Viral Video : ఈ క్యాట్ యమ క్యూట్.. యాక్టింగ్ వేరే లెవల్ ఉందిగా.. వీడియో వైరల్!

 Authored By mallesh | The Telugu News | Updated on :11 January 2022,7:40 am

viral video : ఇంట్లో ఉండే పెట్స్ చేసే అల్లరి వలన అస్సలు టైం తెలియదు. చాలా మంది అందుకే ఇంట్లో పిల్లులు, కుక్కలు, చిలుకలు, కుందేళ్లను పెంచుకుంటుంటారు. వాటిని కూడా తమ ఇంట్లోని వ్యక్తులుగా భావిస్తారు. స్నానం చేయించడం, దుస్తులు తొడుగుతుంటారు. అనారోగ్యానికి గురైతే వ్యాక్సిన్స్, మందులు కూడా వేస్తారు. ప్రస్తుత సమాజంలో యానిమల్ లవర్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. వీరంతా మనుషులతో కంటే యానిమల్స్ తోనే టైం స్పెండ్ చేస్తుంటారు.

ఉదయాన్నే జాగింగ్ కు వెళ్లేటప్పుడు వాటిని కూడా వెంటబెట్టుకుని వెళ్తుంటారు.ఇంట్లో పెట్స్ ఉంటే ఎంత సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంట.. కొందరు పిల్లితో పాటు కుక్కలను కూడా పెంచుకుంటారు.ఇవి రెండు ఒకే దగ్గర ఉంటే విపరీతంగా అల్లరి చేస్తుంటాయి. ఇండిపెండెంట్ హోమ్స్ ఉన్నవారు పెట్స్‌ను అధికంగా పెంచుకుంటుంటారు. ఎందుకంటే ఇరుగుపొరుగుతో ఎలాంటి మాటలు రావద్దు కదా..అయితే, యానిమల్స్ ఒక్కోసారి తమ చేష్టలతో నవ్వులు పూయిస్తుంటాయి.

cat expressions very cute video viral

cat expressions very cute video viral

viral video : మెడలో చైన్, కళ్లకు గ్లాసెస్‌..

ఈ మధ్యకాలంలో చాలా మంది తమ పెట్స్ తో ఆడుకుంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. తాజాగా వండల్ వుల్ డిక్సీ అనే ఇన్ స్టా ఐడీలో ఓ క్యాట్ తమ హావభావాలతో అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. బ్యాక్ గ్రౌండ్ ఓ సినిమా మ్యూజిక్ వస్తుండగా, దానికి తగ్గట్టు ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. మెడలో చైన్, కళ్లకు అద్దాలతో ఓ లెవల్లో ఉంది. ఇంకెందుకు ఆలస్యంగా ఈ క్యూట్ డిక్సీని మీరు కూడా చూసేయండి.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి