Viral Video : ఎలుక, కాకి మధ్య భీకర ఫైట్.. ఎందుకో తెలుసా?
Viral Video : కాకి, ఎలుక కలుసుకోవడం మీరెప్పుడైనా చూశారా..? దాదాపుగా సాధ్యపడదు. ఎందుకంటే.. కాకి హాయిగా నింగిలో ఎగురుతుంటుంది. ఎలుక భూమి మీద తిరుగుతుంటుంది. కానీ, ఎలుక, కాకి ఇక్కడ కలవడమే కాదు.. ఒక దానిపైన మరొకటి తీవ్రమైన ద్వేషం పెంచుకున్న మాదిరిగా ఫైట్ చేసుకుంటున్నాయి కూడా. ఇదంతా ఎక్కడ జరిగిందంటే.. ఓ వైరల్ వీడియోలో నండోయ్.. దానిని ఎవరు షేర్ చేశారంటే..లవ్ లీ యానిమల్స్ లవ్ లీ అనే ఇన్ స్టా గ్రామ్ యూజర్ ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేసిన
ఈ వీడియోలో కాకి, ఎలుక తలపడుతున్నాయి.కాకి బుల్లి ఎలుకపైన తన ప్రతాపం చూపింది. కాకి తన నోటితో ఎలుక తోక పట్టుకుని పైకి లేపి అలా తిప్పుతూ భయపెడుతోంది. ఈ క్రమంలో ఎలుక కూడా తెలివిగా కాకిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తోంది. తన కాళ్లతో కాకి కాళ్లపైన తాకుతూ కాకిని.. డైవర్ట్ చేస్తుంది. అలా కాకి, ఎలుక బహిరంగ యుద్ధం చేసుకున్న మాదిరిగానే తలపడుతున్నాయి.ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

crow mouse fighting video viral in social media
Viral Video : రోడ్డు మీదనే అలా బహిరంగ యుద్ధానికి దిగిన కాకి, ఎలుక..!
ఇంతకీ ఇవి ఎందుకు ఇలాగా ఫైట్ చేసుకుంటున్నాయని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా, మరి కొందరు నెటిజన్లు అయితే వీటి ఫైట్ చూసి సైలెంట్ అయిపోతున్నారు. మొత్తంగా కాకి, ఎలుక ఫైట్ వెరీ ఫన్నీ అని కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
View this post on Instagram