Viral Video : అదృష్టమంటే నీదే.. ఒక్క క్షణంలో చావును ఎలా తప్పించుకున్నాడో చూడండి.. వీడియో

Authored By Jagadesh Gatla | The Telugu News | Published on: January 15, 2022, 7:00 am

Viral Video : దేనికైనా రాసిపెట్టి ఉండాలి అంటారు పెద్దలు. ఈ భూమ్మీద బతకాలంటే కూడా మనం తినే మెతుకుల మీద మన పేరు రాసి పెట్టి ఉండాలట. ఈ భూమ్మీద నూకలు ఉన్నంత కాలం ఎవ్వరూ ఏం చేయలేరు అనేది మరోసారి నిరూపితం అయింది.ఒక్క క్షణంలో ప్రాణాలు కాపాడుకున్న వాళ్లను ఎంతో మందిని చూశాం. ఒక్క క్షణంలో యాక్సిడెంట్ కాకుండా తప్పించుకున్న వాళ్లను చూశాం.

ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో క్షణాల్లో ప్రాణాలను కాపాడుకున్నవాళ్ల వీడియోలు చూశాం. కానీ.. ఈ వీడియో మాత్రం చాలా డిఫరెంట్.ఒక వ్యక్తి రోడ్డు మీద నిలబడ్డాడు. తను ఏదో ఆలోచిస్తూ అక్కడ నిలబడ్డాడు. ఇంతలో సడెన్ గా పైనుంచి పెద్ద పెద్ద మట్టి పెల్లలు కింద పడ్డాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అక్కడి నుంచి దూరం పరిగెత్తాడు ఆ వ్యక్తి.

man escaped death in a second video viral

man escaped death in a second video viral

Viral Video : ఒక్క క్షణం ఆలస్యమైనా అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి

ఏమాత్రం ఆలస్యం చేసినా ఆ వ్యక్తి ఇప్పుడు బతికి ఉండేవాడు కదా. వాటి కింద పడి నలిగిపోయేవాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అదృష్టవంతుడివి.. లేకపోతే ఎప్పుడో పైకి పోయి ఉండేవాడివి అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరి.

https://twitter.com/guldurbakalim/status/1480786483544043521?s=20

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp