Viral Video : ‘రాను రాను అంటూనే చిన్నదో సాంగ్‌’కు స్టెప్పులేసిన స్టార్ క్రికెటర్ భార్య.. వీడియో..!

Viral Video : సోషల్ మీడియా పుణ్యమా అని ఎప్పుడు ఏ సాంగ్, ఏ వీడియో వైరల్ అవుతుందో తెలియడం లేదు. ప్రస్తుతం హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలోని ‘రాను రాను అంటూనే చిన్నదో’ సాంగ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నేటి తరం అమ్మాయిలు, యువత ఈ మాస్ బీట్‌కు తగ్గట్టుగా వారు కూడా రెచ్చిపోయి మరీ స్టెప్పులు వేసేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇలా ఎందులో చూసినా ఈ సాంగే దర్శనమిస్తోంది. నితిన్ డెబ్యూ మూవీ ‘జయం’ సినిమాలోని రాను రాను అంటూనే చిన్నదో సాంగ్‌ను రీమెక్ చేసి మాచర్ల నియోజకవర్గం సినిమాలో పెట్టిన విషయం తెలిసిందే. నితిన్ కెరీర్‌లో ఇది తొలి హిట్ చిత్రం కావడం విశేషం.

డైరెక్టర్ తేజ, హీరోయిన్ సదాకు కూడా ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఇక ప్రస్తుతం ఈ మూవీలోని మాస్ సాంగ్ బీట్ నెట్టింట వైరల్ అవుతున్న క్రమంలో దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది. తెలుగు సినిమాలోని పాటను నార్త్ ఇండియన్స్ కూడా తెగ ఏంజాయ్ చేస్తున్నట్టు ఈ వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఎంటంటే టీమిండియా స్టార్ క్రికెటర్ యుజువేంద్ర చాహల్ భార్య ఈ పాటకు అద్భుతంగా స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ధనుశ్రీ వర్మ ప్రముఖ యూట్యూబర్.. యజ్వేంద్ర చాహల్ సతీమణి అయిన ఈవిడ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.

cricketer yuzvendra chahal wife dance video on instagram

ఎప్పటికప్పుడు వచ్చే కొత్త కొత్త సాంగ్స్ కు తనదైన మాస్ స్టెప్పులతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే ఈ అమ్మడు మరో సారి తన అందం,అభినయంతో మాస్ డ్యాన్స్ చేసి నెటిజన్స్‌ను ఆకర్షించింది. ‘మీరు మాట్లాడక పోయినా.. మీలో ఉన్న శక్తి ఎప్పుడూ గట్టిగా మాట్లాడుతుంది’ అంటూ తన వీడియోకు ట్యాగ్ లైన్ యాడ్ చేసింది.ధనుశ్రీ కొరియోగ్రాఫర్‌తో పాటే ప్రముఖ యూట్యూబర్, డెంటిస్ట్ కూడా. ధను శ్రీ సొంతంగా ఓ దంత వైద్యశాలను కూడా చూసుకుంటుంది. ప్రస్తుతం ధనుశ్రీ స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

Recent Posts

Tiffin : మార్నింగ్ టైములో టిఫిన్ తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా..?

Tiffin : మన శరీరం రోజంతా శక్తివంతంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్పాహారం (టిఫిన్) చాలా ముఖ్యం. అల్పాహారం మానేస్తే…

2 minutes ago

Affair : చెల్లెలు భ‌ర్త‌తో స్టార్ హీరోయిన్ ఎఫైర్.. ఆ హీరోని కూడా వ‌ద‌ల్లేదుగా..!

Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…

9 hours ago

TSRTC : రాఖీ సందర్బంగా ఏకంగా 30 % చార్జీలను పెంచిన TSRTC

TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…

10 hours ago

Rakhi Festival : రక్షాబంధన్ స్పెషల్.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన రాష్ట్రాలు!

Rakhi Festival :  రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…

11 hours ago

Holidays : విద్యార్ధుల‌కి గుడ్ న్యూస్.. ఏకంగా 5 రోజులు సెల‌వు..!

Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…

12 hours ago

Best Phones : రూ.15 వేల లోపు ఫోన్ కోసం చూస్తున్నారా.. ఈ ఫోన్స్ బెస్ట్ చాయిస్

Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్‌ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్‌ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…

13 hours ago

Rakhi Gift : ప్రధాని మోడీ రాఖీ గిఫ్ట్ – వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు..!?

Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…

14 hours ago

India : అమెరికా కు భారీ షాక్ ఇచ్చిన భారత్

India  : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…

15 hours ago