర్నింగ్ పాయింట్ అవుతుందా?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp