Viral Video : నువ్వు గ్రేట్ బాసు.. ఒక్క క్షణం ఆలస్యం అయితే కోతి ప్రాణాలు పోయేవి.. కోతిని బతికించిన ఈయనకు సలాం కొడుతున్న నెటిజన్లు

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 13 December 2021, 6:20 pm

Viral Video : ఈరోజుల్లో మానవత్వం ఉందా అసలు. తోటి మనిషి చనిపోతున్నా కూడా పట్టించుకునే వాళ్లు కరువయ్యారు. రోడ్డు మీద మనిషి నిస్సాయకస్థితిలో ఉన్నా పట్టించుకునే నాథుడు లేడు.. అంటూ అనేవాళ్లను చూస్తూనే ఉన్నాం. కానీ.. మానవత్వం ఇంకా బతికే ఉంది. ఎవరో ఒక్కరు తప్పు చేస్తే అందరు మనుషులను నిందించడం సరికాదు అని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ.ఒక కోతి ప్రాణాలు కాపాడటం కోసం ఈ వ్యక్తి చేసిన ప్రయత్నాన్ని చూస్తే హ్యాట్సాఫ్ చెప్పాల్సితే. చేతులెత్తి దండం పెట్టాల్సిందే. ఆ వ్యక్తి కనుక నాకెందుకులే అని వదిలేసి ఉంటే.. నేడు ఆ కోతి ప్రాణాలు దక్కేవి కావు.

ఈ ఘటన తమిళనాడులోని కున్నమ్ తాలుకాలో చోటు చేసుకుంది.పెరంబలూర్ కు చెందిన 38 ఏళ్ల ప్రభు.. కారు డ్రైవర్. డిసెంబర్ 9న కారులో వెళ్తుండగా.. ఓ చెట్టు కింద ఓ కోతి పడిపోయి ఉంది. కొన్ని కుక్కలు దాన్ని గెదమడంతో అది చెట్టు కింద అచేతన స్థితిలో పడి ఉంది. దానికి గాయాలు కూడా అయ్యాయి.వెంటనే ప్రభు అక్కడికి వెళ్లి ఆ కోతికి కొన్ని నీళ్లు తాగించాడు కానీ.. ఆ కోతి లేవలేదు. అలాగే స్పృహ తప్పి పడిపోయి ఉంది. దీంతో ఏం చేయాలో తెలియక.. దాని చాతి మీద బలంగా నొక్కాడు. అయినా కూడా అది శ్వాసను తీసుకోలేకపోయింది. దీంతో తన నోటితో దాని నోట్లోకి గాలి ఊదడం ప్రారంభించాడు.

man resuscitates wounded monkey viral video

man resuscitates wounded monkey viral video

Viral Video : కోతికి ప్రథమ చికిత్స చేసి.. నోట్లో నోరు పెట్టి గాలి ఊదడంతో ప్రాణాలతో బయట పడ్డ కోతి

అలా కాసేపు నోట్లో నోరు పెట్టి గాలి ఊది.. ఆ తర్వాత దాని చాతి మీద బలంగా నొక్కాడు. దీంతో అది లేచి కూర్చుంది. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాని ప్రాణాలు తిరిగి వచ్చినప్పటికీ అది నీరసంగా ఉండటంతో దాన్ని వెటర్నరీ ఆసుపత్రికి తరలించాడు. అక్కడ డాక్టర్ దానికి ట్రీట్ మెంట్ చేశాక.. దాన్ని తీసుకెళ్లి అటవీ శాఖ అధికారులకు అప్పగించాడు ప్రభు. ప్రభు చేసిన పనికి నెటిజన్లు అయితే మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఒక కోతి కోసం ఇంత విలవిలలాడిపోయావు. నువ్వు గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక నిండు ప్రాణాన్ని కాపాడావని అందరూ సలాం కొడుతున్నారు.

Advertisement

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి