Viral Video : 90ML మందేసిన పిల్లి.. కిక్కే కిక్కు.. నడవలేకపోతున్నది.. ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!
Viral Video : మందుబాబులు ఫూటుగా మద్యం తాగి రోడ్లపైన చేసే అల్లరికి సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి. మందు బాగా ఎక్కేసిన క్రమంలో వారు ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియదు. ఈ క్రమంలోనే వారు చేసే ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ చూసి తెగ నవ్వుకుంటారు నెటిజన్లు. కాగా, తాజాగా ఓ పిల్లి మందు తాగి రచ్చ రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.
గుల్దర్ బకాలిమ్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోలో క్యాట్ వెరీ ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తోంది. అవి చూసి నెటిజన్లు తెగ సంబుర పడిపోతున్నారు. వైరల్ వీడియో వివరాల్లోకెళితే..పిల్లి.. ఓ గ్లాసులో పోసి ఉన్న మందును తన కాలి ద్వారా మెల్లిమెల్లిగా టేస్ట్ చేసింది.. ఈ క్రమంలోనే కొంచెం తాగేసింది కూడా.అలా టేబుల్ పైన ఓ గ్లాసులో పోసి ఉన్న మద్యాన్ని పిల్లి కొంచెం కొంచెం కాలితోనే సిప్ చేసింది.
Viral Video : ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ.. చివరకు అక్కడే కూలబడిపోయిన క్యాట్..
ఇక అలా కొంచెం మద్యం తాగిన తర్వాత పిల్లికి ఏమైందో ఏమో తెలియదు. కానీ, తర్వాత క్యాట్ నడవలేకపోతున్నది. అలా మెట్లు ఎక్కేందుకుగాను అతి కష్టంగా నడుస్తున్నది. అలా వెనుక రెండు కాళ్లు సపోర్ట్ తీసుకున్నా కానీ అడుగులు ముందుకు పడటం లేదు. ఎట్టకేలకు ఒక్కో అడుగు ముందరకు వేసి మెట్టును సపోర్ట్‌గా తీసుకుని పిల్లి ముందుకు సాగుతున్నది. ఈ వీడియో చూసి నెటిజన్లు ‘వెరీ ఫన్నీ క్యాట్’ అని అంటున్నారు.
https://twitter.com/Ben52905636/status/1482104420640956419