Viral Video : కోతితో మజాక్.. తిక్కలేసిన వానరం ఏం చేసిందంటే..?

 Authored By mallesh | The Telugu News | Updated on :30 January 2022,8:20 am

Viral Video : సాధారణంగా వానరాలు వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయి. ఆహారం కడుపునిండా దొరికిందంటే చాలు లాగించేసి హాయిగా చెట్ల మీద లేదా కొండప్రాంతాలపై సేదతీరుతాయి. వాటంతట అవి ఎవరి జోలికి వెళ్లవు. ఎవరిని ఏమి అనవు. వాటిని రెచ్చిగొట్టి చిరాకు తెప్పిస్తే మాత్రం మీద పడి కొరికేస్తాయి. కొందరు వానరాలను పెంచుకోవడానికి మనం గమనించవచ్చు. బేబి కోతిని తెచ్చుకుని దానిని ఇంట్లో పర్సన్ లాగా చూసుకుంటారు. దానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. ఒక్కసారి వానరం అలవాటు పడిందంటే యాజమానులను వదిలి వెళ్లవు. కొన్ని మాత్రం మేజిషియన్స్ వద్ద ట్రెయినింగ్ పొందుతుంటాయి.

అవి రకరకాల సర్కస్ ఫీట్స్ కూడా చేస్తూ అందరినీ నవ్విస్తాయి.ఈ మధ్యకాలంలో వానరాలతో కొందరు వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో తెగ పాపులారిటీని సంపాదిస్తున్నారు. వాటితో ఆటాడటం, జోక్స్ చేయడం దీంతో అవి చేసే ఫన్నీ ఫీట్స్ ను షూట్ చేసి నెట్టింట పోస్టు చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. కోతులు కూడా తెలివి ఉంటుందట.. ఎందుకంటే మనిషి ఉద్భవించింది కూడా కోతుల నుంచే అని మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకుని ఉన్నాం..

joke with a monkey the battered monkey Viral Video

joke with a monkey the battered monkey Viral Video

Viral Video : కామెడీ కాస్త సీరియస్ అయితే..

తాజాగా ఫైజిన్ సెజిన్ అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్టు అయిన ఓ వీడియాలో నెట్టింట సందడి చేస్తుంది. ఓ వ్యక్తి కామ్‌గా కూర్చున్న కోతితో మజాక్ చేస్తుంటాడు. దాని చేతికి కత్తి లాంటి వస్తువు ఇచ్చి తన తలపై కొట్టించుకుంటాడు. కోతి కోట్టకపోయిన తన చేత్తో పట్టుకుని కొట్టించుకుంటాడు. తీరా దానికి కోపం వచ్చి బలంగా ఒక్కటి వేస్తుంది. దీంతో వ్యక్తి నొప్పి భరించలేక అక్కడినుంచి వెళ్లిపోతాడు. పిలిచి మరీ తన్నించుకోవడం అంటే ఇదేనని కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి