Viral Video : గాల్లో తేలిపోతున్న పిల్లి.. హాయిగా మసాజ్ చేయించుకుంటూ..

Authored By mallesh | The Telugu News | Updated on : 20 January 2022, 6:00 am

Viral Video : సోషల్ మీడియాలో ప్రతి రోజూ మనకు వేల సంఖ్యలో వీడియోలు కనిపిస్తుంటాయి. వీటిని చూస్తూ చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోల్లో అవి చేసే పనులు మామూలుగా ఉండవు. ఓ పిల్లికి సంబంధించిన ఇలాంటి వీడియోనే ప్రస్తుతం తెగవైరలవుతుంది. దీనిని చూసిన వారంతా మొదట కాస్త ఆశ్చర్యానికి గురైనా.. తర్వాత నవ్వు కుంటూ బ్రతుకంటే దీనిదే…

ఎంత సుఖం వచ్చింది పిల్లికి అని అనుకుంటున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పిల్లికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో ఓ నల్లపిల్లి రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకుని ఉంది. ఆ పిల్లి కొంచెం ముద్దుగా, బొద్దుగా, క్యూట్ క్యూట్‌గా ఉంది. దాని పక్కనే ఉన్న ఓ వ్యక్తి మిషన్‌తో ఆ పిల్లికి మసాజ్ చేస్తున్నాడు. ముందు తలపై మసాజ్ చేశారు. తర్వాత ఆ మిషన్‌కు కింద ఉంచగానే పిల్లి తనంతట తానే మసాజ్ చేసుకుంటూ కనిపిస్తుంది.

cat undergoing massage in Viral Video

cat undergoing massage in Viral Video

Viral Video : లైఫ్ అంటే దీనిదే అంటున్న నెటిజన్స్

తర్వాత దాని చెంపలపై నుంచి మరో సారి ఆ వ్యక్తి మసాజ్ చేస్తాడు. ఈ మసాజ్ చేస్తున్నంత సేపు పిల్లి ఊహాలోకంలో విహరిస్తూ ఉంటుంది. తనను తాను మైమరచిపోయి గాల్లో తేలియాడినట్టు అనిపిస్తుంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ పిల్లి లైఫ్‌ను తెగ పొగిడేస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కెయ్యండి మరి.

Advertisement

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి