Viral Video : ‘రాను రాను అంటూనే చిన్నదో సాంగ్‌’కు స్టెప్పులేసిన స్టార్ క్రికెటర్ భార్య.. వీడియో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : ‘రాను రాను అంటూనే చిన్నదో సాంగ్‌’కు స్టెప్పులేసిన స్టార్ క్రికెటర్ భార్య.. వీడియో..!

Viral Video : సోషల్ మీడియా పుణ్యమా అని ఎప్పుడు ఏ సాంగ్, ఏ వీడియో వైరల్ అవుతుందో తెలియడం లేదు. ప్రస్తుతం హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలోని ‘రాను రాను అంటూనే చిన్నదో’ సాంగ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నేటి తరం అమ్మాయిలు, యువత ఈ మాస్ బీట్‌కు తగ్గట్టుగా వారు కూడా రెచ్చిపోయి మరీ స్టెప్పులు వేసేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇలా ఎందులో చూసినా ఈ సాంగే దర్శనమిస్తోంది. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :10 August 2022,12:00 pm

Viral Video : సోషల్ మీడియా పుణ్యమా అని ఎప్పుడు ఏ సాంగ్, ఏ వీడియో వైరల్ అవుతుందో తెలియడం లేదు. ప్రస్తుతం హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలోని ‘రాను రాను అంటూనే చిన్నదో’ సాంగ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నేటి తరం అమ్మాయిలు, యువత ఈ మాస్ బీట్‌కు తగ్గట్టుగా వారు కూడా రెచ్చిపోయి మరీ స్టెప్పులు వేసేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇలా ఎందులో చూసినా ఈ సాంగే దర్శనమిస్తోంది. నితిన్ డెబ్యూ మూవీ ‘జయం’ సినిమాలోని రాను రాను అంటూనే చిన్నదో సాంగ్‌ను రీమెక్ చేసి మాచర్ల నియోజకవర్గం సినిమాలో పెట్టిన విషయం తెలిసిందే. నితిన్ కెరీర్‌లో ఇది తొలి హిట్ చిత్రం కావడం విశేషం.

డైరెక్టర్ తేజ, హీరోయిన్ సదాకు కూడా ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఇక ప్రస్తుతం ఈ మూవీలోని మాస్ సాంగ్ బీట్ నెట్టింట వైరల్ అవుతున్న క్రమంలో దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది. తెలుగు సినిమాలోని పాటను నార్త్ ఇండియన్స్ కూడా తెగ ఏంజాయ్ చేస్తున్నట్టు ఈ వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఎంటంటే టీమిండియా స్టార్ క్రికెటర్ యుజువేంద్ర చాహల్ భార్య ఈ పాటకు అద్భుతంగా స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ధనుశ్రీ వర్మ ప్రముఖ యూట్యూబర్.. యజ్వేంద్ర చాహల్ సతీమణి అయిన ఈవిడ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.

cricketer yuzvendra chahal wife dance video on instagram

cricketer yuzvendra chahal wife dance video on instagram

ఎప్పటికప్పుడు వచ్చే కొత్త కొత్త సాంగ్స్ కు తనదైన మాస్ స్టెప్పులతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే ఈ అమ్మడు మరో సారి తన అందం,అభినయంతో మాస్ డ్యాన్స్ చేసి నెటిజన్స్‌ను ఆకర్షించింది. ‘మీరు మాట్లాడక పోయినా.. మీలో ఉన్న శక్తి ఎప్పుడూ గట్టిగా మాట్లాడుతుంది’ అంటూ తన వీడియోకు ట్యాగ్ లైన్ యాడ్ చేసింది.ధనుశ్రీ కొరియోగ్రాఫర్‌తో పాటే ప్రముఖ యూట్యూబర్, డెంటిస్ట్ కూడా. ధను శ్రీ సొంతంగా ఓ దంత వైద్యశాలను కూడా చూసుకుంటుంది. ప్రస్తుతం ధనుశ్రీ స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది