Home » News » Crow Helps Hedgehog To Cross The Street
News

viral video : ఒసే ముళ్ల‌పంది రోడ్డు దాటే.. లేదంటే చ‌స్తావ్.. రోడ్డు దాటించిన కాకి

Authored By
mallesh
The Telugu News | Updated on: April 28, 2022 2:12 am
Advertisement

viral video: ప్రాణం విలువ మ‌నుషుల‌కే కాదు ప్రాణం ఉన్న ప్రాణం ఉన్నా ప్ర‌తి జీవికి తెలుస్తుంది. ఓ జీవి ప్ర‌మాదంలో ఉంటే మిగ‌తా జీవులు వెంట‌నే స్పందించి ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డేస్తాయి. ఇలా మ‌నం చాలా సంద‌ర్భాల్లో చూసే ఉంటాం. చిన్న‌ప్పుడు పుస్త‌కాల్లో కాకులు.. ఉడుత‌లు తాబేలు వంటివి స‌హాయం చేసుకునే క‌థ‌లు విన్నాం.. ఇవి క‌థ‌లు మాత్ర‌మే కావు నిజంగా కూడా జ‌రుగుతాయ‌ని కొన్ని ప్రాణులు నిరూపిస్తాయి.ప్రాణం విలువ అనేది మనుషులకు మాత్రమే కాదు. జంతువులకు, పక్షులకు కూడా ఉంటుంది.

Advertisement

వేరే జీవి ఏదైనా ప్రమాదంలో ఉంటే జంతువులు స్పందించి కాపాడడానికి ప్రయత్నిస్తాయి. యజమానిని కాపాడడానికి పాముతో పోరాడి పెంపుడు కుక్కలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో చూసాం.ఓ మినీ ముళ్లపంది రోడ్డు దాటలేక మధ్యలోనే ఆగిపోయింది. అసలే వాహనాలు ఎక్కువగా తిరిగే ప్రదేశం. డ్రైవర్లు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ముళ్లపంది చనిపోయే అవకాశం ఉంది. ఇది గమనించిన ఓ కాకి అక్కడికి వచ్చి ముళ్ల పందిని ముక్కుతో పొడవడం మొదలుపెట్టింది.

Crow Helps Hedgehog to Cross the Street

Advertisement

దీంతో ఆ జీవి కొంచెం ముందుకు కదలసాగింది. కొంతదూరం వెళ్లి ఆగిపోవడంతో మ‌ళ్లీ ముక్కుతో కదిలిస్తే కొంచెం దూరం కదులుతోంది. ఇలా ముళ్లపందిని చివరి వరకు రోడ్డు క్రాస్‌ చేపించి దాన్ని ప్రాణాన్ని కాపాడింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కాకి మాన‌వ‌త్వానికి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. మ‌నుషులు కూడా ఇలా ఆప‌ద‌లో ఉన్న అంద‌రికీ సాయం చేస్తే ఎంత బాగుంటుందో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి