Viral Video : ఈ కుక్క ఎంత ముద్దుగా స్కేటింగ్ చేస్తుందో చూడండి.. చివరికు..

Authored By mallesh | The Telugu News | Updated on : 11 March 2022, 11:00 am

Viral Video : సోషల్ మీడియాలో పెంపుడు జంతువులు చేసే చేష్టలు అందరికీ నవ్వును తెప్పిస్తాయి. పలువురు వ్యక్తులు వారు అపురూపంగా పెంచుకునే పెంపుడు జంతువులు చేసిన ఫీట్లను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. ఈ వీడియోలు చాలా సరదాగా ఉంటాయి. ఎవరు చూసినా కానీ ఇట్టే నవ్వును తెప్పిస్తాయి. మనలో ఉన్న స్ట్రెస్ ను ఇట్టే దూరం చేస్తాయి. అలా ఒక కుక్క వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

ఈ కుక్క వీడియోను చూసిన పలువురు నెటిజన్లు కుక్క చాలా క్యూట్ గా ఉందని కామెంట్లు చేస్తున్నారు.కుక్కలు దొంగల్ని అవలీలగా పట్టిస్తాయి. మన ఆస్తులను చాలా సురక్షితంగా కాపాడుతాయి. ఇందుకు సంబంధించిన ఘటనలు మనం ఇది వరకు చూశాం.. విన్నాం.. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కుక్క గురించి తెలిస్తే మనం షాక్ కు గురవుతాం. ఏంటీ కుక్క స్కేటింగ్ చేస్తోందా? అని ముక్కున వేలేసుకుంటాం.

dog skating in video viral 

dog skating in video viral

Viral Video : ఇంతకీ ఈ కుక్క వీడియోలో ఏముందంటే…

అవునండీ బాబూ.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో కుక్క చాలా చక్కగా స్కేటింగ్ చేస్తుంది. అంతే కాకుండా తను స్కేటింగ్ చేసేటపుడు యాక్సిడెంట్ అయినా కానీ చాలా చాకచక్యంగా తప్పించుకుంది. స్కేటింగ్ చేయాలంటే మనుషులకే చెమటలు పడతాయి. కానీ అలాంటిది ఈ కుక్క మాత్రం చాలా ఈజీగా స్కేటింగ్ చేసేసింది. కావాలంటే ఈ కుక్క ఎంత ముద్దుగా స్కేటింగ్ చేస్తుందో మీరూ చూసేయండి. మీకు ఏమని అనిపించిందో వెంటనే కామెంట్ చేయండి.

https://twitter.com/Yoda4ever/status/1500803447859253257

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp