Home » News » Have You Ever Seen A Plant Which Shoots Its Seeds Video Viral
News

Viral Video : ఆ చెట్టును టచ్ చేస్తే చాలు.. బుల్లెట్స్ లా దాని సీడ్స్ దూసుకొస్తాయి.. కారణం ఏంటో తెలుసా?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: February 28, 2022 11:07 pm
Advertisement

Viral Video : చెట్లలోనూ చాలా రకాలు ఉంటాయి. ఒక్కో చెట్టుకు ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని చెట్లు అయితే విపరీతంగా ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. అటువంటి చెట్ల కింద కాసేపు కూర్చున్నా చాలు.. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నిజానికి.. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల వింత చెట్లు కూడా ఉంటాయి.

Advertisement

కొన్ని చెట్లను ముట్టుకుంటే షాక్ తగులుతుంది. మరికొన్ని చెట్లను ముట్టుకుంటే గోకుడు పెడుతుంది. ఇంకొన్ని చెట్లకు ముండ్లు ఉంటాయి. వాటిని ముట్టుకుంటే రక్తం కారడమే.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో దేనికి సంబంధించింది అంటే.. ఓ చెట్టు దాని కాయలను టచ్ చేస్తే చాలు.. అందులో నుంచి గింజలు బయటికి దూసుకువస్తాయి.

have you ever seen a plant which shoots its seeds video viral

Advertisement

Viral Video : టచ్ చేస్తే చాలు.. గింజలను వెదజల్లుతోంది

చూడటానికి అది అచ్చం బెండకాయలా ఉంటుంది. దాన్ని కట్టెతో తాకినా చాలు.. వెంటనే అందులోనుంచి గింజలు బయటికి బుల్లెట్స్ లా దూసుకువస్తున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. గన్ లో నుంచి బుల్లెట్స్ బయటికి వచ్చినట్టుగా.. వస్తున్నాయి అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి