
Na Sami Ranga Movie Trailer : కిష్టయ్యని కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా.. నా సామిరంగా ట్రైలర్ విడుదల..!
Naa Sami Ranga Movie Trailer : అక్కినేని నాగార్జున Akkineni Nagarjun హీరోగా విజయ్ బన్నీVijay Bunny దర్శకత్వంలో ‘ నా సామి రంగా ‘ Na Sami Ranga Movie సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. పవన్ కుమార్ సమర్పకులు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, Allari Naresh రాజ్ తరుణ్ Raj Tarun కూడా నటించారు. గతంలో టీజర్ విడుదల చేశారు. అది అందరిని ఆకట్టుకుంది. జనవరి 14న విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. చిత్ర యూనిట్ ఈ ట్రైలర్ రెండు నిమిషాలు 33 సెకండ్ల నిడివి కలిగి ఉంది. అల్లరి నరేష్ వాయిస్ తో ట్రైలర్ ప్రారంభించారు. ఎవరైనా ఈ ఊర్లో ఉన్నారా అంటూ అల్లరి నరేష్ అడగ్గా కొందరు రౌడీలు నాగార్జున మీదకు దూసుకు వస్తారు. లుంగీ కట్టుకొని స్టైల్ గా బీడీ తాగుతూ నాగార్జున వారితో ఫైటింగ్ చేయడం అదిరిపోయింది. తర్వాత రాజ్ తరుణ్ ఈల వేస్తూ ఎంట్రీ ఇచ్చాడు.
అరే అంజి ఏస్కో అంటూ నాగార్జున చెప్పగానే అల్లరి నరేష్ డబ్బులు కొడుతుండగా డాన్స్ చేస్తూ కనిపిస్తాడు. ఇక ఆ తర్వాత అన్నయ్య వరాలు నిన్ను రమ్మంటుంది అంటూ నాగార్జునకు చెబుతూ కనిపిస్తాడు. ఆ వెంటనే హీరోయిన్ల పాత్రలు కూడా పరిచయం చేశారు. హీరోయిన్ ఆషికారంగనాథ్ అందంగా ముస్తాబై కారులోంచి దిగుతుండగా..రాజ్ తరుణ్ ఆమె ఎవరని అడుగుతాడు. వెంటనే అల్లరి నరేష్ మన క్రిష్ణయ్య లవ్స్ అంటూ చెప్పగా..రాజ్ తరుణ్ నోరెళ్ళ పెడతాడు. వెంటనే కృష్ణయ్య నరకడం తెలుస్తాది కానీ సరసం ఎలా తెలుస్తది అంటాడు. ఆ వెంటనే నాగార్జున మీసాలు మెలేస్తూ హీరోయిన్ ను చూస్తాడు. ఇంత అందంగా ముస్తాబయి వచ్చావ్ ఏంటి అడుగుతాడు. ఆషికా నాగార్జునను చూసే విధానం అయితే అదిరిపోయింది. నువ్విట్ట సినిమాకు వస్తే నా సామి రంగా అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ మరింతగా ఆకట్టుకుంది.
అటు తర్వాత విలను పరిచయం చేసి మాస్ యాంగిల్ లోకి టర్న్ తీసుకున్నారు. నాగార్జున యాక్షన్ ఎపిసోడ్స్ లో తన గ్రేస్ ని చూపించారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ రోజుల్లో జరిగే కథ ఇది అని స్పష్టం అవుతుంది. గ్రామీణ వాతావరణం లో జాతర సెటప్ వంటివి కూడా ట్రైలర్లో చూపించారు. సంక్రాంతి పండుగకి తగ్గ సినిమా అని క్లారిటీ ఇచ్చారు. దీంతో ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. నాగార్జున మాస్ యాంగిల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలో హీరోయిన్గా ఆషికా రంగనాథన్ నటించారు. ప్రసన్నకుమార్ బెజవాడ ఈ సినిమాకి కథను అందించారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందించారు. అలాగే శివేంద్ర దాశరధి సినిమా ఆటోగ్రాఫర్గా పనిచేస్తుండగా, ఛోటా కె. ప్రసాద్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించారు. దినేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అవ్వపోతుంది. ముఖ్యంగా 14వ తేదీ భారీ ఎత్తున అంచనాల నడుము విడుదల కాబోతుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.