Maha Shivaratri : శివరాత్రి రోజు ఇంట్లోని పూజా మందిరంలోకి వెళ్లి శివ ధ్యానం చేసిన పిచ్చుక.. వైరల్ వీడియో..!

Authored By Ramu | The Telugu News | Published on: March 8, 2024, 2:15 pm
  •  Maha Shivaratri : శివరాత్రి రోజు ఇంట్లోని పూజా మందిరంలోకి వెళ్లి శివ ధ్యానం చేసిన పిచ్చుక.. వైరల్ వీడియో..!

Maha Shivaratri : మ‌హాశివ‌రాత్రి అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకు ఇప్పటివరకు సరైన సమాధానం ఎవరు ఇవ్వలేరు.కానీ మనిషి మాత్రం దైవభక్తితో ఎన్నో రకాల దేవుళ్లకు పూజలు చేస్తూ ఉంటారు.దేవుడు అంటే భక్తి, భయం. అందుకే ప్రపంచంలో ఎన్నో దేవాలయాలు వెలిశాయి. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఆయా మతస్తులు దైవాన్ని తమ పద్ధతుల్లో పూజిస్తుంటారు. ఇక భారత్ లో భక్తికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకే ఇక్కడ అన్ని రకాల దేవుళ్లకు దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ భక్తులు దేవుళ్ళపై ఎంతో నమ్మకాన్ని ప్రదర్శిస్తుంటారు అప్పుడప్పుడు దేవుడు కొన్ని లీలలు చూపిస్తున్నారని గట్టిగా నమ్ముతుంటారు. ఇది ముమ్మాటికి దైవసంకల్పమే అని అంటారు.

అయితే మహాశివరాత్రి సందర్భంగా ఓ పిచ్చుక ఓ ఇంట్లోకి వెళ్లి పూజా మందిరంలో కూర్చుంది. అది అలా కదలకుండా చాలాసేపు కూర్చోవడంతో శివ ధ్యానం చేసిందని భక్తులను నమ్ముతున్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన జగిత్యాల లోని ధర్మపురిలో జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ వీడియోలో ఓ పిచ్చుక ప్రధాన ద్వారం నుండి నేరుగా ఇంట్లోకి చేరి పూజా మందిరంలోకి వెళ్లి కూర్చుంది. చాలా సమయం వరకు కదలకుండా శివ ధ్యానంలో ఉన్నట్లు ఆ పిచ్చుక కూర్చోవడం గమనార్హం.

దీంతో శివరాత్రి సందర్భంగా ఆ పిచ్చుక శివ ధ్యానం చేసేందుకు పూజా మందిరంలోకి వెళ్లిందని భక్తులు నమ్ముతున్నారు. ఇక ఇంట్లోని వాళ్ళు పిచ్చుక ఇంట్లోకి రావటానికి పూజా మందిరంలోకి వెళ్లడాన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. దేవుడు పక్షులు, జంతువులు రూపంలో ఇంటికి వస్తాడని అంటారు. శివరాత్రి సందర్భంగా పరమ శివుడే పిచ్చుక రూపంలో ఆ ఇంటికి వచ్చాడని కొందరు భక్తులు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నాస్తికులు దీనిని కొట్టిపారేస్తున్నారు. ఆ పిచ్చుక రోజు ఆ ఇంటికి రావడం అలవాటై ఉంటుందని, పూజ మందిరంలో ఉండే ఫలహారాలను తినేందుకు అది అలా అలవాటై ఉంటుందని, ఆ ఇంట్లోనే వాళ్ళు దానిని అలవాటు చేసుకుని ఉంటారని, శివరాత్రి రోజు వీడియో తీసి ఉంటారని అంటున్నారు.

Ramu

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp