Viral News : నడి రోడ్డుపై ప్రేమికుడి కోసం ఇద్దరు మైనర్ యువతుల కొట్లాట.. జుట్టూ జుట్టూ పట్టుకుని మరి..!
Viral News : ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా ప్రేమ వ్యవహారాలు హాట్ టాపిక్ గా నిలిస్తున్నాయి. వయసుతో సంబంధ లేకుండా యువతి యువకుల లవ్ ఎఫైర్లు విపరీతంగా పెరిగి పోయాయి. అందులో కొంత మంది ప్రేమించి.. పెళ్లిచేసుకుంటుంటే.. మరికొంత మంది వివాదాలతో మధ్యలోనే విడిపోతున్నారు. అయితే.. తాజాగా వైజాగ్ లో బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిలు రోడ్డుపైనే జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ప్రియుడి కోసం బజారులో అందరూ చూస్తూ వుండగానే అసభ్య పదజాలంతో దూషించుకున్నారు..
ఇప్పుడు ఈ తంతు సోషల్ మీడియాలో వైరల్ గా మారిందివిశాఖ జిల్లా అనకాపల్లిలో ఓ ప్రియుడి కోసం అతని ప్రియురాళ్లు రోడ్డెక్కి మరి కొట్టుకున్నారు. ప్రేమ గుడ్డిదని నిరూపించిన ఈ యువతులిద్దరూ మైనర్ బాలికలు కావడం మరీ ప్రత్యేకం. వాడు నావాడు అంటే.. నా వాడు అంటూ.. వారిద్దరూ జుట్టూ జుట్టూ పట్టుకుని ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. చెవులు మూసుకునేలా తిట్టరాని భూతులు తిట్టుకున్నారు. పక్క వాళ్లు ఆపిన ఆగకపోయేసరికి..

minor girls fight the road about boyfriend in vizag went viral in social media
Viral News : నడిరోడ్డుపై జుట్టూ జుట్టూ పట్టుకుని..!
ఈ వ్యవహారం ఇక్కడితో ఆగదు అనుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగం లోకి దిగిన పోలీసులు వారిద్దరి మధ్య గొడవను సద్దుమనిగించారు.ఇద్దరు యువతుల్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని స్టేషన్ కు తరలించారు. ఆ ఇద్దరు యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఆ బాలికల తల్లిదండ్రులను పిలిపించి వారికీ జరిగిన విషయమంతా చెప్పి వారిని ఇంటికి పంపారు.
