
chaitu spits on ashu reddy
Ashu Reddy: బిగ్ బాస్ ఓటీటీ షో ఇప్పుడు తెగ సందడి చేస్తుంది. ఇటీవల 17 మంది కంటెస్టెంట్స్‌తో షో మొదలు కాగా, ఇందులో జూనియర్స్, సీనియర్స్ తెగ సందడి చేస్తున్నారు. అయితే షో మూడో రోజుకి చేరుకుంది. సోమవారం జనరల్‌గా నామినేషన్స్ ఉంటాయి. ఈ ప్రక్రియ ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంది. మొదటి వారం ఎలిమినేషన్‌కి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. ఇందులో నటరాజ్ మాస్టర్, అరియానా, సరయు, హమీద, ముమైత్ ఖాన్, మిత్రా శర్మ, ఆర్జే చైతూ నామినేట్ అయ్యారు. మరి మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.అయితే హౌజ్‌లోని కంటెస్టెంట్స్ వారికి వారే టాస్కులు ఇచ్చుకుంటూ సరదాగా కాలం గడుపుతున్నారు.
సీనియర్స్‌లా భావిస్తున్న వారియర్స్‌కు షాకిస్తూ చాలెంజర్స్‌కు ఆధిపత్యం చెలాయించే అవకాశమిచ్చాడు బిగ్ బాస్. ఛాలెంజర్స్ అనుమతి లభించిన ఒక వారియర్ మాత్రమే బెడ్రూమ్‌లో నిద్రపోయే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. చాలెంజర్స్ భోజనం చేశాక వారియర్స్ విందు ఆరగించాలని కండీషన్ పెట్టాడు.వారియర్స్ అందరూ మాజీ కంటెస్టెంట్లే కాబట్టి వారికి హౌస్‌ను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలన్న అవగాహన ఉంటుంది. దీంతో ఇంటి పనులన్నీ వారియర్స్‌కే అప్పజెప్పాడు. ఒకవేళ పనులు చేయకపోతే జూనియర్స్ అయిన చాలెంజర్స్ వారిని శిక్షించవచ్చన్నాడు. ఇక వారియర్స్‌తో సేవలు చేయించుకునే అవకాశం ఉండటంతో చైతూ.. అషూని ఓ ఆటాడుకున్నాడు.
chaitu spits on ashu reddy
వాటర్ తీసుకురమ్మని చెప్పడంతో ఆమె బాటిల్‌లో నీళ్లు తీసుకొచ్చింది. తాగించమని చైతూ అడగడంతో అషురెడ్డి తాగించింది. అలా తాగిస్తున్న క్రమంలో చైతూ నీళ్లను ఊసేయడంతో అవి అషూ మీద పడ్డాయి. దీంతో హౌస్‌మేట్స్ అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.బిగ్ బాస్ ఓటీటీకి కూడ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. మూడో సీజన్ నుండి నాగార్జున పూర్తిగా బిగ్ బాస్ కి స్టిక్ అయ్యారు. కొందరు అతనిపై విమర్శలు చేస్తుండగా, మరి కొందరు మాత్రం నాగార్జున హోస్టింగ్ బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.